Mughal Gardens – Symbols of Architectural Elegance and Serene Beauty:2

Mughal Gardens – Symbols of Architectural Elegance and Serene Beauty:2

Mughal Gardens – Symbols of Architectural Elegance and Serene Beauty:

Mughal Gardens: మొఘల్ గార్డెన్స్ – శిల్పసౌందర్యానికి, స్వచ్ఛతకు ప్రతీకలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఆవిర్భావ చరిత్ర అంతా కూడా అలనాటి మొఘల్ చక్రవర్తుల రాచరికంతో ముడివడి వుంది. మొఘలులు సాంస్కృతిక ప్రియులు, ప్రకృతి ఆరాధ్యులు. వారి కాలంలోనే శ్రీనగర్ రాష్ట్ర రాజధానిగా సంపూర్ణ రూపం ధరించింది. దాల్ సరస్సు అభివృద్ధిని వారే చేపట్టినట్లుగా చారిత్రిక ఆధారాలున్నాయి. ఆ సరస్సు అంచులంచుల వెంటే అనేక ఉద్యానవనాలకు వారు నాంది పలికారు.

Mughal Gardens: మొఘల్ గార్డెన్స్ – శిల్పసౌందర్యానికి, స్వచ్ఛతకు ప్రతీకలు

జహంగీరు చక్రవర్తి పాలనాకాలంలో ఈ ప్రాంతాభివృద్ధికి ఎంతో దోహదం లభించింది. ఆనాటి Mughal Gardens మొఘల్ ఉద్యానవనాలు చస్మాషాహీ, నిషాత్ఫాగ్, షాలిమార్ భాగ్, నసీం భాగు ఎంతో వృద్ధి కాగా నెహ్రూ మెమోరియల్ పార్క్ ఈ మధ్యకాలంలో ఏర్పాటు గావించబడింది.

1632వ సంవత్సరంలో శ్రీనగర్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో చస్మాషాహీ ఉద్యానవనం నిర్మించబడింది. కొండల పాదాల నుంచి డాల్ సరస్సు వరకు విస్తరించిన ఈ ఉద్యానవనం అందచందాల గురించి వర్ణించటం అంత సులువుకాదు. Mughal Gardens ఉద్యానవనానికి ఎగువన పారీమహల్ అనే ఓ చారిత్రక కట్టడం ఉంది. దాన్ని సూఫీ అధ్యయనశాల అంటారు.

1633వ సంవత్సరంలో జహంగీర్ ప్రియురాలయిన నూర్జహాన్ సోదరుడు అసన్ నిషాత్ గార్డెన్స్‌క రూపకల్పన చేశాడు. ఈ ఉద్యాన నిర్మాణానికి అతను వీరపంజల పర్వత పాదభూమిని ఎన్నుకున్నాడు. ఆ కొండ నుంచి డాల్ సరస్సు మధ్య ప్రాంతంలో ఈ గార్డెన్ ఏర్పాటు చేయబడింది. శ్రీనగర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఉద్యానవనం మధ్యలో నుంచి చూస్తే డాల్ సరస్సు సంపూర్ణంగా కనిపిస్తుంది.

మరీ ప్రాచీనమైన వసీంభాగ్ 1586వ సంవత్సరంలో అక్బర్ చక్రవర్తిచే నిర్మించబడింది. యిప్పుడీ ఉద్యానవనం నిర్వహణ కుంటబడింది. అనేక విశ్వవిద్యాలయ కళాశాలలకిది అనువుగా మారింది. ఈ తోటని దర్శించటానికి అధికారులు అనుమతిని పొందాలి. నసీంభాగ్ ప్రక్కనే ఈ మధ్యనే ఉగ్రవాదులాక్రమించుకున్న హజ్రత్బల్ మసీదు వుంది. ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త పవిత్ర కేశాన్ని భద్రపరిచారట. ఈ మసీదు ఓ అద్భుత సుందర కట్టడం ! డాల్ లేక్ నుంచి చూస్తే దృశ్యం అద్భుతంగా వుంటుంది.

1616వ సంవత్సరంలో శ్రీనగర్‌కు పదిహేను కిలోమీటర్ల దూరంలో షాలిమార్ ఉద్యానవనాన్ని జహంగీర్ చక్రవర్తి తన స్వయంపర్యవేక్షణలో నిర్మించాడు. తన ప్రేయసి నూర్జహాన్ కోసం అతని బాధ్యతని స్వీకరించినట్లుగా చెప్పబడుతోంది. ‘నూర్జహాన్’ అంటే ప్రపంచానికే ‘కాంతి’ అని అర్థం. ఆ అర్థం వచ్చేలా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఉద్యానవనం !

డాల్లోక్లో నుంచి శికారా (పడవ) ద్వారా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. అంచెలంచెలుగా కనిపించే ఈ ఉద్యానవనంలో రాత్రిపూట ‘సౌండ్ లైట్’ ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తారు. మే మాసం నుంచి అక్టోబర్ దాకా గార్డెన్ యాత్రికులతో కిటకిటలాడుతూ వుంటుంది. స్థానిక హరిపర్వతం పై ఓ ప్రాచీన దుర్గం వుంది. దీన్ని షారికాపాల్ అని కూడా పిలుస్తారు. డాలేక్కు పశ్చిమదిశలో వున్న ఈ కోట 1592 లో అక్బర్ చక్రవర్తిచే నిర్మించబడింది. ఈ దుర్గాన్ని దర్శించేందుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సి వుంటుంది.

చస్మాషాహీ నెహ్రూ పార్క్, నిషాత్ గార్డెన్స్, షాలిమార్ గార్డెన్స్లో కలిపే మార్గాన్ని ‘హర్వాన్ రోడ్డు’ అంటారు. ఈ ‘హర్వాన్’ లో ప్రాచీన బౌద్ధమత కట్టడాల అవశేషాల్ని కనుగొన్నారు. మూడవ శతాబ్దకాలం నాటికి చెందిన కళాఖండాలను శ్రీనగర్ మ్యూజియంలో భద్రపరిచారు.

హర్వాన్కి వెళ్ళే దారిలోనే శంకరాచార్య పర్వతాన్ని దర్శించవచ్చు. ఈ పర్వతాన్ని ‘తక్తే సులేమాన్’ అని కూడా అంటారు. యిక్కడే క్రిస్టియన్ మత చక్రవర్తి అయిన ‘కింగ్ సాలెమెన్’ సింహాసనం వుండేదట ! ఆ పరంగా ఇప్పుడు ఆధారాలేమీ కనిపించవు. అశోకచక్రవర్తి కుమారుడుచే ఇక్కడి హిందూ దేవాలయ నిర్మాణం గావించబడింది. జహంగీర్ చక్రవర్తి కాలంలో అది పునరుద్ధరించబడింది. 

ఈ కొండపై నుంచి డాల్ సరస్సు సంపూర్ణంగా సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. అది శంకరాచార్యులచే నిర్మించబడిన శంకరమందిరం అనేకమంది భక్తుల్ని ఆకర్షిస్తూ వుంటుంది. శ్రీనగర్లోని ఈ ఉద్యానవనాలన్నిటినీ చూడటం వల్ల యాత్రికుల మనస్సులు పరవశం అయిపోతాయి. ఢిల్లీ నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాల వల్ల మనం ఇక్కడికి చేరుకోగలం. చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొఘల్ గార్డెన్స్ అనేవి కేవలం తోటలు మాత్రమే కావు –

 అవి కాలాన్ని తలపించే కళా సంపద, ప్రకృతి ప్రేమకు ప్రతిబింబం, మౌనానందానికి చిరునామా. ఈ గార్డెన్స్ లో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి మనసు నెమ్మదిగా ప్రశాంతతతో నిండిపోతుంది. చారిత్రక వైభవం, పచ్చటి ప్రకృతి, నీటి ప్రవాహాల చప్పుళ్లు – ఇవన్నీ కలసి మనసును మైమరిపించే అనుభూతిని కలిగిస్తాయి. కాశ్మీర్‌కి పర్యటన ప్లాన్ చేస్తే, ఈ గార్డెన్స్‌కి తప్పక చోటు ఇవ్వండి – మీరు చూసే ప్రతి అడుగు, తీసే ప్రతి శ్వాస చరిత్ర, ప్రకృతి, కళల మిళితంగా మారిపోతుంది.

గుల్మార్గ్ – మంచుతో ముద్దాడే మధుర స్వర్గధామం:

కాశ్మీర్ లోయలోని నీలిమ మైదానాల మధ్య వెలసిన ప్రకృతి రత్నం గుల్మార్గ్. “పుష్పాల మైదానం” అనే అర్థంతో పేరు పొందిన ఈ హిల్ స్టేషన్, మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్లని గాలులు, రంగుల పూల తోటలతో ఆహ్లాదకరంగా మారుతుంది. ఇది కేవలం సహజ సౌందర్యానికి నిలయం మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రముఖ స్కీయింగ్ గమ్యస్థలాల్లో ఒకటిగా కూడా పేరుగాంచింది.

Gulmargh- గుల్మార్గ్ గాండోలా – ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కేబుల్ కార్లలో ఒకటి

గుల్మార్గ్ గాండోలా – ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కేబుల్ కార్లలో ఒకటి, ప్రయాణికులకు తలసరి దృశ్యాలను తిలకించే అపూర్వ అవకాశం ఇస్తుంది. వేసవిలో పచ్చటి పర్వత మైదానాల మధ్య వాక్‌లు, శీతాకాలంలో స్నో అడ్వెంచర్‌లు – గుల్మార్గ్ ప్రతి ఋతువులోనూ ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజధానికి 52 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ప్రకృతి సౌందర్య స్థావరంలో పోల్చదగిన స్థలాలేవీ ఈ భూగోళం పైనే లేవన్నది ఓ నిర్వివాదాంశం ! సముద్రోపరితలానికి 2730 మీటర్ల ఎత్తులో, అత్యున్నత హిమగిరి సానువుల్లో నెలకొని వున్న ఈ ప్రాంతాన్ని దర్శించగోరని భారతీయుడు వుండడు!

శ్రీనగర్ నుంచి గుల్మార్గ్కి వెళ్ళే దారి అంతా కూడా కన్నులకు విందుని చేస్తుంది. పరిసరాల్లోని పర్వత ‘సానువులన్నీ కూడ ప్రకృతి పరంగా జనించిన పూదోటలకు నిలయాలు ! పరిసరాల ప్రభావం మనని పరవశుల్ని చేస్తుంది. లోయ నిండా నిండుకున్న పూటతోటల్లోని పూలపరిమళాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఎటు చూసినా మంచుతో నిండిన శిఖరాలు !

కనుచూపు మేరంతా నందనవనాలు …. నయనానందకరదృశాలు. పరిసరాలు ! అద్భుత వర్ణచిత్ర పటంలా ప్రతివైపూ సంవత్సరం పొడవునా గుల్మార్గాన్ని దర్శించగలిగే అవకాశం వుంది. కాని మార్చి, అక్టోబర్ మాసాల మధ్య కాలం మాత్రం చాలా అనుకూలంగా వుంటుంది.

శీతాకాలంలో యిక్కడ విపరీతంగా ‘స్నో’ అనగా తెల్లని మంచురజను కురుస్తుంది. మంచు కురుస్తున్నప్పుడు యిక్కడ ‘వింటర్ స్పోర్ట్స్‘ ని నిర్వహిస్తూ వుంటారు. ఈ క్రీడల్లో ‘ఛెయిర్ లిఫ్ట్‘ లు టీ బార్ మరియు ‘పోమాస్’ అన్నవి ముఖ్యమైనవి.

గుల్మార్గ్ లోని మంచు జారుడు బండలు యువతని విపరీతంగా ఆకర్షిస్తూ వుంటాయి. దాదాపు వెయ్యి మీటర్ల లోతు వరకూ కూర్చుని జారిపోయే ఎత్తులు గుల్మార్గ్ వున్నాయి.

ఈ మంచు క్రీడలకు కాలసిన సామాగ్రి అంతా కూడా గుల్మార్గాలోనే అతి చవకగా అద్దెకు లభిస్తుంది. గుల్మార్గ్ పర్వత శిఖరం వరకు కేబుల్ కార్ మార్గం వుంది. ఈ కేబుల్ మార్గం అంతా కూడా ఎత్తైన దారుల గుండా చక్కని పోప్లార్చెట్ల సముదాయం గుండా సాగుతుంది.

గుల్మార్గ్ నుంచి పదకొండు కిలోమీటర్ల పొడవు గల శిఖర మార్గం అనేక కొండల్ని కలుపుతోంది. ఈ మార్గం అంతాకూడా దేవదారు, చినార్ వనసముదాయాల గుండా సాగుతుంది. మార్గమధ్యంలో సంగపర్వతం ఉత్తరదిశలో ఓ బ్రహ్మాండమయిన దృశ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. గుల్బార్డ్ లో 18 రంధ్రాల విశాలమైన గోల్ఫ్ క్రీడా మైదానం వుంది. యింత ఎత్తులో వున్న గోల్ఫ్ క్రీడా మైదానం ప్రపంచంలో మరెక్కడా లేదు.

గుల్మార్గ్కి ఓ ఆరు కిలోమీటర్ల దూరంలో కీలెన్ మార్గ్ అనే మరో గొప్ప దర్శనీయస్థలం వుంది. అక్కడ నుంచి కాశ్మీర్ లోయ అంతా కూడా మనకు కన్నుల పండుగని చేస్తుంది.

కీలెన్ మార్గ్ నుంచి మరో పదమూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే ‘అల్పతరు’ శిఖరం వస్తుంది. ‘అల్పతరు’ సముద్ర మట్టానికి 4510 మీటర్ల ఎత్తులో వుంది. యిక్కడ మనకో ఘనీభవించిన సరస్సు కనిపిస్తుంది. వేసవి కాలంలో ఈ సరస్సు నౌకాయానానికి అనువుగా మారుతుంది. అయితే అప్పుడు కూడా సరస్సు మధ్యలో తరలిపోతున్న ఘనీభవించిన మంచు శకలాలు మనకు కనిపిస్తాయి.

ఈ సరస్సులోని మంచు ద్రవించి నింగిల్ నల్లా అనే పేరుతో క్రింది లోయలోకి ప్రవహించి దూరంగా జీలం నదిలో కలిసిపోతుంది.ఈ నింగిల్ నల్లా నదిపై ఓ వంతెన వుంది. దాన్ని దాటి అనేక మంది యాత్రికులు కీలెనా మార్గ్ అనే ప్రదేశంతో విహారయాత్రల్ని కొనసాగిస్తారు.

ఫిరోజ్ పూర్నాలా అన్న ఉపనదీ ప్రాంతాన్ని తాంగ్ మార్గ్ రోడ్డు ద్వారా చేరుకోగలం. ఈ ఉపనది ‘ఐహాన్’ కొండవాగులో కలిసిపోతుంది. ఈ నదీప్రాంతం గుండా తోసా అనే ఓ అతి సుందర మైదానాన్ని మనం చేరుకోగలం. శ్రీనగర్ స్థానికులెందరో సెలవు దినాల్లో ఈ ప్రాంతాన్ని దర్శిస్తూ వుంటాం ఓ ఆనవాయితీగా మారిపోయింది.

గుల్మార్గ్ శిఖర పర్వత సానువుల్లో జియారత్ బాబా రిషీ అనే ముస్లిం మత క్షేత్రం ఉంది. ఏడాది పొడవునా అనేకమంది ముస్లిం యాత్రికులీ ప్రాంతాన్ని దర్శిస్తూవుంటారు. శ్రీనగర్ని దర్శించే యాత్రికులు గుల్మార్గ్న అనుబంధ యాత్రగా ప్లాన్ చేసుకోవాలి.

గుల్మార్గ్ లో మహారాణి గుడి 1960లో ఎన్నో హిందీ సినిమా పాటల ద్వారా ప్రసిద్ధి కెక్కింది. సెంట్ మేరీ చర్చి బ్రిటీషువారి ఆధ్వర్యంలో నిర్మించారు. అక్కడ ఒక కేర్ టేకర్ వున్నాడు కాని ఎప్పుడూ వుండదు. కాశ్మీరీ జీవితాన్ని అతి దగ్గరగా చూసినపుడు టంగ్ మార్గ్ ఇది సాధారణంగా ఎంతో ఎక్కువ మంది ప్రజలున్న బాబారేషీ అన్న చోటు. ఇది ఈ గుడికి అప్పుడే పుట్టిన పిల్లలను తీసుకువచ్చి వారికి ఆ దేవునిచే ఆశీర్వాదాలు ఇప్పిస్తారు.

గుల్మార్గ్ శిఖర పర్వత సానువుల్లో జియారత్ బాబా రిషీ అనే ముస్లిం మత క్షేత్రం ఉంది.

గుల్మార్గ్ అనేది కేవలం ఒక పర్యాటక గమ్యం కాదు – అది ప్రకృతి ప్రేమికుల కలల ఊహకు రూపం. మంచుతో కప్పబడిన పర్వతాలు, గాలిలో తేలే గాండోలా ప్రయాణం, పచ్చటి మైదానాల మధ్య ప్రశాంతత – ఇవన్నీ కలసి మీ ప్రయాణాన్ని మర్చిపోలేని జ్ఞాపకాలుగా మలుస్తాయి.

వేసవిలో హరిత స్వచ్ఛతను, శీతాకాలంలో తెల్లటి మౌనాన్ని ఆస్వాదించాలనుకునే వారందరికీ గుల్మార్గ్ ఒక స్వర్గధామం. మీ తదుపరి హాలిడే కోసం గుల్మార్గ్‌ని ఎంపిక చేస్తే, ప్రకృతికి దగ్గరగా జీవించే కొత్త అనుభూతిని ఖచ్చితంగా పొందగలుగుతారు.

ఉలార్ సరస్సు – నిశ్శబ్ద ప్రకృతి ఒడిలోనిది ప్రశాంతతకు పరిపూర్ణ ప్రతిబింబం:

ఉలార్ సరస్సు (Wular Lake), భారతదేశంలోనే değil, ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్వచ్ఛంద జలాశయాల్లో ఒకటి. శ్రీనగర్‌కు సమీపంలో ఉన్న ఈ సరస్సు, హిమాలయాల నడుమ నిశ్శబ్దంగా విస్తరించి, శాంతియుత వాతావరణాన్ని కలిగిస్తుంది. పక్షి ప్రేమికులు, ప్రకృతి నిపుణులు ఇక్కడి జీవవైవిధ్యాన్ని ఆస్వాదించవచ్చు. పడవ ప్రయాణం చేస్తూ, చుట్టుపక్కల మంచు పర్వతాల ప్రతిబింబాన్ని నీటిలో చూస్తూ పయనించడం ఓ అంతులేని ఆనందం.

ఉలార్ సరస్సు అనేది ప్రకృతితో మమేకమై నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరికి స్వర్గప్రాయమైన ఆశ్రయం. ఈ సరస్సు ఒడ్డున కూర్చొని చీకటి వేళల్లో నీటిపై పడే ఎర్రటి సూర్యాస్తమయాన్ని తిలకించడం, మనసుకు కావలసిన ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ప్రకృతి, పక్షులు, నీరు – ఇవన్నీ కలసి ఇక్కడ ఒక్కక్షణాన్ని కూడా అసాధారణ అనుభూతిగా మార్చేస్తాయి.

ఆధునిక ప్రపంచపు శబ్దాలనుండి కాసేపు పారిపోయి, మీ అంతరాత్మతో ఒకానొక సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటే, ఉలార్ సరస్సు తప్పనిసరిగా చూడదగిన ఒక ప్రకృతి మణిహారం.

మానసబల్ సరస్సు – నీటిమీద తేలే నీలిమల కళా ప్రదర్శన:

మానసబల్ సరస్సు, శ్రీనగర్‌కి ఉత్తరంగా, గందెర్‌బల్ జిల్లాలో ఉన్న ఓ చిన్న కానీ అద్భుతమైన సరస్సు. దీనిని “కాష్మీర్‌కు కన్ను” అని పిలుస్తారు. దీని చుట్టూ పచ్చని తోటలు, పూల తీరాలు, మరియు పురాతన శిల్ప కళలు ఉన్న నేపథ్యంలో ఇది ఒక ప్రశాంత పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతుంది. వేసవిలో తేలియాడే నీలి కొండల నీడల్లో షికారాలో ప్రయాణించడం, సరస్సు ఒడ్డున వానిమీద నిలిచినట్లుగా అనిపించే అనుభూతిని ఇస్తుంది.

కాశ్మీర్ రాష్ట్ర సందర్శనంలో శ్రీనగర్ పాత్ర చాలా ముఖ్యమయినది. జనం శ్రీనగర్ అంటే డాల్ సరస్సు, గుల్మార్ట్, సోనామార్గ్, పహల్గాంలతో అంతా అయిపోయిందనుకుంటారు. అది ఎంతో పొరపాటు శ్రీనగర్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని దర్శించవలసిన స్థలాలు అనేకం వున్నాయి. అయితే ఈ సందర్శనం అంతా కూడా ఖర్చూ, శ్రమలతో కూడుకున్నవి.

శ్రీనగర్ పట్టణానికి అరవై కిలోమీటర్ల దూరంలో వున్న ఉలార్ సరస్సు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. స్వచ్ఛమైన తీయని నీటితో ఏర్పడిన ఈ సహజ జనిత జలాశయం ఆసియా ఖండంలోనే ఓ అతి పెద్ద సరస్సుగా చెప్పబడుతోంది. దాదాపు 125 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ సరస్సు సముద్రమట్టానికి 1600 మీటర్ల ఎత్తులో వుండటం సృష్టి వైచిత్రంగా భావించాలి. ఈ సరస్సు హిమగిరుల నుంచి స్రవించే జలపాతాలను తనలో యిముడ్చుకునే సంధాయినిగా పరిగణించబడుతోంది. చుట్టూ అతి సుందరమైన పర్వత శ్రేణులు మనకు నయనానందకరంగా కనిపిస్తాయి.

 శ్రీనగర్ నుంచి ఉలార్ సరస్సుకి బస్సు సౌకర్యం వుంది. ప్రయాణం చితస్తా నదీ తీరం ద్వారా చక్కని దేవదారు అడవుల గుండా సాగుతుంది. ఉలార్ సరస్సు సంపూర్ణ దృశ్యాన్ని బాబా శుకృద్దీన్ పర్వత శిఖరాన్నుంచి గమనించవచ్చు. ఈ సరస్సులో నౌకా విహారానికి సౌకర్యం ఉంది. 

హర్వాన్ సరస్సులో నుంచి బంకీపూర్ అనే కాలువ బయలుదేరుతుంది. సరస్సులోని అధిక జలాల్ని యిందులోకి విడుస్తారు. సరస్సు మధ్యలో ఓ అందమైన ద్వీపం ఉంది. అందులో గతంలోని కాశ్మీర్ రాజయిన జైనులాబుద్దీన్ భవనం శిథిలావస్థలో వుంది. జీలం నదీ జలాలు కూడా ఈ సరస్సులోనే కలవటం గమనార్హం. ‘జీలం నదీ జలాలు యిక్కడ నుంచి బారాములా వైపు ప్రవహిస్తాయి.’ ప్రాచీన రావల్పిండి రాజమార్గం ఇక్కడ నుంచే బయలుదేరుతుంది.

మానసబల్ సరస్సు శ్రీనగర్ పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి కూడా బస్సు సౌకర్యం వుంది. సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులో వున్న ఈ సరస్సులో తామర పుష్పాలు అధికంగా కనిపిస్తాయి. ఈ జలాశయం అనేక రకాల పక్షుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. సరస్సు పరిసరప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పర్యాటక శాఖవారి విశ్రాంతి గృహం వుంది. యాత్రికులు యిక్కడ అధిక సంఖ్యలో బసచేస్తూ ఉంటారు.

శ్రీనగర్ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో గంధారబల్ అనే ప్రాంతం సింధూనదీ తీరంలో విస్తరించి వుంది. ఈ ప్రాంతం అంతా కూడా చినార్ వృక్షవనాలతో అత్యంత సుందరంగా ఉంటుంది. యాత్రికులు ఇక్కడ సహజ వాతావరణంలో బస చేస్తూ ఉంటారు.

డాచిగం నేషనల్ పార్క్ – అడవిలో ప్రకృతి పాటలు వినిపించే ప్రాణి పరదేశం

డాచిగం నేషనల్ పార్క్ (Dachigam National Park), శ్రీనగర్‌కు కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకృతి ప్రేమికులకి ఒక అద్భుత యాత్రా గమ్యం. “డాచిగం” అనే పేరు “పది గ్రామాల కోసం” అనే అర్థాన్ని కలిగి ఉంది – ఈ ప్రాంతాన్ని పాతకాలంలో పదిమందికి తాగునీరు అందించేందుకు అభివృద్ధి చేశారు. అనంతరం ఇది వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా నేషనల్ పార్క్‌గా అభివృద్ధి చేయబడింది.

ఈ పార్క్‌ ప్రత్యేకత:

  • ప్రపంచంలో అరుదుగా కనిపించే హాంగుల్ (కాశ్మీర్ స్టాగ్) కి ఇది చివరి అభయారణ్యం.
  • హిమాలయ కృష్ణమృగాలు, లెపార్డులు, కాళీ బక్క వంటి ఎన్నో జాతుల వన్యప్రాణులు ఇక్కడ నివసిస్తున్నాయి.
  • ప్రకృతిలో రెండు వేర్వేరు ఎకో-జోన్‌లు – లోయలుగా, పర్వతాలుగా విస్తరించిన ఈ ప్రాంతం, వేసవిలో పచ్చటి అడవులతోనూ, శీతాకాలంలో మంచుతోనూ విశేషంగా ఆకర్షిస్తుంది.

ప్రకృతి, వన్యప్రాణుల ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లకు ఇది ఒక జ్ఞాపకాల వెండితెరలా ఉంటుంది. డాచిగం అనేది కేవలం పార్క్ కాదు – అది కాశ్మీర్‌లోని ప్రకృతి శక్తిని, జీవ వైవిధ్యాన్ని అభినందించే ఒక జీవంత సందేశం. చారీ షెరీఫ్ అనే ప్రదేశం శ్రీనగర్ నుంచి యూన్మార్గికి వెళ్ళే మార్గంలో వుంది. షేక్ నూరుద్దీన్ లేక సందృషి అని పిలువబడే ఓ ఆశ్రమం యిక్కడ ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకుంది.

అచార్బల్ లో వేశప్ నదీ జలపాతం వుంది. 24 మీటర్ల ఎత్తు నుంచి దూకే ఈ జలపాతం సముద్రమట్టానికి 2400 మీటర్ల ఎత్తులో వుంది. యిక్కడికి దగ్గరలోవున్న కొన్న సరస్సు ఎప్పుడూ గడ్డకట్టుకునే వుంటాయి. శ్రీనగరి కి 24 కిలోమీటర్ల దూరంలో ‘బురహం’ అనే ఓ చారిత్రిక ప్రదేశం 

క్రీ.పూ. 2500వ సంవత్సర ప్రాంతాలకి చెందినదిగా భావించబడుతోంది. యూస్మార్గ్ సముద్రమట్టానికి 2377 మీటర్ల ఎత్తులో శ్రీనగర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీరపంజిల శిఖరలోయ మధ్యనున్న ఈ సుందర ప్రాంతం అంతా కూడా దేవదారు అడవులతో నిండి వుంది. ఈ ప్రాంతంలోనే యాత్రికుల సౌకర్యార్థం అనేక విక్రయాలయాలు పని చేస్తున్నాయి. ఉలార్, మానసబల్ లేక్స్ దర్శనాన్ని శ్రీనగర్ యాత్రకి అనుబంధంగా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం !

కీర భవాని దేవాలయం – భక్తి, ఆధ్యాత్మికతకు పూర్ణ సాక్ష్యమైన పవిత్రక్షేత్రం

శ్రీనగర్ నుండి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో గందెర్‌బల్ జిల్లాలోని తులముల గ్రామంలో వెలసిన కీర భవాని దేవాలయం, కాశ్మీర్ పండితుల విశ్వాసానికి, భక్తి శ్రద్ధకు ప్రతీకగా నిలుస్తుంది. హిందూ మతంలో మాతా రాగ్న్యా దేవిగా పూజించబడే ఈ దేవి, జలమధ్యంలోని దేవాలయంలో సనాతన పవిత్రతను తళుక్కుమంటూ భక్తుల హృదయాల్లో వెలుగులు నింపుతుంది.

దేవాలయాన్ని చుట్టుముట్టిన జలాశయం నీటి రంగును తరచూ మార్చుతూ, ఒక దివ్య శక్తి ఉన్నట్లుగా భక్తుల నమ్మకాన్ని బలపరుస్తుంది. జ్యేష్ట అష్టమి సందర్భంగా ఇక్కడ జరిగే ఉత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో సాగుతాయి. వృక్షవాటికల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ప్రాంగణం, ఆధ్యాత్మికత కోసం శోధనలో ఉన్న ప్రతి యాత్రికుడికి అనుభూతుల స్థలం అవుతుంది.

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర యాత్రకి అనుబంధ యాత్రగా కీరభవానిని దర్శించాల్సి వుంటుంది. శ్రీనగర్ పట్టణం నుంచి బస్సులో మొదట మనం పట్టాన్ అనే ప్రదేశాన్ని చేరుకుంటాం. శ్రీనగర్‌కు 27 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ గ్రామంలో అతి ప్రాచీనమైన ఓ సరస్వతీ దేవాలయం, మరో శివాలయం వున్నాయి. ఈ రెండు దేవాలయాలు కూడా క్షీణదశలో వున్నాయి. 

ఒకప్పటి కాశ్మీర్ దేశపు రాజయిన శంకరవర్మచే ఈ దేవాలయాలు నిర్మించబడ్డాయని వినికిడి ! రాజా శంకర వర్మ శ్రీనగర్ కి బదులుగా పట్టాన్నే రాజధానిగా చేసుకొని పరిపాలించాడంటారు. ఈ పట్టాన్ని ఆ రాజు పేరిట శంకరప్పూర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పట్టానికి 27 కిలోమీటర్ల దూరంలో బీర్సా నదీతీరాన్ని, దేవదారు వృక్షాలు అడవుల్ని ఆనుకుని వులార్ సరస్సు వుంది. 

ఉలార్ మానసబల్ సరస్సులకు ఎగువగా శ్రీనగర్కి 51 కిలోమీటర్ల దూరంలో కీరభవాని క్షేత్రం ఉంది. పౌరాణిక ఆధారాల ప్రకారం శ్రీలంకలోని రావణాసురుడి ఆధీనంలో నుంచి తొలిగిపోయిన పార్వతి ఈ కీరభవానిలోకి వచ్చి స్థిరపడిందట ! అలా వచ్చిన పార్వతి ఆకలితో స్థానికంగా ఉన్న సాధువుల్ని బిక్ష అడిగిందట. అప్పుడు సాధువులు ఆమెకు పాలతో వండిన పాయసాన్ని దానం చేసారట ! … ఆ పాయసం త్రాగిన పార్వతీదేవి వారికి కనిపించి ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయిందట ! దాంతో భక్తులు ఆ దేవేరి భోంచేసిన బీర్ పేరిట ఈ ‘కేరభవాని’ దేవాలయాన్ని నిర్మించారట !

చినారు నదీ తీరంలో నిర్మించబడిన కీరభవాని దేవాలయం చిన్నదయినా కూడా పాలరాతితో మెరిసిపోతూ వుంటుంది. దేవాలయం ఆవరణలో ఓ కోనేరు వుంది. ఈ కోనేరుని కీర సాగరం అని పిలుస్తారు. ఈ కోనేరు పైన వున్న కర్ర వంతెనని దాటి భక్తులు ఆలయ ప్రవేశం చేస్తారు.కీరభవానీ దేవాలయంలో శివపార్వతులకి పూజలు జరుగుతాయి.

రాజా ప్రతాప వర్మచే ఈ మందిరం పునర్నిర్మించబడిందని స్థానికులు చెబుతుంటారు. యాత్రికులు తమ వెంట తెచ్చిన పాలని ఈ కోనేరు నీటిలో కలుపుతారు. పాయలుగా నాలుగువైపులకి ప్రవహిస్తూ వుంటుంది. స్వామి వివేకానంద ఇక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించారట ! ఈ కోనేటి నీరు నాలుగు ప్రక్కనే దుర్గామాతాదేవి మందిరం, బుద్ధుడి దేవాలయం, మహావీరుడి గుడి వున్నాయి. జమ్మూ-కాశ్మీర్కి అనుబంధ యాత్రగా ‘కీరభవాని‘ దర్శించాలి. ఏప్రిల్-సెప్టెంబర్ మాసాల మధ్యకాలం ఈ యాత్రకి అనుకూలంగా వుంటుంది. చలి బారి నుంచి కాపాడుకునే ప్రయత్నాల్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి.

కీర భవాని దేవాలయం కేవలం ఆలయం మాత్రమే కాదు – అది నమ్మకానికి నిలయం, ఆధ్యాత్మిక అనుభూతికి ద్వారం. తులముల గ్రామంలోని ఈ పవిత్ర స్థలం, శాంతతరంగాలతో మనసును కట్టిపడేసే చైతన్యాన్ని కలిగిస్తుంది. నీటిమీద తేలుతున్న ఆలయ ఆవరణం, ప్రకృతితో మమేకమైన వాతావరణం భక్తులకు ఆంతరికమైన ప్రశాంతతను అందిస్తుంది.

ఆధ్యాత్మిక సందర్శనతోపాటు ప్రకృతిని ఆస్వాదించే వారు ఈ ప్రదేశాన్ని తప్పక చూసి అనుభవించాల్సిందే. మాత కీర భవాని కటాక్షం పొందాలనుకునే ప్రతి యాత్రికుడికీ ఇది ఒక తప్పనిసరి గమ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *