Jammu and Kashmir: The Peaceful Paradise – A Travel Guide.1

Jammu and Kashmir: The Peaceful Paradise – A Travel Guide.1

The Peaceful Paradise – A Travel Guide to Jammu and Kashmir:

Jammu and Kashmir: శాంతియుత స్వర్గధామం – జమ్మూ అండ్ కశ్మీర్ ;భారతదేశ ఉత్తర భాగంలో నీవు కలలలో ఊహించుకునే ప్రకృతి అందాలు, మంచు పర్వతాలు, తీర్థయాత్ర ప్రదేశాలు, రుచికరమైన వంటకాలు, మరియు బహుముఖ సంస్కృతుల సమ్మేళనం — ఇవన్నీ ఒకేచోట అనుభవించాలంటే, జమ్మూ అండ్ కశ్మీర్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ బ్లాగ్‌లో మీరు జమ్మూ అండ్ కశ్మీర్‌కి వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలన్నింటిని తెలుసుకోగలరు.

ప్రధానంగా చూడవలసిన ప్రదేశాలు

  1. శ్రీనగర్ – దాల్ లేక్ బోటు హౌస్‌లు, ముఘల్ గార్డెన్లు.
  2. గుల్మార్గ్ – స్కీయింగ్, గాండోలా రైడ్.
  3. పహల్గామ్ – నేచర్ వాక్స్, ట్రెక్కింగ్.
  4. జమ్మూ నగరం – వైష్ణో దేవీ ఆలయం, రఘునాథ్ ఆలయం.
  5. సోనమార్గ్ – గ్లేషియర్ల మధ్య హార్స్ రైడింగ్ అనుభవం.

జమ్ము-కాశ్మీర్ 2,22,236 చదరపు కి.మీ. విస్తీర్ణములో వుంది. ఇదే కాలములను బట్టి రాజధాని మారుతూ వుంటుంది. వేసవికాలంలో రాజధాని శ్రీనగర్, చలికాలంలో జమ్ము, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్, ఈశాన్యాన ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాన హిమాచలప్రదేశ్, పంజాబ్ సరిహద్దులు. కాశ్మీరీ, డోంగ్రీ, పంజాబి, ఉర్దూ భాషలు మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో 13540 కి. మీ. రోడ్లు వున్నాయి. శ్రీనగర్, జమ్ము, లేహలు విమానాశ్రయాలు, జమ్ములో జోంగ్రా ఆర్ట్ గ్యాలరీ శ్రీనగర్లో ప్రతాప్ సింగ్ గవర్నమెంటు మ్యూజియం వున్నాయి.

చరిత్ర: జమ్మును గురించి మహాభారతంలో వుంది. ఇది రాజతరంగిణి నీల్మెట్ పురాణ కాశీనగరం. ఒకప్పుడు పెద్ద సరస్సు అని చెపుతున్నది. కశ్యప మహర్షి దీనిని ఎండవేసి నిరుపయోగం చేశాడు అంటారు. క్రీ॥పూ॥ 3వ శతాబ్దిలో అశోక చక్రవర్తి కాశ్మీర్లో బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టాడు. కనిష్కుడు దానిని బలోపేతం చేశాడు. 

ఈ లోయ క్రీ.శ.530లో స్వాతంత్ర్యం పొంది ఉజ్జయినీ రాజధానిలో భాగం అయినది. 697-738 క్రీ॥శ. లో లలితాదిత్యుడు అన్న హిందూరాజు ఈ ప్రాంతాన్ని బెంగాల్ వరకు పెంచాడు. దక్షిణాన కొంకణ్ ఉత్తరాన తర్కిస్తాన్ సరిహద్దులుగా వున్నాయి. కాశ్మీర్లో ఇస్లాం మతం 13,14 శతాబ్దాలలో ప్రవేసించింది. జైన్-ఉల్-అబెదిన్ 1420-1470లో ప్రసిద్ధ ముస్లింరాజు కాశ్మీరు వచ్చాడు. 

అప్పుడు హిందూరాజు సంహదేవుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. ఆ హిందూ రాజుని ఓడించి చెరక్ హేడర్గా జైన్-ఉల్-అబెదిన్ కుమారుడు. సింహాసనం ఎక్కాడు. అతను 1596లో అక్బరు కాశ్మీరును జయించేవరకు జమ్మూని పరిపాలించాడు. 1752 వరకు ఈ ప్రాంతం అంతా మొఘలాయిచక్రవర్తుల పాలనకిందే వుంది. తరువాత అహ్మద్ షా అబ్దాలి అనే ఆఫ్ఘన్గాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈ ప్రాంతాన్ని ఆయన తర్వాత 67ఏళ్ళ పాటు పటానులు పాలించారు. 

పటానులు జమ్ముని 22 భాగాలుగా విభజించారు. తర్వాత డోగ్రారాజు మాల్దేవ్ ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. రాజా రంజిత్తేవుడు ఈ ప్రాంతాన్ని 1733 నుంచి 1782 వరకు పాలించాడు. తరువాత వచ్చిన వారు బలహీనులు. మహారాజ రంజీత్ సింగ్ ఈ ప్రాంతాన్ని తన పంజాబ్ రాజ్యంలో కలుపుకున్నాడు. ఆయన తరువాత దానిని రాజా గులాబ్ సింగ్కు ఇచ్చాడు. జమ్మూ, కాశ్మీర్ 1947లో భారతదేశ స్వాతంత్ర్యం వచ్చే వరకు వారిచేతులోనే వున్నది. – మహారాజ హరిసింగ్ దీనిని భారత సార్వభౌమిక దేశంలో కలిపేందుకు 1947 అక్టోబర్ 26న సంతకం చేశారు.

జమ్మూ: భారతదేశ ఉత్తరంలో హిమాలయాల అడుగున వున్న ప్రకృతి సౌందర్యంతో నిండి, పవిత్రతతో పరిపూర్ణమైన ప్రదేశం జమ్మూ. ఇది జమ్మూ & కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని రెండవ అతిపెద్ద నగరంగా మాత్రమే కాకుండా, వైష్ణో దేవి ఆలయం వంటి ప్రముఖ తీర్థయాత్ర స్థానాలకు గమనమయ్యే ద్వారంగా కూడా గుర్తింపు పొందింది. తావీ నదీ తీరాన పటిష్ఠంగా నిలిచిన ఈ నగరం చారిత్రిక కోటలు, ఆలయాలు, మరియు సాంస్కృతిక వారసత్వంతో మంత్రిముగ్ధం చేస్తుంది. పురాతనతనంతో పాటు ఆధునికతను చక్కగా మేళవించుకున్న జమ్మూ, ప్రతి ప్రయాణికుడి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది.

క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్ది కాలంలో జంబులోచన చక్రవర్తి పేరిట వెలసిన ఈ నగర నిర్మాణం వెనుకగల కథని ఎరుగని వారు చాలా అరుదుగా వుంటారు.

‘ఓ రోజు జంబులోచన చక్రవర్తి వేటకి వెళ్ళాడట ! ఆ అడవిలో తావీనదీ తీరంలో ఓ చోట ఓ మేక, పెద్దపులి కలసి తమ దాహాన్ని తీర్చుకుంటున్నాయట! సామరస్య జీవనప్రదాయిని అయిన ఆ నదీతీరంలో ఆ మహారాజు వెంటనే ఓ కోటని నిర్మించాడు. ఆ కోటనే యిపుడు ‘బహూదుర్గం‘ అని పిలుస్తున్నారు.

క్రీ.శ. 1730 వ సంవత్సరంలో డోగ్రా రాజవంశజుడయిన ధ్రువదేవుడి పరిపాలనలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి దశకి తీసుకురాగలిగా రట! ఆ తర్వాత ‘తావి’ నది వొడ్డున నగరాభివృద్ధి రూపుదిద్దుకుంది. అక్కడికి ఉపరితలంలో వున్న కాశ్మీర్ ప్రధాన నగరాన్నే ‘జమ్ముతావి‘ అని పిలవటం ప్రారంభించారు.

జమ్మూ నగరం కాశ్మీర్ రాష్ట్రంలోని రెండవ మహానగరంగా ప్రసిద్ధి చెందింది. పట్టణ జనాభా సుమారు రెండు లక్షలని ఓ అంచనా ! జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సమతల భూభాగం జమ్మూ ! ఈ నగరం పర్వతకారంభ శీతల ప్రదేశాలకి భిన్నంగా జమ్మూలోని వాతావరణం ఎంతో వేడిగా వుంటుంది.

జమ్మూ నగరాన్ని రెండు భాగాలుగా పరిగణించటం జరుగుతోంది. తావీనది ఒడ్డున ఓ ఉన్నత ప్రాంతంలో ప్రాచీన జమ్మూ నగరం హుందాగా నిలిచివుంది. ఆ నదికి అవతలి తీరంలో క్రొత్త జమ్మూ నగరం విశాలంగా విస్తరించింది. 

పాతనగరంలో బస్సుల రవాణా కేంద్రం నెలకొని వుండగా కొత్త నగరంలోని రైల్వే టర్మినస్ ఏర్పాటు. చేయబడింది. ఈ రెండు చోట్లలో కూడా పర్యాటకుల బసనిమిత్తం అనేక హోటళ్ళూ, పర్యాటక విశ్రాంతి కేంద్రాలూ పనిచేస్తున్నాయి. 

జమ్మూ నుంచి ఉదయం బయలుదేరిన బస్సులన్నీ రాత్రికల్లా శ్రీనగర్ని చేరుకుంటాయి. ఆలస్యంగా బయలుదేరిన వాహనాలన్నీ కూడ బనీహాల్ అనేచేట రాత్రి బసని ఏర్పాటు చేసుకుంటాయి. భారత ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూన్న విశ్రాంతి కేంద్రాల్లో ‘గులాబీ భవనం’ పేరెన్నిక గాంచింది.

జమ్మూ నగరంలోని దర్శనీయ స్థలాల్లో ‘రఘునాథ్’ దేవాలయాలు ఎంతో పేరుపొందాయి. క్రీ.శ. 1835 వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ దేవాలయ సముదాయం యాత్రికుల మనస్సుల్ని తప్పక ఆకట్టుకుంటుంది. 

1883వ సంవత్సరంలో ప్రతిష్టింపబడిన రామవీరేశ్వర దేవాలయం భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది. స్థానిక గాంధీ భవనంలో దోగ్రా వంశీయులు చిత్రించిన కళాఖండాల భాండారం నెలకొల్పబడింది. ఇక్కడే కంగ్రా వంశీయులు మిగిల్చిపోయిన సూక్ష్మశిల్ప కళాకృతుల్ని కూడా భద్రపరిచారు. బషోలీ రాజవంశీయుల చారిత్రక ఆధారాల్ని కూడా యిదే ప్రాసాదంలో ప్రదర్శింపజేస్తున్నారు. 

కొత్తగా కట్టబడిన సెక్రటేరియట్ భవనం కూడా పర్యాటకులను ఆకర్షిస్తూ వుంటుంది. జమ్మూలోని అమర్ మహల్ ప్యాలెస్ని దర్శించకుండా వుండలేము. ఈ భవనాన్ని ఫ్రెంచి దేశం నుంచి పిలిపించబడిన పనివారులచే నిర్మింపచేశారు. అందుకే ప్యారిసేక్ భవన నిర్మాణ చాతుర్యం యిందులో వుట్టిపడుతూ వుంటుంది.

జమ్మూ పట్టణంలో యాత్రికుల సౌకర్యార్ధం అనేక హోటళ్ళూ, టూరిస్టు బంగళాలూ అందుబాటులో వుంటాయి. రైలు మార్గంలో ఢిల్లీ నుంచి జమ్మూ 539 కిలోమీటర్ల దూరంలో ఉంది. పదిహేను గంటల ప్రయాణం మనల్ని Jammu కి చేరుస్తుంది.

ఢిల్లీ, చండీఘర్, అమృతసర్ల నుంచి విమాన సౌకర్యం కూడా వుంది. విమానంలో ముందుగా ఢిల్లీ నుంచి చేరుకున్న యాత్రికులు కాశ్మీర్ రాష్ట్ర పర్యాటనం ముగించుకుని పఠాన్ కోర్ని చేరుకోవాలి. అక్కడి నుంచి ధర్మశాల, చంబా, డల్ హౌసీ మొదలగు ప్రదేశాన్ని దర్శించగలిగే అవకాశం వుంటుంది. స్థానికంగా తిరిగేందుకు టాక్సీలు, ఆటోలూ, టెంపోలూ, మినీబస్సులూ లభిస్తాయి.

సంవత్సరంలోని ఏ భాగంలోనయినా Jammu ని దర్శించవచ్చు. కాని వేసవిలో యిక్కడి ఉష్ణోగ్రత చాలా అధికంగా వుంటుంది. చలికాలంలో మాత్రం తగు మోతాదులో ఉన్ని దుస్తుల అవసరం ఎంతేని వుంటుంది.

జమ్ము కాశ్మీరులోని పుణ్యక్షేత్రాలు : భదోర్ నహా : శ్రీనగర్ దగ్గర పట్నీటాప్ సమీపంలో వుంది నల్లని పాల రాతి విగ్రహం గల బాసుకినాథ్ ఆలయం వుంది. బాసుకీనాథ్ (శివ) అమరనాథ్కు తీసుకుని వెళ్ళు శివుని శూలము “ఛడీ” బయలుదేరు ఆలయం. 

వేరినాగ్ : ఇది శ్రీనగర్ దగ్గర వుంది. ఇక్కడ ఇది జీలం నది యొక్క జన్మస్థానం. ఇక్కడి ఆలయములో స్వామి నాగేశ్వర్, అమ్మవారు నాగేశ్వరి కొలువైయున్నారు.

avantipur

అవంతిపుర : ఇది పాంపూర్కు 14కి.మీ. శ్రీనగర్కు 30కి.మీ. దూరంలో వుంది. కాశ్మీర్ లో విష్ణుమూర్తి, శివాలయం ఒకే చోటగల ప్రదేశము. స్వామివార్లు అవంతిస్వామి (విష్ణుమూర్తి) అవంతీశ్వర్ (శివస్వామి). ఇక్కడ విష్ణుమూర్తికి ఆరు భుజములు వుంటాయి. రెండుచేతులలో శ్రీదేవిని, భూదేవిని కలిగి మిగిలిన నాలుగు చేతులలో శంఖ, చక్ర, గద, ధనుస్సులు వుంటాయి.

పట్టాన్ : ఇది శ్రీనగర్‌కు 27 కి.మీ. దూరంలో వుంది. శివునికి, సరస్వతికి ఆలయములు ఒకేచోట వున్న ప్రదేశము. స్పిటక్ గుహ: శ్రీనగర్-లేహ్ మార్గంలో లేహక్కు 20కి. మీ. దూరంలో వుంది. సంవత్సరము అంతా ముఖము కప్పబడివుండి, సంక్రాంతి రోజున మాత్రమే ముఖదర్శనం ఇచ్చు అమ్మవారు వున్న ఆలయం. ఇక్కడ అమ్మవారు కాళికాదేవి.

శుద్ధమహాదేవ్: ఇది శ్రీనగర్ పోవు మార్గములో జమ్ముకు 16 కి.మీ. దూరంలో వుంది. శుద్ధంతర్ అనే రాక్షసునిపై ప్రయోగించినపుడు శూలము రెండుముక్కలుగా విరిగి రాక్షసుని సంహరించినది. ఆలయములో త్రిశూలమే పూజలందు కొంటున్నది. ఇక్కడ శుద్ధమహాదేవ్ కొలువై వున్నారు.

పురమండల్ : ఇది జమ్ముకు 50 కి.మీ. దూరంలో వుంది. జమ్ముకాశ్మీరు రాష్ట్రంలో గయ క్షేత్రముగా భావింపబడుతోంది ఇది దేశిక నదీ తీరంలో వుంది. ఇక్కడ స్వామి ఉమాపతి, అమ్మవారు ఉమ ఇక్కడ నదీ తీరంలో పిండప్రదానాలు శ్రాద్ధకర్మలు చేస్తారు.

బాణగంగ : ఇది కాట్రాకు 2 కి.మీ. వైష్ణవిదేవికి 12 కి.మీ. దూరంలో వుంది. ఇక్కడ వైష్ణవిదేవి చరణపాదుకలు వున్న పుణ్యస్థలము. ఇక్కడగల ప్రవాహములో స్నానంచేసి అమ్మవారి చరణ పాదుకులను పూజించి వైష్ణవిదేవి మందిరానికి నడకనుగాని, గుర్రముల మీదగాని బయలుదేరుతారు. అమ్మవారి దర్శనం రాత్రింబవళ్ళు వుంటుంది. 

రాజ్‌పురా మండి : ఇది పుండ్లక్కు 23 కి.మీ. జమ్ముకు 236 కి.మీ. దూరంలో వుంది. శ్రావణ పూర్ణిమనాడు ఉత్సవం జరుగుతుంది. చెకుముకి రాళ్ళతో నిర్మించబడిన గుడి లింగము. “దశనామా అఖాడే” గ్రామం నుండి రజిత దండాన్ని భక్తులు ఊరేగిస్తూ తీసుకుని ఈ ఆలయాన్ని చేరుతారు.

చంద్రికా మహారాణికి ప్రతి సంవత్సరము “లిడ్డర్” లోయలోని అమర్నాథ్ లింగాన్ని దర్శించి పూజించుట అలవాటు. కానీ ఒక సంవత్సరము అనారోగ్య కారణాన దర్శించినలేక చింతించుచున్న సమయాన ఒక వృద్ధుడు. సాధు రూపములో వచ్చి తన రాజ్యములోనే వెలసిన అమరనాథుని దర్శించిమని “లోరన్” లోయలోని చెకుముకి లింగము ఉనికి చెప్పి అంతర్థానము అయినాడు. జీవుల జనన, మరణ రహస్యములను పార్వతికి బోధించుటకు ఇక్కడనుండియే అమర్ నాధ్ గుహని చేరాడు శివుడు.

తుళుముల : శ్రీనగర్ కు 40 కి.మీ. 5 కి.మీ. గండర్బలు దూరంలో వుంది. ఈ గుడిలో నీటి ఊటలు కలవు. రాత్రులందు ఈ నీరు రంగులు రంగులుగా కనబడును. తలుపులుగాని, ద్వారబంధాలుగాని ఈ ఆలయానికి వుండవు.

వైష్ణోదేవి – భక్తిశ్రద్ధల తీరని యాత్రా స్థలం:

తావీ నదికి సమీపంలో, త్రికూట పర్వత శ్రేణుల్లో 5,200 అడుగుల ఎత్తులో వెలసిన వైష్ణోదేవి ఆలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర స్థలాల్లో ఒకటి. “మాతా రానీ”గా భక్తులందరికీ ప్రసిద్ధమైన వైష్ణోదేవి దేవి, త్రిదేవుల రూపాలైన మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపంగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కట్రా పట్టణం నుండి సుమారు 12 కిలోమీటర్ల పర్వత మార్గాన్ని నడిచే యాత్రలో పాల్గొంటూ, తమ విశ్వాసాన్ని, ఆధ్యాత్మికతను వ్యక్తపరుస్తారు. ఈ యాత్ర భౌతికంగా సవాలుగా ఉండినప్పటికీ, ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన అనుభూతిని అందిస్తుంది.

యుగయుగాల్నించీ భారతదేశ సాంస్కృతిక చరిత్రలో హిమాలయ పర్వతాలకు ఓ విశిష్టమైన స్థానం వుంది. ఈ పర్వత పాదభూముల్లో అనేక పుణ్యక్షేత్రాలు నెలకొని వున్నాయి. అలాగే ఎత్తైన హిమగిరి శిఖరాల పైనకూడా ఎన్నో దేవాలయాలు ఏర్పడ్డాయి. ఈ రెండురకాలే కాకుండా కొన్ని పవిత్రక్షేత్రాలు పర్వత సానువుల్లోనూ గుహల్లోనూ చోటుచేసుకున్నాయి. అమరనాథ్, అనంతనాగ్, వైష్ణోదేవి దేవాలయాలను యిందుకు ఉదాహరణగా చెప్పుకోవాల్సి వుంటుంది.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ నగరానికి ’50’ కిలోమీటర్ల దూరంలో విస్తరించిన హిమాలయాల్లోని త్రికూట పర్వత శ్రేణిలో నెలకొని వున్న వైష్ణోదేవి ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధిచెందింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యిల్లాళ్ళ సమగ్రరూపమే వైష్ణోదేవి ! మహాకాళి, లక్ష్మి, సరస్వతుల మూడు విగ్రహాలు కూడా మనకు ఆలయంలో దర్శనమిస్తాయి,

స్థలపురాణం ప్రకారం పూర్వకాలంలో ఓ విష్ణుభక్తురాలు రాక్షస రాజయిన భైరవుని తప్పించుకునే ప్రయత్నంలో హిమాలయాల్ని ఆశ్రయించింది. ఆ వైష్ణవిని పెళ్ళాడే ప్రయత్నంలో తన పట్టుదలని వీడక ఆమెని వెన్నాడి వచ్చాడట ఆ రాక్షసుడు.

ఆ దుర్మార్గుడి బారి నుంచి తప్పించుకోవటం కోసం ఆ వైష్ణవి ఎదురుగా కనిపించిన ఓ చిన్న రంగంలోకి వెళ్ళి దాక్కుందట, ఆ రాక్షసుడామెనీ సొరంగంలో చెరబట్టబోయేసరికి ఆ భక్తురాలిలో ఏదో ఆ శక్తి పుట్టుకొచ్చిందట! 

ఆ బలంతో ఆమె బైరవుణ్ణి యుద్ధంలో తుదముట్టించిందట! అలా రాక్షస సంహారం కావించి తపస్సులో మునిగిపోయిన ఆ భక్తురాలు కాళీమాత, లక్ష్మి, సరస్వతుల ప్రసన్నం చేసుకుని వారి రూపాలను ఆ కొండగుహలో ప్రతిష్టించి భగవంతునిలో లీనమయిపోయిందట!

స్వయంగా వైష్ణోదేవ్ తన ఆలయం గురించి జమ్మూ దగ్గరగా వున్న ‘కాలా’ అనే గ్రామంలోని శ్రీధరుడనే బ్రాహ్మణుడికి స్వప్నంలో వివరించి తాను దుష్టశిక్షణ కోసం ఏర్పడిన దేవినని చెప్పి అంతర్ధానం అయిందట! ఇది దాదాపు ఏడు శతాబ్దాల నాటి కథగా చెప్పబడుతోంది. 

ఇప్పుడు మాతా వైష్ణోదేవి ఆలయం ఓ అతి మహిమాన్వితమైన మందిరంగా భక్తుల హృదయాల్లో నిలచిపోయింది. భక్తుల కోరికలన్నింటిని దేవి తప్పక నేరవేరుస్తుందన్న ఓ నమ్మకం దేశంలోని ప్రజలందరికి ఏర్పడిపోయింది. అలా ఖ్యాతి గడించిన ఈ పుణ్యక్షేత్రాన్ని లక్షలాది భక్తులు ఏటా దర్శించి తరిస్తున్నారు. మంచుకొండల్లో ప్రయాణం ఓ మరపురాని అనుభూతి !

వైష్ణోదేవిని చేరేందుకు ముందు మనం జమ్మూని చేరుకోవాలి. జమ్మూ నుంచి ఓ యాభై కిలోమీటర్ల దూరంలో ‘కట్రా’ అనే ఒక పట్టణం వుంది. కట్రాలో అనేక హోటళ్లు, వసతి గృహాలు వున్నాయి. కట్రా నుంచి వైష్ణోదేవికి 13 కిలోమీటర్ల దూరమార్గాన కొండల గుండా చేరాలి. కాలినడక సులభం అయింది. ‘పోనీ’ సౌకర్యం (కంచర గాడిద) కూడా వుంది. కట్రా నుంచి ఓ ఆరుగంటలు ప్రయాణం కొండ సానువుల గుండా సాగి యాత్రికుల సహనాన్ని పరీక్షిస్తుంది. అయితే వైష్ణోదేవికి వెళ్ళేందుకు ముందుగా మధ్యలో ‘బనంగా’ లో తనిఖీ చేస్తారు. ఆ తర్వాత ‘భవాన్’ ముఖ్య ఆలయంలో యాత్రికులను గుంపులుగా విభజించి లోనికి వెళ్ళనిస్తారు.

ఢిల్లీ నుంచి జమ్మూకు విమాన ద్వారానూ, రైల్లోనూ, రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోగలం ! కట్రా నుంచి దారి చాలా ఎత్తులో సాగుతుంది. జమ్మూ వేడిని భరించలేని యాత్రికులీ ప్రయాణాల్ని రాత్రి పూట సాగిస్తారు. దారి అంతా కూడా విద్యుద్దీపాలు ఏర్పాటు చేయబడ్డాయి. మార్గమధ్యంలో విశ్రాంతిశాలలు, మంచినీటి చలిలీలు అందుబాటులో వుంటాయి. యాత్రికులంతా ఓ ఎర్రటి రుమాలుని తలకు చుట్టుకుని, ఓ చేతి కర్ర సహాయంతో “జయ మాతాజీ” అన్న నినాదాల్ని భక్తి పారవశ్యంతో వల్లిస్తూ అలసటని మరిచిపోయి వేగంగా వెడుతుంటారు.

దారిలోని ‘బనగంగా’ సెలయేరులో భక్తులంతా స్నానాలు చేసి ‘5300’ అడుగుల ఎత్తులో వున్న దేవీ మందిరాన్ని చేరుతారు. అక్కడ గర్వజూనీ అనే ఓ వంద అడుగుల పొడవుగల సన్నని గుహమార్గంలో పడుకుని దేకుతూ వెళ్ళి ముఖ్య మందిరాన్ని చేరాలి. ఆ ముఖ్య మందిర స్థలాన్ని ‘భవాన్’ అంటారు. అక్కడ యాత్రికుల బృందాల్ని ఒక్కొక్కటిగా ఆలయ అంతర్భాగంలోకి పంపిస్తారు. ఈ గుహమార్గం అంతా కూడా జలమయంగా వుంటుంది. 

దేవీ దర్శనం కాగానే వెలుపలికి వచ్చిన భక్తులకు మరికొన్ని దేవాలయాలు కనిపిస్తాయి. అందులో శివ మందిరం, రామమందిరం, భైరవ దేవాలయం ముఖ్యమైనవి. తన శత్రువయిన భైరవ దేవాలయాన్ని యాత్రాంతంలో తప్పక దర్శించాలని వైష్ణోదేవి ఆదేశించిందట.

‘భవాన్’ లో శివలింగం ఓ గుహలో ప్రతిష్టించబడింది. యాత్రారంభంలో ‘కట్రా’లోని కాళికాలయ దర్శనం ఓ ఆనవాయితీ ! సంవత్సరం పొడుగునా ఈ యాత్ర కొనసాగుతూనే వుంటుంది.

కాశ్మీర్ – ప్రకృతి పరవశతికి ప్రత్యక్ష రూపం:

ప్రకృతి పట్ల ప్రేమ కలిగిన వారెవరైనా తప్పక చూసేయాల్సిన స్థలం కాశ్మీర్. “భూమిపై స్వర్గం”గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం, మంచు పర్వతాలు, నదులు, హరిత లోయలు, సాగరంలా విస్తరించిన సరస్సులు, పూల తోటలతో కనుల విందుగా నిలుస్తుంది. ప్రతి మూలలోనూ శాంతి, సౌందర్యం, సిరివెన్నెల తాకిడిలా అనిపించే కాశ్మీర్, ఫోటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు, హనీమూన్ జంటలు, మరియు ఆధ్యాత్మిక యాత్రికులకు ఒక అపూర్వ అనుభూతిని అందిస్తుంది.

kashmir dal lake

శ్రీనగర్ యొక్క దాల్ లేక్‌లో హౌస్ బోట్స్, గుల్మార్గ్ లో స్కీయింగ్, పహల్గామ్, సోనమార్గ్ వంటి ప్రదేశాలలో ట్రెక్కింగ్ – ఇవన్నీ కాశ్మీర్‌ను విహారయాత్రలకు పరిపూర్ణ గమ్యస్థానంగా చేస్తాయి.

కాశ్మీర్‌ను భూతల స్వర్గం అంటారు. అఖండ భారత పశ్చిమోత్తర దిశపరితలంలో భారతమాత ధరించిన దివ్యమణి కిరీటంలా కాశ్మీర్ రాష్ట్రం ప్రకాశిస్తోంది.

కాశ్మీర్ లోయంతా కూడా ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా భూతల స్వర్గ ధామంగా కొనియాడబడుతోంది. మంచుముసుగుని కప్పుకున్న హిమాలయ ప్రాంతంలో ఈ రాష్ట్రం ఓ అతి సంపన్నమైన భారత భూఖండంగా పరిగణించబడుతోంది. తన జీవితకాలంలో ఒకసారైనా కాశ్మీర్ని దర్శించాలని ప్రతి భారతీయుడూ కోరుకుంటాడు.

 అనేక చిన్న నదుల్ని తనలో కలుపుకుని ప్రవహించే జీలం నదిని సింధూమహానదికి ఉపనదిగా చెప్పుకోవాలి ! అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నో సెలయేర్లూ, సహజసిద్ధంగా ఏర్పడిన సరస్సులతో సర్వాంగ సుందరంగా దర్శనమిస్తూ ఉంటుంది.

యుగయుగాల్నుంచి కాశ్మీర్ అరణ్యాలు ప్రసిద్ధి చెందిన ఋషులకూ, మహర్షులకూ, మునిపుంగవులకూ, యోగులకూ నివాసస్థానంగా ఉపయోగపడుతూ వచ్చాయి. కాశ్మీర్ లోయలో హిందూమతం జీవిస్తోంది ! దానితో బాటుగా ఇస్లాం మతం కూడా సహజీవనాన్ని కొనసాగిస్తోంది. ఈ రెండు మతాలూ ఈ ప్రాంతంలోని జనావళికి సమైక్య జీవన విధానాన్ని ఉగ్గుపాలతోనే నేర్పటం ప్రారంభిస్తాయి.

ఇక్కడి నుంచి కారాకోరం, జంక్సర్ మరియు పిరపంజల పర్వత పంక్తులు ఆరంభమవుతాయి. పశ్చిమోత్తర దిశనుంచి పూర్వోత్తర దిశ వరకూ ఈ హిమాచ్చాదిత పర్వత భూమి అన్ని కాలాల్లోనూ అత్యంత శోధిత శ్వేతాంబరాన్ని ధరించిన గిరిరాజకన్యలా దర్శనమిస్తూ ఉంటుంది. కాశ్మీర్లో అనేక జీవనదులకు జన్మస్థానం! అనేక జలపాతాలకిది పుట్టినిల్లు ! బ్రహాందమయిన కీకారణ్యాలకిది నెలవు!

అత్యంత శోభితంగా కనిపించే పూదోటల వాటిక ఈ కాశ్మీర్ కమనీయ నయనానందకర స్వర్గసీమ! తొలుత మొఘల్ సామ్రాజ్యదినేతలీ కాశ్మీర్ దేశ సౌందర్యానికి దాసోహం పలికారు. ఆ తర్వాతి రాజవంశాలీ ప్రాంతంలో అనేక సుందర ఆరామాలకీ, ఉద్యానవనాలకూ, విశాలమయిన భవనాలకు శంఖుస్థాపనల్ని చేశారు.

కాశ్మీర్ని కేవలం భూతల స్వర్గంలా వర్ణించగానే సరిపోదు…. ఈ నేల ఎంతో మహిమాన్వితమైనది ఇక్కడి ప్రకృతి పాండిత్యాన్ని ప్రతిభావంతం చేస్తుంది … సంగీతానికి శ్వాసని అందిస్తుంది ! చిత్రకళకి జీవం పోస్తుంది ! శిల్పాలకి చైతన్నాన్ని కలిగిస్తుంది. అనేక సహజ జనిత వివిధ వర్ణ భరిత పుష్ప సౌందర్య సౌరభాలతో….. ఈ కాశ్మీర్, ఓ కన్నెవయసు సోయగాలనీ..ఓ కోడెవయసు కుర్రతనాన్నీ మన కళ్ళముందట ప్రదర్శిస్తూ ఉంటుంది.

Jammu and Kashmir

మొఘల్ చక్రవర్తుల కాలంలో కాశ్మీర్లోయ అంతా కూడా అత్యంత ప్రాభవాన్ని సంతరించుకుంది. వేసవి విడిది కేంద్రంగా ఈ రాష్ట్రం విశ్వవిఖ్యాతిని ఆర్జించుకుంది.

శీతాకాలంలో ‘స్నోఫాల్’ ! అనగా మంచురజను వర్షంతో పరిసరప్రాంతాలన్నీ కూడా ఓ తెల్లని తివాసీని పరచినట్లుగా కనిపిస్తాయి. కాశ్మీర్ ప్రాంతంలోని సరస్సులన్నీ కూడా స్వచ్ఛమయిన నీటితో నిర్మలంగా దర్శనమిస్తాయి. ఓ కోటి జనాభాకి మించని ఈ రాష్ట్ర విస్తీర్ణం కేవలం రెండున్నర లక్షల చదరపు వెళ్ళను మించివుండదని అంచనా! ఈ రాష్ట్ర ప్రజలకు కాశ్మీరీ భాషల్ని మాతృభాషలుగా చెప్పుకోవలసివుంటుంది.

జమ్మూ అండ్ కశ్మీర్ — ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, అది ఒక అనుభూతి. ప్రతి అడుగులోనూ చరిత్ర పలుకుతుంది, ప్రతి శ్వాసలోనూ ప్రకృతి పరవశిస్తుంది. ఇది భక్తి, సౌందర్యం, సాహసం, మరియు సాంస్కృతిక వైవిధ్యానికి జీవనాంతర అనుభవాన్ని అందించే ప్రాంతం. మీరు ఆధ్యాత్మికత కోసం వచ్చినా, నిశ్శబ్దపు లోయల్లో ప్రకృతి తోడుగా నడవాలనుకున్నా, కాశ్మీర్ మీకు ఎప్పటికీ మరపురాని జ్ఞాపకాల్ని ఇస్తుంది.

ఈ స్వర్గధామాన్ని కనులారా ఆస్వాదించేందుకు, మిమ్మల్ని మీరు ఓ యాత్రకు సిద్ధం చేసుకోండి. జమ్మూ అండ్ కశ్మీర్ మీ మనసు దాచుకునే ఒక కోణంగా మారుతుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *