Why Can Small Habits Lead To Best Changes?

Why Can Small Habits Lead To Best Changes?

Why can small habits lead to big changes?

చిన్నచిన్న అలవాట్ల వల్ల ఎందుకు భారీ మార్పులు వస్తాయి?

చిన్న habits వ్యక్తి వికాసానికి చక్రవడ్డీలా పరిణమిస్తాయి. ఏ విధంగా అయితే మన ఆదా చేసిన డబ్బు చక్రవడ్డీవల్ల పెరుగుతుందో, అదే విధంగా మీ అలవాట్లని రిపీట్ చేయడం వలన అభ్యున్నతి వరిస్తుంది. ఏరోజుకారోజు బేరీజు వేసుకుంటే కొద్ది వ్యత్యాసం మాత్రమే కనిపిస్తుంది. కానీ నెలలు, సంవత్సరాలు పెరిగేకొద్దీ వాటి ప్రభావం అద్భుతంగా ఉంటుంది. మంచి habits చేసుకున్న సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో, ఐదు లేదా పది సంవత్సరాలకో స్ఫుటంగా ఫలితాలు కన్పిస్తాయి. అదే విధంగా చెడుఅలవాట్ల ప్రభావం కూడా తెలుస్తుంది.

నిత్యజీవితంలో యిదో కష్టమైన అంశంగా అనిపిస్తుంది. మనం ప్రతి సందర్భంలో చిన్నచిన్న మార్పుల ప్రభావాన్ని అంతగా గమనించం. మీరు కొద్దిపాటి డబ్బుని ఆదా చేయడం వలన వెంటనే కోటీశ్వరులు అయిపోరు. మీరు ఓ మూడురోజులు జిమ్కి వెళ్ళినంతమాత్రాన మీ ఆకృతిలో మార్పురాదు. మీరు ఓ కొత్త భాషని ఈ రోజు రాత్రి ఒక గంట నేర్చుకున్నంత మాత్రాన మీకు భాష వచ్చేయదు. మీరు కొన్ని మార్పులు చేసుకున్నంత మాత్రాన ఫలితాలు తక్షణమే కన్పించవు. అందువలన వెంటనే మనం మన పూర్వ అలవాట్లల్లోకి జారుకుంటాం.

దురదృష్టవశాత్తు నెమ్మదిగా మార్పు వస్తున్న క్రమంలో చెడు habits వైపు జారిపోవచ్చు కూడా. మీరు అనారోగ్య ఆహారం తీసుకున్న వెంటనే మీలో మార్పు వుండకపోవచ్చు. మీరు మీ పనిలో మునిగిపోయి మీ కుటుంబాన్ని విస్మరించారనుకోండి, మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు. మీరు చేస్తున్న పనిని వాయిదా వేశారనుకోండి, ఆ తరువాత ఆ పనిని పూర్తిచేయడానికి సమయం తక్కువయిపోతుంది. ఒక్కో నిర్ణయాన్ని వదిలి పెట్టడం సులభమే.

కాని అదే పనిగా ఒక్కశాతం తప్పులని తప్పుడు నిర్ణయాలతో చేస్తూ పోయామను కోండి, చిన్నచిన్న తప్పులని పదేపదే చేయడంతో, వాటిని సర్ది చెప్పుకుంటే, ఆ చిన్న నిర్ణయమే పలు భయంకరమైన ఫలితాలకి కారణమవ్వవచ్చు. పలు చిన్నచిన్న తప్పుల సమ్మేళనం కూడా అక్కడ ఒక్కశాతం తరుగుదల, క్రమంగా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది.

మీ habits లోని మార్పుల ప్రభావాన్ని ఆకాశంలో ఎగిరే విమానం గతిని కొన్ని డిగ్రీలు మార్పు చేయడం లాంటిది. ఉదారణకి మీరు లాస్ఏంజెల్స్ నుండి న్యూయార్క్

ప్రయాణం చేస్తున్నారు. విమానం పైలెట్ 3.5 డిగ్రీల దక్షిణానికి కక్ష్యని మార్చాడు. దానివల్ల న్యూయార్క్ కాకుండా వాషింగ్టన్లో దిగవలసి వస్తుంది. కేవలం 3.5 డిగ్రీల మార్పు నిజానికి టేకాఫ్ సమయంలో అంతగా గుర్తించదగింది కూడా కాదు. కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అతితక్కువ డిగ్రీల తేడా కొన్నివేల కిలోమీటర్ల దూరంలో వుండే ప్రాంతానికి చేరుస్తుంది.

Small habits

అదేవిధంగా మీ రోజు habits లో కొద్దిపాటి మార్పు మీ జీవితాన్ని వేరే గమ్యాలకు చేరుస్తుంది. మీ ఉన్నతకి దోహదపడే ఒక్కశాతం మార్పు తెచ్చుకుంటారా లేదా మీరు వెనక బడడానికి ఒక్కశాతం మార్పు తెచ్చుకుంటారా అనేది ఆ సందర్భంలో అంత ప్రాధాన్యత గలిగి వుండదు. కానీ కాలం గడుస్తున్నకొద్ది. ఆ చిన్నపాటి నిర్ణయమే మీరు ఏ స్థాయిలో వున్నారో, ఏ స్థాయిని చేరుకోగలరో నిర్ణయిస్తుంది. విజయం ప్రతిరోజు అవలంబించే habits ఫలితమే – ఒక్కసారి కాదు – జీవనరూపురేఖలని ఆ habits మార్చగలవు.

మీరు అందుకున్న ఫలితాలు మీ habits పరిణామాలే. మీ నెట్వర్క్ మీ ఆర్ధిక అలవాట్ల ప్రమాణమే. మీ బరువు మీ ఆహార అలవాట్ల కొలమానం. మీ జ్ఞానసంపద మీ అభ్యాసపు అలవాట్ల కొలమానం. మీరు వున్న పరిసరాలు మీ పరిశుభ్రత అలవాట్ల ప్రతిబింబం. మీరు అందుకుంటున్నది, మీరు పదేపదే వేటిని చేస్తారో వాటి ఫలితమే.

మీరు ప్రస్తుతం విజేతలుగా వున్నారా? పరాజితులుగా వున్నారా అనేది ముఖ్యం కాదు. మీ habits మిమ్మల్ని సరైన విజయపథంలో నడిపిస్తున్నాయా లేదా అనేది ముఖ్యం. మీరు ప్రస్తుతం ఏ దారిలో వున్నారన్నది ముఖ్యంకానీ ప్రస్తుతం మీరు అందుకుంటున్న ఫలితం కాదు. మీ ఖర్చు చేసే అలవాట్లని కూర్చుకోలేకపోతే ఫలితాలు ప్రతికూలంగా వుంటాయి. అలాకాకుండా, మీరు మీ దుబారా అలవాట్లని మార్చుకుని, నెలకి కొద్దిగా పొదుపు చేయడం మొదలు పెడ్తా మీరు క్రమంగా ఆర్ధిక స్వాతంత్య్ర దిశగా సాగిపోగలుగుతారు. మీరు ఆశించినదానికన్నా నెమ్మదిగా ఆర్థిక పరిపుష్టివైపు సాగుతున్నట్టుగా భావిస్తారు.

మీరు మీ భవిష్యత్తుని ఊహించి, జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటారో వూహించాలను కుంటారు. మీరు పొందిన చిన్నచిన్న విజయాలని లేదా పరాజయాలని, వాటికి కారణమైన మీ ప్రతిరోజు అలవాటని లెక్కకడితే, మీరు చేరే గమ్యాలన్నీ మీ habits ఫలితంగా అర్థమవుతుంది. మీరు నెలలో సంపాదించినదానికన్నా తక్కువగా ఖర్చుపెడ్తున్నారా? ప్రతిరోజు జిమ్కి వెళ్తున్నారా? ప్రతిరోజు పుస్తకాలని చదువుతూ ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారా? చిన్నచిన్న ఇటువంటి విషయాలు మీ భవిష్యత్తుని నిర్వచిస్తాయి.

కాలమే విజయానికి పరాజయానికి మధ్య వుండే వ్యత్యాసాన్ని పెంచుతుంది. మంచి habits కాలాన్ని మంచి మిత్రుడులా చేస్తే, చెడు అలవాట్లు కాలాన్ని శత్రువుని చేస్తాయి.

Habits రెండువైపుల పదునైన కత్తిలాంటివి. చెడు అలవాట్లు మిమ్మల్ని వెనకబడేస్తే, మంచి అలవాట్లు మీకు అభివృద్ధిని అందిస్తాయి. అందువల్లే వివరాలు గ్రహించడం అతిముఖ్యమైనది. మీకు అలవాట్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో గ్రహించాలి. దానివల్ల కాలమనే కత్తి గాయ పర్చకుండా వుంటుంది.

నిజమైన అభివృద్ధి ఎలాగుంటుందంటే!

మీ ఎదురుగా వున్న బల్ల మీద ఒక ఐస్ గడ్డ వుందని వూహించండి. ఆ గది అంతా చల్లగా వుంది. మీ శ్వాస మీకు విన్పిస్తోంది. 

ఆ ఐస్గడ్డ ఇరవైఐదు డిగ్రీలు వుంది. క్రమంగా ఆ గది వేడి పెరగడం మొదలుపెట్టింది. 

ఇరవైఆరు డిగ్రీలు, ఇరవైఏడు డిగ్రీలు, ఇరవై ఎనిమిది డిగ్రీలు,

ఆ ఐస్ గడ్డ మీ ముందు వున్న బల్ల మీదే వుంది.

ఇరవైతొమ్మిది డిగ్రీలు

ముప్ఫై, ముప్ఫైఒకటి..

యింకా, ఐస్గడ్డలో ఏ మార్పు లేదు. ఆ తరువాత ముప్ఫైరెండు డిగ్రీలు. ఆ ఐస్ క్రమంగా కరగడం మొదలుపెట్టింది. ఒక డిగ్రీ మార్పు, గది ఉష్ణోగ్రతలో పెద్దగా వ్యత్యాసం లేదు. కానీ ఐస్గడ్డ విషయంలో పెద్దమార్పే వచ్చింది. అంటే, అవరోధాలు రావడం ఒక్కోసారి పూర్వపు చర్యల/క్రియల ఫలితమవుతుంది. ఆ క్రియలే ఒక పెద్ద మార్పుని తీసుకువచ్చే శక్తినిస్తాయి. ఈ పద్ధతే ప్రతిచోట కనిపిస్తుంది. క్యాన్సర్ మన జీవితకాలంలో 80% గుర్తుపట్టకుండానే వుంటుంది. కానీ కేవలం కొన్నినెలల సమయంలో శరీరమంతా పాకిపోతుంది. వెదురు మొదట ఐదు సంవత్సరాలలో ఏమీ కనిపించదు. భూగర్భంలో దృఢమైన వేళ్ళని స్థిరపరుచుకుంటుంది. ఆ తరువాత కేవలం ఆరువారాల సమయంలో తొంభై అడుగుల ఎత్తుకు ఎదుగుతుంది.

అదేవిధంగా, habits మొదట్లో పెద్దగా మార్పు తీసుకువచ్చినట్టు కన్పించదు. కానీ ఒక స్థాయికి చేరాకా, ఒకానొక మలుపు దగ్గర వాటి ప్రభావం తెలుస్తుంది. మొదట్లోనో, మధ్యలోనో ఎన్నో సందర్భాల్లో శ్రమ నిరాశకి లోనుచేస్తుంది. దీర్ఘంగా, సూటిగా ప్రగతిని ఆశిస్తారు. అయితే మొదటిరోజుల్లో మీరు అలవాటుచేసుకున్న అంశాలు అంతగా ప్రతిభావంతంగా వుండవు. మొదటిరోజులు మాత్రమే కాదు వారాలు, నెలలు సయితం అదే పరిస్థితి. మీరు వున్న స్థితిలోంచి ఎటు కదిలిన భావన వుండదు. ఈ అలవాట్ల సమ్మేళన ఫలితం ఒక పేరుప్రతిష్ఠని అందించడానికి కాలం పడుతుంది. ఎందుకంటే శక్తివంతమైన స్థితి రావడానికి జాప్యం తప్పదు.

అందువలనే habits ని పెంపొందించుకుని దృఢపరుచుకోవడం కష్టతరమైన అంశం. జనం సాధారణంగా చిన్నచిన్న మార్పులు చేసుకుంటారు. స్పష్టమైన ఫలితం అందుకోలేక ఆ అలవాట్లని మానేస్తారు. మీరే ఆలోచించండి “ప్రతిరోజు క్రమం తప్పకుండా నెలరోజులు పరిగెత్తాను మరి నా శరీరంలో ఏ రకమైన మార్పు ఎందుకు రాలేదు” అని మీరు ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి, ఆ రకమైన ఆలోచన మీ మంచి అలవాటుని కొనసాగించకుండా చేస్తుంది. అందువల్ల మీరు ఆశించిన మార్పు, పలితం రావాలంటే అంటే పేరుకుపోయిన మునుపటి అలసత్వాన్ని బద్దలుకొట్టగలగాలి. ఫలితం రావాలంటే, మీరు habits పట్టు వదలకుండా నిరంతరం కొనసాగించాలి.

మీరు కొత్త habits ని నేర్చుకోవడానికి ఇబ్బందిపడ్తున్నా, ఎంత అలవాట్లని మార్చుకోవడానికి కష్టంగా భావిస్తున్నా, మీరు మీకున్న శక్తిసామర్థ్యాన్ని పోగొట్టుకున్నట్టు కాదు. ఈ విషయం ఫిర్యాదు చేయడం కష్టపడుతున్న విజయం సాధించలేకపోతున్నానుకోవడం, ఐస్ గడ్డ గురించి కూడా ఫిర్యాదు చేసినట్టే. దానిలో 25 డిగ్రీల నుండి 31 డిగ్రీల వరకు ఏ మార్పు వుండదు. మీ శ్రమ అంతదాకా వృథా అయినట్టు కాదు. అది అప్పటి దాకా నిధిలా వుంది. కానీ ముప్ఫైరెండు డిగ్రీల దగ్గర ఫలితం వచ్చింది. మీరు ఎప్పుడైతే ‘పిఎల్పి’ని దాటారో అప్పటి అంతా రాత్రికిరాత్రే మీరు విజయం సాధించినట్టు భావిస్తారు. బైట ప్రపంచం మీ జీవితంలో జరిగిన నాటకీయ పరిణామాన్ని చూస్తుంది. తప్ప అంతకుముందు జరిగిన శ్రమని, పోరాటాన్ని చూడదు. మీకు తెలుసు – మీరు ఎంతో కాలంగా పడిన శ్రమ – మీ అంతగా మీరే ఏ రకమైన ప్రగతి లేదనుకొంటారు. కానీ ఆ శ్రమే మీరు ఈనాటి అధిరోహించిన విజయానికి కారణం.

భూగర్భంలో ఏర్పడే ఒత్తిడులకి సమానంగా మానవ ప్రయత్నాన్ని సరిపోల్చవచ్చు. రెండు భూగర్భ పొరలు ఒకదాన్ని మరొకటి వేల సంవత్సరాలుగా రాపిడికి గురిచేస్తుంటాయి. క్రమంగా వీటి మధ్య ఒత్తిడి పెరుగుతుంది. ఒకరోజు, ఒకదానిని మరొకటి రాపిడికి గురిచేస్తుంది. అది వేల సంవత్సరాలుగా జరుగుతున్నది. కానీ ఓసారి ఆ ఒత్తిడి బలంగా, దృఢంగా మారుతుంది. ఒక భూకంపం వస్తుంది. మార్పులకి సంవత్సరాలు పట్టొచ్చు- ఒక సంఘటన జరగడానికి అంతటి పోరాటం/రాపిడి, శ్రమ అవసరం.

ఎంత పెద్ద అంశాలకైనా ప్రారంభం చిన్నగానే వుంటుంది. ప్రతి habit యొక్క బీజం ఒకటిగానో సూక్ష్మ నిర్ణయంగానో వుంటుంది. అయితే ఆ చేసినప్పుడు, ఆ habit మొలకలెత్తి, దృఢంగా రూపుదిద్దుకుంటుంది. వేళ్ళు బలంగా నాటుకుపోతే శాఖలు బలంగా విస్తరిస్తాయి. చెడు అలవాటుని తొలగించుకోవడం అనేది నిర్ణయాన్నే పదేపదే శక్తివంతంగా మనలో నాటుకుపోయిన ఒక వృక్షాన్ని తొలగించడంలాంటిది. అదే మంచి habit అనేది సున్నితమైన పువ్వుని ప్రతిరోజు జాగ్రత్తగా పరిరక్షించుకోవడంలాంటిది.

లక్ష్యాలు వదిలిపెట్టండి, పద్ధతుల మీద దృష్టి పెట్టండి

Let go of goals, focus on methods

ఎప్పటినుంచో మనకి వున్న అవగాహన ప్రకారం మన జీవితంలో మనం ఏదైనా సాధించా లంటే ఉత్తమమైన మార్గం, అందమైన ఆకృతి కావాలన్నా, వ్యాపారంలో రాణించాలన్నా, తక్కువగా బాధపడి, ఎక్కువగా ప్రశాంతంగా వుండాలన్నా, కుటుంబంతో మిత్రులతో ఎక్కువ కాలం గడపాలన్నా, మనం ఖచ్చితమైన సాధించగలిగిన లక్ష్యాలు నిర్ణయించు కోవాలని భావిస్తాము.

చాలా సంవత్సరాలుగా habits విషయంలోనూ ఇదే నా విధానం కూడా. ప్రతి – ఒక్కరికి చేరుకునే లక్ష్యం వుంటుంది. బడిలో గ్రేడ్లు సాధించడానికి లక్ష్యాన్ని నిర్ణయించు కునేవాడిని. అదే విధంగా బరువు తగ్గడానికి జిమ్కి వెళ్ళాలని, వ్యాపారంలో లాభాలకి, యిలా అన్నింటికి లక్ష్యాలు పెట్టుకున్నాను. కొన్నింటిని సాధించగలిగాను కూడా. కాకపోతే చాలావాటిలో అపజయాన్ని చవిచూశాను. క్రమంగా నేను గ్రహించినదేమిటంటే, లక్ష్యాలకి, ఫలితాలకి పొంతన లేదు. ఆ తరువాత నేను అనుసరించిన పద్ధతులవల్లనే లక్ష్యాల సాధన సాధ్యమైంది.

లక్ష్యాలకి, పద్ధతులకి మధ్యగల వ్యత్యాసం ఏమిటి? లక్ష్యాలు ఫలితాల ద్వారా సాధించాలనుకున్నవి. పద్ధతులు ఆ ఫలితాలకి దిశానిర్దేశనం చేస్తాయి.

మీరు కోచ్ అయితే, మీ లక్ష్యం మీ జట్టుని విజేతగా నిలబెట్టడం కావచ్చు. మీరు ఏ పద్ధతిలో జట్టు సభ్యులను ఎన్నుకుంటారు, అదే విధంగా మీ మేనేజర్ని, మీ దగ్గర సహాయకులుగా వుండే కోచ్లని, అదే విధంగా మీరు సాధన ఎలా చేస్తారనేది మీ పద్ధతిలోకి వస్తుంది.

మీరో వ్యాపారవేత్త అయితే, మీ లక్ష్యం కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం విస్తరించడం కావచ్చు. అయితే మీ పద్ధతి ఏమిటంటే, మీరు మీ వస్తువుని ఎలా తయారుచేశారు, ఉద్యోగులని ఎలా నియమించారు, మార్కెటింగ్ విధానాలు ఏ విధమైనవి అనుసరిస్తున్నారన్నది మీ పద్ధతి.

మీరు సంగీత రూపకర్త అయితే మీ లక్ష్యం కొత్త పాటని తయారుచేయడం కావచ్చు. మీ పద్ధతి మీరు ఏ విధంగా సాధన చేస్తున్నారు, ఏ విధంగా కష్టతరమైన రాగాలని నేర్చుకుని అమలుచేస్తున్నారు, మీ గురువు నుండి ఏ విధమైన సలహా సంప్రదింపులు తీసుకున్నారనేదే మీ పద్ధతి.

యిప్పుడో ఆసక్తికరమైన ప్రశ్న : మీరు మీ లక్ష్యాలని పూర్తిగా వదిలేసి, మీ పద్ధతుల మీదే దృష్టి పెట్టారనుకోండి, మీరు విజయం సాధించగలరా? ఉదాహరణకి, మీరు బాస్కెట్బాల్ కోచ్ అనుకోండి, మీరు ఛాంపియన్ షిప్ని గెలవాలనే లక్ష్యం మీద కాకుండా, మీ జట్టు ప్రతిరోజు ఏ విధంగా సాధన చేస్తుందనే విషయం మీదే దృష్టి పెడితే మీకు ఫలితం అందుతుందా? నా దృష్టిలో మీకు అందుతుంది.

ఏ ఆటలోనైనా పెద్దగా స్కోర్ చేయడమే కావాలి, కానీ మీ ఆట మొత్తాన్ని స్కోర్బోర్డ్ మీద మాత్రమే కేంద్రీకరించడం అర్థరహితమైనదే కదా. గెలవడానికి ఏకైక మార్గం ప్రతిరోజు మిమ్మల్ని మీరు మెరుగుపర్చుకోవడమే. మూడుసార్లు సూపర్బేలో విజేతగా విషయాలకి వర్తిస్తుంది. మీరు ఉత్తమమైన ఫలితాలు ఆశించినవారైతే లక్ష్యాలని నిర్దేశించుకోవడం గురించి పట్టించుకోకండి.. మీ పద్ధతుల మీద దృష్టిపెట్టండి.

దీని ద్వారానే ఉద్దేశ్యం ఏమిటి? లక్ష్యాలు పూర్తిగా ప్రయోజనం కానివా? ముమ్మాటికి కాదు. లక్ష్యాలు దిశానిర్దేశానికి ఎంతో మంచివి. కానీ విజయం సాధించాలంటే పద్ధతి ముఖ్యం. మీరు లక్ష్యాల సాధన కోసమే ఆలోచిస్తే, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అదేమీ పద్ధతులని రూపుదిద్దుకోవడం అంత సమయం పట్టదు.

సమస్య 1 : విజేతలకి పరాజితులకి ఒకే లక్ష్యాలు వుంటాయి.

లక్ష్యాలు నిర్దేశించుకోవడం సర్వైవర్షిప్ బయాస్ (అనంతర జీవితం/శేషజీవితం) అనే తీవ్రసమస్యగా పరిణమిస్తుంది. మనందరి దృష్టి గెలిచినవారిపైనే వుంటుంది – విజేతలనే ఆదర్శవంతమైన లక్ష్యాలు నిర్ణయించుకొనేవారిగా భావించి, మిగిలినవారిని అదే లక్ష్యంతో సాధన చేసినా విజయం సాధించలేకపోయినా వారిని గుర్తించని స్థితికి తీసుకువెళ్తుంది.

ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు బంగారుపతకం ఆశిస్తారు. ప్రతి ఒక్కరు ఉద్యోగం సంపాదించాలనుకుంటారు. గెలిచినవారు, ఓడిపోయినవారు ఒక విధమైన లక్ష్యాలని నిర్ణయించుకో నప్పుడు, లక్ష్యాలు విజేతలని పరాజితులని వేరుగా చూడలేవు.

రెండవ సమస్య : లక్ష్యం సాధించడం అనేది తాత్కాలిక మార్పు.

గజిబిజిగా వున్న గదిని మీరు శుభ్రపరుచుకోవాలనుకోండి. మీరు మీ శక్తిని ఉపయోగించి శుభ్రపరిస్తే, మీ గది శుభ్రంగా తయారవుతుంది. కానీ మీరు నిర్లక్ష్యాన్ని కొనసాగించా రనుకోండి, గదిని పెద్దగా పట్టించుకోకుండా వుంటే మళ్ళీ గది గజిబిజిగా మారిపోతుంది. మళ్ళీ చెత్తాచెదారం పేరుకుపోతుంది. మళ్ళీ శుభ్రపరచాలంటే యింకోసారి స్ఫూర్తిని, కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మీరు పాతదారిలోనే వుండిపోతారు. ఎందుకంటే మీరు మీ పద్ధతిని, అలసత్వంతో మార్చుకోలేకపోయారు. మీరు లక్షణాలకి మందుని యిచ్చారు కానీ మూలకణానికి కాదు.

లక్ష్యం సాధించడం మీ జీవితాన్ని తాత్కాలికంగా ఆ సందర్భానికి మారుస్తుంది. అది అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది. మనం మన ఫలితాలని మార్చాలను కొంటాం. కానీ ఫలితాలు కాదు సమస్య. మనం నిజంగా మానుకోవలసింది పద్ధతులని, అవే ఫలితాలని అందిస్తాయి. మీరు సమస్యలని ఫలితాల స్థాయిలో పరిష్కరిస్తే, మీరు సమస్యలని తాత్కాలికంగా మాత్రమే పరిష్కరించినట్టు. మీరు మీ అభివృద్ధి కోసం, మీ సమస్యలని పద్ధతుల స్థాయిలోనే పరిష్కరించాలి. మీరు సాధకాలని నిర్ధారించుకోండి, అవే ఫలితాలని అందిస్తాయి.

మూడో సమస్య : లక్ష్యాలు మీ ఆనందాన్ని నియంత్రిస్తాయి.

 ప్రతి లక్ష్యం వెనుక ఒక ఉద్దేశ్యం వుంటుంది. “నేను ఈ లక్ష్యాన్ని సాధిస్తే నాకు ఆనందంగా వుంటుంది” అని లక్ష్యాల వలన సమస్య ఏమిటంటే – మానసికంగా మీరు తదుపరి లక్ష్యాన్ని సాధించేవరకు ఆనందాన్ని అనుభవించరు. ఒకరకంగా ఆనందాన్ని వాయిదా వేస్తారు. నేను చాలాసార్లు ఈ వుచ్చులో పడిపోయాను. సంవత్సరాల తరబడి, ఆనందంగా వుండడం అనేది భవిష్యత్తులో సంతోషంగా వుండడం అని భావించాను. ఎప్పుడు శారీరకంగా ఇరవైకేజీల కుండ పెరిగినప్పుడు, లేదా న్యూయార్క్ టైమ్స్ నిర్వహణ గురించి వచ్చినప్పుడో ఆనందం పొందుతా ననుకునేవాడిని. 

యింకో విషయమేమిటంటే, లక్ష్యాలు సాధించారా? లేదా? అనే సమస్యని సృష్టిస్తుంది. మీరు మీ లక్ష్యాలని సాధించారా, విజేతలు లేదా మీరు పరాజితులై నిరాశలో పడిపోయారా? మీరు మానసిక స్థితిని సంకుచిత ఆనందానికి ముడివేసుకోకూడదు. అదే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. మీరు, మీ మనస్సులో నిర్ణయించుకున్న దానిలో, మీ జీవనగమనం సాగుతోందా? మీరు మీ ఆనందాన్ని ఒక సందర్భానికి నియంత్రించుకోవడంలో అర్థం లేదు. విజయం సాధించడానికి ఎన్నో మార్గాలు వున్నాయి. – మీ మానసిక స్థితికి తోడ్పాటునిస్తుంది. మీరు పద్ధతిలో కొనసాగడానికి అలవాటుపడితే, ఫలితం మీద కాకుండా, మీకు మీరు ఆనందంగా వుండడానికి అనుమతిని యిచ్చుకోవలసిన అవసరం లేదు. మీరు మీ పద్ధతికి ఎప్పుడైనా సంతృప్తిగా వుండవచ్చు. ఒక పద్ధతి అనేక విధాలుగా విజయాన్ని సాధిస్తుంది. అంతేకానీ భవిష్యత్తులోని ఆనందానికి హేతువు కాదు.

4వ సమస్య : దీర్ఘకాలిక ప్రగతిలో లక్ష్యాలు

చివరగా లక్ష్యాలపైనే దృష్టి వున్న మనసు ‘యో-యో’ ప్రభావాన్ని చూపుతుంది. ఎందరో నెలల కొద్ది తీవ్రంగా సాధన చేసి, నిర్దేశించిన గతిని దాటిన వెంటనే సాధన మానేస్తారు. పోటీ అనేది వారిని ఉత్సాహపరచదు. మీ శ్రమనంతటిని ఒక ప్రత్యేకమైన లక్ష్యసాధనకి కేటాయించినప్పుడు, ఆ లక్ష్యాన్ని సాధించాక మీరు ఏం సాధిస్తారు? అందువలనే లక్ష్యాన్ని సాధించాక చాలామంది పాత habits లోకి జారిపోతారు.

లక్ష్యాలు నిర్ధారించుకునేది ఆటలో గెలవడం కోసమే. అదే పద్ధతిని అభివృద్ధిపరుచు కుంటే, ఎల్లప్పుడు ఆడుతూ వుంటాం. దీర్ఘకాలికంగా ఆలోచనావిధానం –

లక్ష్యాలని గురించి తక్కువగా ఆలోచించడమవుతుంది. కేవలం ఒక లక్ష్యసాధనకి పరిమితమైపోరు. యిది నిరంతరం మనని మనం అభివృద్ధిపరుచుకుంటూ ముందుకు సాగడం. ఆఖరికి, మీ పద్ధతిపట్ల మీకు గల నిబద్ధతే మీ అభివృద్ధికి కారణమవుతుంది.

మీ habits మార్చుకోవడం సమస్యగా మారిందంటే, మీరు మీకు సమస్య కాదు. మీ పద్ధతే మీకు సమస్య. చెడు అలవాట్లు పదేపదే పునరావృతం అవుతుంటాయి. మీరు మారాలనుకోకపోవడం వలన లేదా మీ పద్ధతిలో మార్పు తెచ్చుకోకపోవడంవల్ల.

good habits

సూక్ష్మమైన ‘అణువు’లాంటి habit చిన్న మార్పుకి సంకేతం. కొద్దిపాటి లాభాన్ని, ఒక్కశాతం ప్రగతిని అందిస్తుంది. అయితే ఈ అణువులాంటి అలవాట్లు ఎంత చిన్నవైనా పాత Habits కావు. అవే పెద్ద వ్యవస్థలోని పద్ధతులకి చిన్నచిన్న అలవాట్లు. అణువులు ఏ విధంగా శక్తిని నింపుకుని వుంటాయో, ఈ అణువు లాంటి అలవాట్లు, అద్భుతమైన ఫలితాలకి నిచ్చెనలుగా మారతాయి.

అలవాట్లు మన జీవితంలో అణువుల్లాంటివి. ప్రతి అణువు మీ సమస్య అభివృద్ధికి ప్రాథమిక భాగాలుగా దోహదపడ్డాయి. ఒక్కసారి, ఈ సూక్ష్మమైన Habits పరిగణనలోకి రానట్టుగా వుంటాయి, కానీ క్రమంగా అవి ఒకదానికొకటి కలిసి, మొదట్లో వున్న పెట్టుబడికి అయిన ఖర్చుకి ఎన్ని రెట్లు పెంచుతాయి. అవి సూక్ష్మమైనవే కానీ శక్తివంత మైనవి.

Conclusion:

Habits స్వీయ ప్రగతిని చక్రవడ్డీ పెరిగినట్లు పెంచుతాయి. ప్రతిరోజు 1 శాతం అభివృద్ధి దీర్ఘకాలంలో అద్భుతమైన ఫలితాలని అందిస్తాయి.

అలవాట్లు రెండువైపుల పదునైన కత్తిలాంటివి. అవి మీ పురోగమనానికి, లేదా తిరోగమనానికి కారణమవుతాయి. అందువల్ల వాటి గురించి సవివరంగా అర్థం చేసుకోవాలి.

చిన్నచిన్న మార్పులు ఒకస్థాయి వరకు ఏ తేడా తీసుకువచ్చినట్టు కన్పించవు. దీర్ఘకాలిక ఫలితాలు యిచ్చే అంశాలు ఏవైనా ఆలస్యం అవుతాయి. సహనం, ఓర్పు అవసరం.

అణువులాంటి అలవాటు, విస్తారమైన వ్యవస్థలో సూక్ష్మమైన అంతర్భాగం. అణువులు ఏ విధంగా అయితే సూక్ష్మకణాల సముదాయమో, అణువువంటి అలవాట్లు అద్భుతమైన ఫలితాల అంతర్భాగం.

మీరు ఉత్తమమైన ఫలితాలు ఆశిస్తే, లక్ష్యాలని నిర్ధారించుకోవడం మర్చిపొండి. మీ పద్ధతులపై దృష్టి పెట్టండి.

మీరు లక్ష్యాలని అందుకోలేకపోయారంటే, మీ పద్ధతుల్లో తేడా వున్నట్టే.

One thought on “Why Can Small Habits Lead To Best Changes?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *