Vidura Niti – Life Principles Still Relevant Part 1

Vidura Niti – Life Principles Still Relevant Part 1

Vidura నీతి: Characters from the Mahabharata – Still Relevant Today Part 1

మహాభారతంలోని పాత్రలు – నేటికీ ప్రాసంగికత కలిగినవి:Vidura : మహాభారతం – భారత సాహిత్య సంపదలోని అజేయ రత్నం – అనేక వైవిధ్యభరితమైన పాత్రలు, సన్నివేశాలు, మరియు జీవిత భావనలతో నేటికీ సజీవంగా నిలుస్తుంది. ఈ భాగంలో, మనం ముఖ్యమైన ధార్మిక నాయకుడు, విదురుని (Vidura) జీవిత సూత్రాలను పరిచయం చేస్తున్నాం.

విదురుని పాత్రలో మనం చూడగలిగే ప్రధాన అంశాలు:

ధర్మం మరియు సత్యం: Vidura ని మాటల్లో మానవ జీవితానికి మూల్యాన్ని, ధర్మాన్ని ప్రేరేపించే సూత్రాలు, ఆధునిక కాలంలో కూడా మార్పిడి కాని మార్గదర్శకత్వం ఇచ్చే సందేశం.

జీవిత మార్గదర్శకత్వం: మహాభారతంలోని అనేక పాత్రలు – ధృతరాష్ట్ర, దుర్యోధన, భీష్మ, కర్ణ – వంటివి, ఆధునిక సమాజంలో కూడా మన ముందుకు వచ్చే ప్రతిరూపాలను సూచిస్తాయి. వీటిలో Vidura ని ఆలోచనలు మనకు నిజాయితీ, న్యాయం, మరియు మానవత్వం యొక్క అసలైన విలువలను గుర్తు చేస్తాయి.

నేటి సవాళ్ళపై ప్రకాశం: మానవ జీవితంలోని ఆవశ్యక మార్గదర్శకత్వం కోసం, విదురుని సూత్రాలు మరియు ధర్మ సిద్ధాంతాలు ఎలా ప్రాముఖ్యాన్ని వహిస్తున్నాయో, వాటి నానా ప్రాసంగికతను వివరిస్తూ ఒక దృష్టాంతం.

నేటి సవాళ్ళపై ప్రకాశం: మానవ జీవితంలోని ఆవశ్యక మార్గదర్శకత్వం కోసం, విదురుని సూత్రాలు మరియు ధర్మ సిద్ధాంతాలు ఎలా ప్రాముఖ్యాన్ని వహిస్తున్నాయో, వాటి నానా ప్రాసంగికతను వివరిస్తూ ఒక దృష్టాంతం.

ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా, మీరు మహాభారతంలోని ఈ ధార్మిక లేఖను ఆధునిక కాలంలో ఎలా అన్వయించుకోవచ్చో, జీవితం మరియు సమాజానికి దీనిలోని సందేశాలు ఎలా ప్రేరణగా నిలుస్తాయో అనుభవించగలుగుతారు.

అందరూ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, నిజాయితీ మరియు ధర్మాన్ని పాటించడానికి ఈ విభాగం ఒక విలువైన మార్గదర్శకత్వంగా మారుతుంది.

ప్రపంచ సాహిత్యంలోనే సమున్నతమైనది మహాభారతం. ఎన్నో వైవిధ్యభరితమైన సన్నివేశాలు, పాత్రలు, వివిధ మనస్తత్వాలు వెరసి అది సార్వకాలికము, సార్వజనీనమై శాశ్వతన్ని పొందింది. దానిలోని అన్ని పాత్రలు నేటికీ సజీవాలుగా కనిపిస్తుంటాయి. అడుగడుగునా పుత్రవ్యామోహంతో గ్రుడ్డివారవుతున్న ధృతరాష్ట్రులను చూస్తున్నాము, వావివరుసలు లేక స్త్రీలను చెరబట్టే సైంధవులు, కీచకులు కనిపిస్తున్నారు. స్వార్ధమే ఆకారంగా కలిగిన దుర్యోధనులనూ చూడవచ్చు, ఉదాసీనత వల్ల వంశాన్ని నాశనం చేసుకున్న ధార్మిక వర్తన కలిగిన భీష్మాదులూ ఉన్నారు… ధర్మరాజు లాంటి వారున్నారు. కుటిలత్వాన్ని ప్రబోధించిన కణికులూ ఉన్నారు… తమ గుర్తింపుకై రాజాశ్రయం పొంది ఆ స్థానాన్ని పదిలపరుచుకునేందుకై నిరంతరం తపించి తన వ్యక్తిత్వాన్ని పతనం చేసుకున్న కర్ణుని లాంటి పాత్రలూ కనిపిస్తాయి… అలాగే సర్వజన ఆమోదాన్ని పొందిన విదురుని లాంటి వారున్నారు. ఇక ముందుకాలాలలో కూడా ఈ పాత్రలు కనిపిస్తాయి.

భారతాన్ని సంస్కృతంలో వ్రాసిన వ్యాసుడు, తన రచనలో మానవ ధార్మిక జీవన విధానాన్ని విదురుని పాత్ర ద్వారా ప్రబోధించాడు. Vidura ధార్మిక జీవనానికి ప్రతీక. చాలా మంది ధార్మిక రహస్యాలు తెలిసిన వారుంటారు.. కాని Vidura ధర్మశాస్త్రాన్ని తెలియడమే కాదు దానిని జీవితాంతం ఆచరించాడు కూడా. అంతేకాదు, రాజయిన ధృతరాష్ట్రునికి నిర్మొహమాటంగా యుక్తాయుక్త మార్గాలను నిర్దేశించిన ధైర్యశాలి. ఎన్నో అంశాలపై ఏర్పడిన చిక్కుముడులను అత్యంత నేర్పుతో విప్పిన ధీశాలి.

దుర్యోధనుడు జూదక్రీడకై తండ్రి అనుమతి తీసుకునే సమయంలో అది తప్పని దుర్యోధనునికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాడు. దానికి కోపించిన దుర్యోధనుడు, “ఒడిలో పామును పెట్టుకున్నట్లుగా నిన్ను పెట్టుకున్నాము… మా విధానం ఇష్టమైనచో ఇచ్చట ఉండవచ్చు లేకున్న నీ ఇష్టం వచ్చిన వద్దకు వెళ్ళ”మంటాడు. దానిని Vidura పట్టించుకోలేదు. ఎందుకు? అంటే… దుర్యోధనుడు రాజు కాడు… అతని ఆజ్ఞను పట్టించుకోనక్కరలేదు. 

అదే పాండవులు అడవులకు వెళ్ళిన తదుపరి ఒకనాడు, ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి కౌరవులకు దేని వల్ల మంచి జరుగుతుందో చెప్పమని అడుగుతాడు. దానికి దుర్యోధనుని గురించి చెపుతూ “వీడు పుట్టిన నాటి నుండే దుర్నిమిత్తాలు పుడుతున్నాయి. వీడిని విడిచి పెట్ట మంటాడు. దానికి కోపించిన ధృతరాష్ట్రుడు “నీ సహాయం మాకు అవసరం లేదు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు” అనగానే రాజ్యభోగాలను తృణప్రాయంగా త్యజించి అడవులకు వెళ్ళాడు. ఎందుకు అంటే… ధృతరాష్ట్రుడు రాజు కనుక ఆతని ఆజ్ఞను పాటించడం విధి గనుక పాలించాడు. 

ఇది విదురుని ధర్మజ్ఞతకు తార్కాణంగా పేర్కొనవచ్చు. రాజు లేదా పాలకులు ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్దిష్టంగా సూచించిన విదుర నీతి ప్రపంచ ప్రఖ్యాతమయింది. దాదాపు ఆరువందల శ్లోకాలతో సంస్కృతంలో చెప్పబడిన విదుర నీతిని తిక్కనగారు కొన్ని పద్యాలలో మాత్రమే తెలుగు చేశారు. ఇప్పుడు ఆ విదుర నీతిని పాఠకుల సౌకర్యార్ధం ముఖ్యంగా యువత తమ జీవిత ప్రవృత్తిలో (Career)లో దానిని ఎలా ఉపయోగించుకునే అవకాశం ఉందో తెలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాము.

 ప్రజ్ఞాపూర్ణ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, వికాసం ఉంటుంది, విస్తరణ ఉంటుంది, ఆనందం ఉంటుంది. వాటిని సాధించాలి. ఆ ప్రయాణంలో ఎన్నో అవరోధాలూ ఎదురవవచ్చు. వాటిని బుద్ధిని ఉపయోగించి నేర్పుతో అధిగమించాలి. ఆ క్రమంలో మన గమనంలో ఎన్నో మార్పులు చేర్పులు అవసరం కావచ్చు. కొన్ని జోడింపులూ, కొన్ని తీసివేతలూ తప్పకపోవచ్చు. అవసరమైన వాటిని ఆహ్వానించడం, అవసరం లేని వాటిని వదిలించుకోవడం వల్ల జీవితం రసమయమౌతుంది.. శాంతియుత ప్రయాణం సాధ్యపడుతుంది.

మార్గం సుగమం అయ్యేందుకు అవసరమైన విధానాన్ని చూపుతాయి. ఒక్కటి గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. పరిస్థితులు లేదా సమస్యలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. మార్పు సహజమైన ప్రకృతిలో ఎదురయ్యే కష్టసుఖాలూ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలోనే వ్యక్తి పరిణతి వెలుగు చూస్తుంది. ఆలోచింపచేస్తాయి, అడుగులు వేయిస్తాయి, క్రొత్త ఆలోచనలకు తెర దీస్తాయి.

ఆలోచనలు Vertical Thinking అని Lateral Thinking అని రెండు రకాలు. మనం ఎన్నుకున్న మార్గంలో ఆలోచించేది Vertical Thinking కాగా క్రొత్త మార్గంలో సృజనాత్మకంగా ఆలోచించేది Lateral Thinking. Vertical Thinking లో నకారాత్మక ఆలోచనలను మూసివేసి లేదా ప్రక్కన పెట్టి ఆలోచన చేస్తాము. అదే Lateral Thinking లో నకారాత్మకమనేది ఉండదు. అన్ని కోణాలలో అన్నింటినీ కలుపుకుపోతూ ఆలోచిస్తాము. విషయం అర్థం చేసుకోండి… నేటి పరిస్థితులతో సమన్వయం చేసుకోండి… మంచిని జీవితాలకు అన్వయించుకోండి… జీవితాన్ని రసమయం చేసుకోండి, ఆస్వాదించండి… ఆనందంగా జీవించండి.

vidura niti mahabharata

Vidura Niti – Life principles that are still relevant today:

ఒక్కొక్కమారు మన ప్రమేయం ఉన్నా లేకపోయినా… తెలిసి గాని తెలియక గాని కొన్ని సమస్యలలో చిక్కుకుపోతాము. కొన్నిమార్లు అవి జటిలంగా మారవచ్చు. సింహంపై స్వారీ చేసిన విధంగా ఆ సమస్యలలో కొట్టుకుపోతూ ఎక్కడ ఆగాలో తెలియక ఏదో ఒకచోట ఆగిపోతాము. చుట్టూ సమస్యల పలకరింపులే… ఏం చేయాలో తోచనిస్థితి… ఎటువెళ్ళినా బలమైన తాకిడియే… ఆ స్థితిలో మానసికంగా అలసిపోయిన వేళ ఆత్మీయుల పలకరింపు అవసరం అవుతుంది. మన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. సమస్య మనది… నిజానికి పరిష్కారమూ మనమే వెతుక్కోవాలి కాని మనం చేసిన తప్పిదాన్నే స్మరిస్తూ ఇలా కాదు అలా చేయాల్సింది అనుకుంటూ గతాన్ని స్మరిస్తూ గగ్గోలుపడుతున్న వేళ పరిష్కారం లభించదు. ఎవరికైనా సమస్యను చెప్పి పరిష్కారం అడుగుదామని అనుకున్నా మన దోషాలను చెప్పేందుకు అహంకారం అడ్డమొస్తుంది. మనం పంచుకోవలసిన సమస్య క్రిందిస్థాయి వారితో అయిన వేళ అది మరీ బాధాకరం.. పూర్తిగా చెప్పలేము చెప్పకుండా ఉండలేము. సరిగ్గా ఇదే మహాభారతంలో ధృతరాష్ట్రుని పరిస్థితి.

Vidura నీతి మహాభారతంలోని ఉద్యోగపర్వం లోనిది. పాండవులు జూదంలో ఓడిన నేపథ్యంలో అరణ్యవాసం, అజ్ఞాతవాసం పిమ్మట తమ రాజ్యభాగాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ, ద్రుపద పురోహితుని దూతగా పంపిస్తారు. దానికి ప్రతిగా ధృతరాష్ట్రుడు సంజయుని ద్వారా ఉపప్లావ్యంలో ఉంటున్న పాండవులకు రాయబార సందేశాన్ని పంపడం, సంజయుడు అక్కడి నుండి వచ్చి రెండు మాటలు చెప్పి తాను బాగా అలసిపోయానని తెల్లవారి ఉదయం సభలో అన్ని విషయాలు వివరంగా సావధానంగా చెపుతానని చెప్పి వెళ్ళిపోతాడు.

    దానితో ధృతరాష్ట్రుని మనసులో అలజడి కలుగుతుంది. ధర్మరాజుకు సంజయుడు చెప్పినదేమిటి? ధర్మరాజు సమాధానం ఏమిటి? ఇవన్నీ అతనిలో అనిశ్చిత మానసికస్థితిని కలిగించాయి. కలతబడిన మనసు ప్రశాంతతను కోరుకుంటున్నది. తన మనసు తెలిసి తనకు ఓదార్పునివ్వగలిగిన విదురుని పిలిచి “తనకు నిద్రపట్టడంలేదని, తాపోపశమనానికై నాలుగు మంచిమాటలు చెప్పమని” అడుగుతాడు. నిజానికి అతనిలో మంచి విషయాలు తెలుసుకోవాలనే భావన లేదు. తనకు నిద్రపట్టేంత వరకు కాలక్షేపం కావాలి. తనలోని ఆవేదన చల్లారాలి… అది ధృతరాష్ట్రుని ఆలోచన. 

Vidura ని ప్రణాళిక వేరుగా ఉన్నది. సంజయునిచే పంపిన సందేశం యొక్క పూర్వాపరాలు తనకు తెలుసు. సంజయ రాయబారం అసంగతమైనది, అధార్మికమైనది. కాబట్టి అది ఆమోదయోగ్యమైనది కాదు. బలవంతులు, శౌర్యవంతులు అయిన పాండవులు యుద్ధానికి సన్నద్ధులైతే… మహా యుద్ధంలో జయాపజయాలు ఎలా ఉన్నా ఎందరో ప్రాణాలు పోగొట్టుకోవడం, వారి కుటుంబాలు అనాథలు కావడం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి అనివార్యమైన యుద్ధాన్ని నివారించేందుకు తన ప్రయత్నంగా యుద్ధం జరగవచ్చు.  దానికై తన మార్గాన తాను ప్రయత్నం చేశాడు.

ఇక్కడ ముఖ్యమైన ఒక విషయాన్ని గమనించాలి. దుర్యోధనుని నేతృత్వంలోని దుష్టచతుష్టయం రాజ్యభాగాన్ని ఇవ్వరు. వారి ఆలోచనను పరోక్షంగా అనుమోదిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు. 13 సంవత్సరాలుగా ఇరువర్గాలు కఠోర సాధన చేసింది వచ్చే యుద్ధంలో వైరి సేనను జయించాలనే లక్ష్యంతోనే. రెండువైపులా ఒకరినొకరు జయించేందుకు తగిన వ్యూహ ప్రతివ్యూహాలను రచించుకుంటూ సన్నద్దులౌతున్నారు. పైకి మాత్రం సంధి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో పాండవుల నుండి ద్రుపద పురోహితుని రాయబారం, కౌరవుల నుండి సంజయ రాయబారం జరిగాయి. పాండవులకు రాజ్యభాగం ఇవ్వడం అసంభవమని, వారి ప్రవృత్తికి అరణ్యవాసమే యుక్తమని చెప్పి పంపారు. దానికి వారు ఒప్పుకోరని తెలుసు… శాసించగలిగిన భీష్ముడు ఉదాసీన భావంతో నిర్లిప్తంగా ఉన్నాడు. ఈ పరిస్థితిని చక్కదిద్దవలసిన బాధ్యత గలిగిన నాయకుడు ధృతరాష్ట్రుడు నిష్క్రియాపరుడై, పుత్రవ్యామోహంలో కొట్టుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ధృతరాష్ట్రుని అంతరంగం ఆతృతతో రగిలిపోతున్నది. తాపోపశమనం కోరి విదురుని పిలిపించుకున్నాడు. 

ఇక్కడ Vidura బాధ్యత తీసుకొని ధృతరాష్ట్రునికి చెప్పగలిగిన విధంగా చెపుతూ పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంలో విదురునిలో విపత్కర పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత గలిగిన నాయకుని చూస్తున్నాము. సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు నాయకుడు ముందుగా ప్రస్తుత పరిస్థితులను గ్రహించాలి. సాధుబోధతో అవివేకులను వివేకవంతులను చేయాల్సిన బాధ్యతను తీసుకోవాలి. పిరికివారు, మొండివారు సైతం తమ మార్గాన్ని విడిచి ఉపద్రవ పరిస్థితిని అధిగమించి సంస్థ యొక్క ప్రగతికి తమవంతు సహాయ సహకారాలను అందించే విధమైన మానసికస్థితిని పొందేందుకు అవసరమైన ప్రేరణను నాయకుడు ఇవ్వగలగాలి. ఈ ఉద్దీపనా కార్యంలో నాయకుని విజ్ఞతాభరిత ప్రయత్నం కీలకమైనది. 

ఏ వర్గానికి అనుకూలంగా కాని ప్రతికూలంగా కాని తన నిర్ణయాలు, బోధలు లేకుండా సరళమైన విధానంలో పరిస్థితిని అందరికీ విశదీకరించి చక్కదిద్దగలిగిన నైపుణ్యం అవసరమౌతుంది. అక్కడ తన మాటలలో కాని చేతలలో కాని వెలుగుచూడవలసింది సర్వసమానతాగుణం… అప్పుడే అతడు సక్రమమైన సత్కార్య సాధకుడుగా చెప్పబడతాడు. అనుచరులలో సంఘటితశక్తికి అవసరమైన ప్రేరణాత్మక భావనను నింపగలుగుతాడు. శ్రద్ధతో, లోకకల్యాణాత్మక కార్య సాధనలో సఫలత సాధిస్తాడు. ప్రజాసంక్షేమమూ సాకారమౌతుంది. నాయకుని శ్రద్ధాసక్తులు, సమైక్యతాభావన, మార్గదర్శనలు, ఆచరణాదీక్షలే విజయసాధనా సూత్రాలు. విదురుని నీతి బోధలో దాదాపు ఇవన్నీ ప్రతిబించించాయని చెప్పుకోవచ్చు. విజయావకాశాలు దాదాపు మృగ్యమని తెలిసినా బాధ్యతాయుత ప్రయత్నశీలత విజయావకాశాలను దగ్గర చేస్తాయి. నిజానికి ఆ ప్రయత్నం సారవంతం కాలేదు. అయినా అది లోకానికి ఉపయుక్తమయింది. విదుర నీతిగా ప్రసిద్ధమైన ఆ నీతి యాజమాన్య నిర్వహణలో ఎందరికో మార్గదర్శన చేసింది. ఎందరో ఆ మార్గంలో తమ జీవితాలను తీర్చిదిద్దుకున్నారు.

Why Vidura Principles? Vidura నీతి ఎందుకు?:

ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం, Vidura అప్పటి పాలకుని అవసరార్ధం చెప్పిన కొన్ని నీతులు ఈ కాలంలో ఏ విధంగా ఉపయోగపడతాయి. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘకాలంలో, మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో, ఆనాటి సమస్యలకు చూపిన పరిష్కారాలు, ఈనాటి సమస్యలకు పరిష్కారాలను సూచించగలవా… ఒకవేళ సూచించినా అవి ఆమోదయోగ్యమా? ఆమోదయోగ్యమే అనుకుంటే… సార్వకాలిక, సర్వజనీనమై ఆ నీతి ఎలా అన్వయింపబడుతుంది? మారుతున్న సాంకేతిక విధానంలో విదుర నీతి తన ఉనికిని ఎలా నిలుపుకున్నది? ఆ దృష్టికోణంలో “విదుర నీతి”ని పరిశీలించి విశ్లేషించుకుంటే…

అందులో… చర్చించిన అంశాలు…

1. పాలకులు/ నాయకులు పాలనలో ఋజువర్తన కలిగి ఉండాలన్నది మొదటి అంశం.. పాలకులు తన పాలనలో ప్రజల సుఖసంతోషాలే ముఖ్యమని, వారి ఆనందంలోనే తన ఆనందం ఉన్నదనే విషయాన్ని గ్రహించాలని చెప్పాడు. తనకు వ్యక్తిగతంగా మంచిది అనిపించిన దానిని కాక ప్రజలకు ఏది ఉపయుక్తమౌతుందో దానిని మంచి అనాలని, దానిని స్వీకరించాలని, ఆచరించాలని చెప్పాడు.

2. విదురుని నీతి వాక్యాలను పరిశీలిస్తే పాలకునికి /నాయకునికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండకూడదు. సత్యం ధర్మం ఈ రెండూ ఊపిరులుగా పెనవేసుకొని ఆవిష్కృతమైన వ్యక్తిత్వమే పాలకుని నాయకుని వ్యక్తిత్వంగా మనకు అర్థం అవుతుంది.

3. రాజు/ పాలకుడు/ నాయకుడు ప్రజలలో ఒక వ్యక్తియే, కాకపోతే అతనొక ప్రముఖమైన వ్యక్తిగా గుర్తింపబడతాడు.

4. ప్రభుత్వం యొక్క లక్ష్యాలు నెరవేరబడాలి అంటే అవి సాధింపబడాలి. 5. విపరీత ధోరణిలో తీసుకున్న నిర్ణయాలుగాని, విపరీత ధోరణిలో తీసుకునే చర్యలు గాని సుపరిపాలనను అందించలేవు.. అంటాడు.

6. రాజ్యప్రగతి, ఉన్నతి, ఎదుగుదల శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుంది.. పాలకునికి శాంతిభద్రతల స్థాపనయే ప్రాధాన్యతాంశంగా ఉండాలని తెలిపాడు.

7. జీవితంలో అత్యున్నత విజయాన్ని సాధించాలంటే ప్రజలైనా పాలకులైనా జీవితాన్ని ఎలా సన్నద్ధం చేసుకోవాలో తెలిపాడు.

8. స్వయంప్రేరణ తో లక్ష్యసాధనలో ఎదురయ్యే అవరోధాలను ఎలా అధిగమించాలో తెలిపాడు.

9. పనిని చాలా మంది ఉత్సాహంతో ఆరంభిస్తారు.. కాని చిన్న పెద్ద అవరోధాలు ఎదురవగానే ఆ పనిని విరమిస్తారు. దాని వల్ల విజయం దక్కదు సరిగదా.. పడిన శ్రమ వృథా అవుతుంది. అయితే కొంత మంది మాత్రం ఎన్ని విఘ్నాలు ఎదురైనా ఆ పనిని పూర్తి చేసి విజయ సాధకులౌతారు. అలా అవరోధాలను అధిగమించి మానసిక సన్నద్ధతను ఎలా పొందాలో తెలిపాడు.

10. జీవిత పరమావధి సంపదను ప్రోది చేసుకోవడం కాదు. జీవితాన్ని ఆనందంగా గడపడం. ఉన్నత జీవనంలో ఆనందాన్ని పొందే మార్గాలేమిటి సాధించేందుకు ఏం చేయాలి… ఏమి చేయకూడదో వివరించాడు. 

11. ఏ పనినైనా చేయాలని సంకల్పించగానే ముందుగా కలిగేది “దానిని నేను చేయగలనా” అన్న సందేహం. ఆ సందేహాన్ని దాటేందుకు కావలసింది “చేయగలననే ఆత్మవిశ్వాసం”. ఆ ఆత్మవిశ్వాసాన్ని పొందడం ఎలా? అనేది వివరించాడు.

12. సృజనాత్మకంగా ఆలోచించడం ఎలా? అనేది వివరించాడు.

13. నాయకత్వ లక్షణాలు ఏమిటి.. ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకునేందుకు అవసరమైన లక్షణాలు ఏమిటి? అనేది వివరించాడు.

14. ఏ లక్షణాల ఆధారంగా పండితులను, మూర్ఖులను లేదా మంచి వారిని చెడు వారిని గుర్తించగలమో తెలిపాడు.

15. విజయ సాధనలో సహనం ప్రాధాన్యత.. ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది వివరించాడు.

16. ప్రజ్ఞాపూర్ణ నాయకత్వం ఏ అలవాట్లకు దూరంగా ఉండాలి… ఏ అలవాట్లను అలవరచుకోవాలి అనేది వివరించాడు.

17. ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి… బంధనచ్యుతి అంటే ఏమిటి? అనేది వివరించాడు.

18. జీవితమనేది అత్యంత మూల్యమైనది… దాని వెల ఎంతైనా దానిని భరించి ఆనందించడమే జీవితం. శాంతియా అశాంతియా, స్వర్గమా నరకమా, ఆనందమా బాధయా… అవేవైనా జీవితమనే నాణానికి ఉన్న రెండు ముఖాలే.. ఏ వైపు చూడాలి, దేనిని ఆదరించాలన్నది మన జయాపజయాలను నిర్ణయిస్తుంది అనేది వివరించాడు.

vidura niti vision

19. మార్పు కీలకమైనది.. మార్పు వల్ల క్రొత్త ఆలోచనలు వెలుగుచూస్తాయి. క్రొత్త ఆలోచనలు సృజనాత్మక క్రియాశీలతలను వెంట తెచ్చుకుంటాయి. కాబట్టి అవసరమైన చోట మార్పును ఆహ్వానించమంటుంది విదుర నీతి. 20. దేశ పటిష్టతకు ప్రజల ఆర్థిక ప్రగతి దోహదపడుతుంది. కాబట్టి వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, సమాచారం సాంకేతికత, ప్రణాళికాబద్ధ నడత ఈ ఏడు అంశాలు ముఖ్యమైనవి అంటాడు. వీటిని పటిష్టపరచడం వల్ల దేశ సౌభాగ్యం వర్ధిల్లుతుందనే భావన మనకు విదుర నీతిలో కనిపిస్తుంది.

22. స్పర్ధ అనేది రెండు వర్గాల/ దేశాల మధ్య దేశ ఆర్థిక పురోగతిలో ఉండాలే కాని పరస్పర హననకాండలో ఉండకూడదని చెపుతున్నాడు Vidura. నిన్నటి మీద ఈ రోజు ఎంత అభ్యుదయాన్ని సాధించామనేదే పాలకుల స్థాయిని నిర్ణయిస్తుంది కాని స్పర్ధతో ఒకరినొకరు చంపుకోవడంలో కాదంటాడు Vidura.

23. యుద్ధంలో గెలుపోటములు దైవాధీనాలు అందులో ఇరుపక్షాలూ మరణిస్తారు. అందులో మన రక్తసంబంధీకులూ ఉండవచ్చు

చెమటోడ్చి గెలిచినా, ఆత్మీయులను కోల్పోయి సాధించిన విజయం నిరర్ధక విజయంగా మారవచ్చు. అంతేకాదు, ఒక్కరి స్వార్థచింతన వల్ల 18 అక్షౌహిణుల సైన్యం యుద్ధాగ్నిలో ఆహుతికావడం సరికాదని హితవు పలుకుతాడు. (21870 రథములు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 పదాతి బలం ఒక అక్షోహిణీ అవుతుంది.) వీటికి తోడుగా ఆయుధాలు అందించేవారు, త్రొక్కిసలాటలో మరణించేవారు ఉంటారు. కాబట్టి యుద్ధం మంచిది కాదని చెపుతాడు. 

మనకు బాధలు కలిగాయని ఏడుస్తూ కూర్చుంటే ఆ బాధలు తొలిగిపోవు సరిగదా ఇంకా బాధిస్తాయి. దానికన్నా ఆ బాధలు మన జీవితాన్ని మరొక కోణంలో చూడమనే భగవంతుని పిలుపుగా భావిస్తే బాధలనే విషము ఆనందమనే అమృతంగా పరివర్తన చెందుతుంది. ఈర్ష్యాసూయలు జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. మనలో లేనిది ఇతరులలో ఉన్నది ఉత్తమంగా భావిస్తాము, దానిని మనం ఇష్టపడుతాము.. అయితే మన మనస్సు మలినమైనవేళ, ఇతరులలో ఉన్న ఆ గొప్ప లక్షణాన్ని గుర్తించి, అభినందించేందుకు మనస్సు ఒప్పుకోదు.

 దానితో మనలో జనించేది ఈర్ష్య లేదా అసూయ. అలాకాక ఆ గొప్ప లక్షణాలను గుర్తించి అభినందిస్తే మనలో అనంతమైన సకారాత్మకశక్తి ప్రవేశిస్తుంది, ప్రసరిస్తుంది. అలా కాని నాడు మనలో పాతుకుపోయిన “అసూయ” “సకారాత్మకశక్తి”ని అడ్డుకుంటుంది… దానితో పెరిగే ఒత్తిడి ఘర్షణాత్మక వాతావరణాన్ని స్పృజిస్తుంది.

అసూయ సామాన్యంగా ఇతరులతో పోల్చుకుంటుంది. నీకు ఉన్నది గుర్తించదు… లేని దానిని ఏ మార్గంలోనైనా కావాలనుకుంటుంది… విషయం తెలిసీ… ఆ తెలిసిన దానిని ఆచరించకపోవడం మూర్ఖత్వం. అసూయ మూర్ఖత్వానికి దారి చూపుతుంది. ఇలా ఎన్నో మహనీయ సూక్తులను దేశ కాలాలతో సంబంధం లేకుండా సర్వజనులకు ఉపకరించే విధంగా అందించాడు Vidura. అయితే ఆ సూక్తులను, ఆనాడు ధృతరాష్ట్రుడూ పాటించలేదు… ఈనాటి పాలకులూ పాటించడం లేదు.. పాటిస్తే ఆనాటి కురుక్షేత్రమూ ఆగేది.. ఈనాడూ ఎన్నో మహా యుద్ధాలూ ఆగి ఉండేవి…

Who is is Vidura? విదురుడు ఎవరు?:

శంతనుడు భీష్ముని తండ్రి అతడు. ఒకనాడు మత్స్యకన్య అయిన సత్యవతిని చూసి మనసుపడతాడు. అయితే ఆమె తండ్రి తన కూతురుకు జన్మించిన కుమారుడే రాజ్యాధికారి కావాలనే నిబంధన పెడతాడు. దానికి శంతనుడు సమ్మతించకపోయినా అతని కుమారుడు దేవవ్రతుడు అతడే భీష్ముడు. ఆ నిబంధనకు సమ్మతించి తాను వివాహం చేసుకోనని రాజ్యాధికారం కోరనని ప్రతిజ్ఞ చేసి వారిరువురికీ వివాహం జరిపిస్తాడు. వారికి జన్మించిన కుమారులు ఇరువురూ నిస్సంతువులుగా మరణించిన సమయంలో వంశాన్ని నిలిపేందుకు భీష్ముడిని వివాహం చేసుకోవలసిందిగా సత్యవతి కోరుతుంది. ఆ కోరికను తిరస్కరించిన భీష్ముడు దేవర న్యాయం ప్రకారం విచిత్రవీర్యుని భార్యలు సంతానాన్ని కనడం ధర్మ సమ్మతమని చెప్పడం, తదనుసారంగా సత్యవతి ఆదేశం మేరకు అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మించగా అంబిక దాసికి వేదవ్యాసుని ద్వారా Vidura జన్మించాడు.

ఒకప్పుడు మాండవ్య మహామునిచే శపించబడిన యముడు విదురునిగా జన్మించాడని మహాభారతం చెపుతుంది. యముడు ధర్మమూర్తి కాబట్టే విదురునిగా దాసికి జన్మించినా లోకహితాన్ని ధ్యేయంగా చేసుకొని జీవితాంతం బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించడం భారతంలో కనిపిస్తుంది. సాత్వికగుణ ప్రభావితమైన వ్యక్తిత్వం విదురునిది. తన ప్రవర్తనలో “యమం” పూర్తిగా మూర్తీభవించిన విధం కనిపిస్తుంది. శమదమాది గుణములను సాధించినా సేవాభావాన్ని ఆచరిస్తూ స్వధర్మాన్ని లోకహితం కొరకు సమర్పించాడు. అన్నగారయిన ధృతరాష్ట్రునికి మంత్రిగా, ఆంతరంగునిగా భీష్మునికి కుడిభుజంగా రాజ్యాంగాన్ని నడిపిన మహనీయుడు Vidura. నిజానికి భీష్ముని భుజబలం, విదురుని బుద్ధిబలం కౌరవ సామ్రాజ్యాన్ని పటిష్టపరచింది.

Vidura మొహమాటం లేని వ్యక్తి. చెప్పదలచిన విషయాన్ని స్పష్టంగా, సూటిగా చెప్పడం అతని నైజం. ధర్మాధర్మ వివేచనలో అతను నిష్ణాతునిగా పేరు గాంచిన వ్యక్తి. ధృతరాష్ట్రుని సహకారంతో దుర్యోధనుడు పాండవులను హతమార్చే ఎన్నో ప్రయత్నాలలో పాండవులను రక్షించిన వాడు Vidura. ముఖ్యంగా లాక్షాగృహ దహనం సందర్భంలో పాండవులను హెచ్చరించడం వల్ల వారిని కాపాడటం జరిగింది. ఇలా ఎన్నో సందర్భాలలో అతని పరిణత వ్యక్తిత్వం కనిపిస్తుంది.

Vidura ని వ్యక్తిత్వం:

జీవితం సాధనా పర్వం… ప్రతి వ్యక్తి జీవితంలో ఆటుపోటులు ఉంటాయి. ఎదురైన సంఘటనకు వ్యక్తి ఎలా స్పందిస్తాడనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. జీవితానికి నాలుగు పార్శ్వాలుంటాయి. భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక పార్శ్వాలుగా సాగే జీవితాన్ని సమన్వయం చేసుకోవడమే వ్యక్తి యొక్క సామాజిక ఆధ్యాత్మిక స్థాయిని నిర్ణయిస్తుంది.

మనలో చాలా మందిమి వ్యక్తిత్వ వికాసానికి, నైతికతకు మధ్య ఉండే భేదాన్ని అవగాహన చేసుకోము. మనం గెలవగలము, మనం అమ్మగలము అంటూ చెప్పే ఉపన్యాసాలకు ప్రభావితమై ఆ ఆలోచనా సరళి నుండి బయటకురాలేము. సమున్నత ఆశయాలు ఏర్పరచుకొని ఆవైపు నడవాలనే దృఢసంకల్పం వ్యక్తిలోని సామర్ధ్యాన్ని పెంపొందింపచేస్తుంది.

Performance in a particular area improves when expectations are high… ఎదుటి వారికి వారి తెలివి తేటలపై నమ్మకం కలిగే విధమైన జోస్యం చెప్పి… దానిని యదార్థం చేసే ప్రక్రియలో సహాయ కారిగా నిలవడం వల్ల ఎదుటివారిలో విశ్వాసాన్ని నింపగలుగుతాము.

పాశ్చాత్య ఆధునిక వ్యక్తిత్వవికాస సాహిత్యం ఎక్కువగా వ్యక్తి తక్షణ గెలుపు, సమస్యల తక్షణ పరిష్కారాలపై మాత్రమే దృష్టి పెట్టినది. కాని భారతీయ సాహిత్య మూలాలలో శీల నిర్మాణం ప్రధాన భూమిక వహించినది. వ్యక్తి నైతికత, మానవ మూలాలు, మూల్యాలు, సహనం, ధైర్యం నిరంతర పరిశ్రమ, నిరాడంబరత, త్యాగశీలత లాంటి అంశాలు భారతీయ సాహిత్యంలో ప్రధాన వస్తువులయ్యాయి. మానవ సంబంధాలు, సామాజిక సంబంధాలు పటిష్టపరుచుకుంటూ సానుకూల దృక్పథాన్ని పెంచుకునే ఆలోచనాసరళి వ్యక్తి యొక్క సకారాత్మక వైఖరిగా చెప్పబడుతుంది.

మనం ఆచరించే కర్మ, ఆలోచనలు, కోరికలు ఈ మూడు దారాలతో కుట్టబడినదే లేదా వీటి సమ్మిళిత రూపమే శరీరం. చైతన్యం శరీరాన్నీ మనసునూ నడిపించే ఒకానొక శక్తి. అనునిత్యం చేసే కర్మలు లేదా పనులు జ్ఞాపకాలను మనసులో నిక్షిప్తం చేస్తాయి… జ్ఞాపకాల నుండి అనుభవాలు ఆవిష్కృతమౌతాయి. అనుభవాలు కోరికలను స్మృజిస్తాయి. అంటే అనుభవాలకు ప్రతిరూపం మన ఆలోచనలు. అనుభవాలను విశ్లేషణ చేసుకొని, మంచి చెడులుగా విభజించుకోగలిగితే సదాలోచనలు ఆవిష్కృతమౌతాయి. జీవితం సరి చేయబడుతుంది.

ఏ జాతియైనా ఆ జాతిలోని ఒక తరం చేసే త్యాగాల వల్ల మాత్రమే భావి తరాల అభ్యుదయం వెలుగుచూస్తుంది. సంకుచిత ప్రయోజనాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం తరతరాల భవిషత్ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం వల్ల అపారమైన నష్టం. జరుగుతుంది. ప్రస్తుత తరం అహం చంపుకునైనా చేసే త్యాగం భవిష్యత్తరాలపై పెడుతున్న పెట్టుబడి లాంటిది. తప్పక సత్ఫలితాలను ఇస్తుంది. ప్రకృతిలో ఏదీ ఉచితంగా లేదా యాదృచ్ఛికంగా, ఆకస్మికంగా లేదా అయాచితంగా రాదు. ఒకరికి ఉచితంగా వస్తున్నది అంటే అది మరొకరి కష్టఫలితం మాత్రమే.

మనలోనిపూర్వ సమస్యలను మనం చూసే విధానంలోనే అసలు సమస్య ఉన్నది. నిశ్చితాభిప్రాయాల కళ్ళజోడు నుండి సమస్యలనూ, సమాజాన్నీ చూడటానికి అలవాటు పడ్డవాళ్ళం, ఆ బంధనాల నుండి బయటకు రావాలని ప్రయత్నం కూడా చేయము.

ఫలితం మరియు ఫలితాన్ని సాధించే సామర్థ్యం రెండూ సమాన నిష్పత్తిలో ఉన్నప్పుడు వ్యక్తిత్వం పరిణతి చెందేందుకు అవకాశం ఉంటుంది. సమత్వ దృష్టి కలిగిన వ్యక్తి యొక్క నిర్మాణాత్మక వైఖరి వల్ల వ్యక్తిత్వ పరిమళం చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అక్కడ స్థాయీ భేదాలు నిలవవు. మహా భారతంలో విదురుని పాత్ర మనకా వ్యక్తిత్వాన్ని చక్కగా పరిచయం చేస్తున్నది. Vidurudu దాసీ కుమారుడే అయినా ధృతరాష్ట్రుని లాంటి వారు, భీష్ముని లాంటి వారు ఆయనను గౌరవించారు… ఆతని సలహాలు సూచనలు రాజ్యపాలనలో ఆమోదించబడ్డాయి. ఆతని నాణ్యమైన జీవన విధానం కృష్ణుని లాంటి వారిని కూడా ప్రభావితం చేసింది. అందుకే రాయబారిగా వచ్చిన వేళ ఆతని ఇంట భోజనం చేశాడు. విదురుని వ్యక్తిత్వాన్ని ఒక్కసారి స్థూలంగా పరిశీలిస్తే…

మహా భారతంలో Vidura ని వక్తిగత జీవితం మచ్చలేనిదిగా కనిపిస్తుంది. విలువలతో కూడిన విద్య, పరిణతితో కూడిన ఆధ్యాత్మికశక్తి, సమష్టి చైతన్యంతో రూపొందించుకున్న సౌభాగ్యం ఎక్కడైతే నిలుస్తాయో ఆ సమాజంలో ప్రగతి ఉంటుంది, సుగతీ నిలుస్తుంది. అలాంటి సమాజ నిర్మాణానికి అహర్నిశలూ కృషి చేసిన వ్యక్తి Vidura. జీవితం పట్ల సదవగాహనతో కూడిన ఆలోచన, ఆచరణలో తాత్విక భావన, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఆతడు సత్యము ధర్మము… ఈ రెంటినీ నమ్మాడు, జీవితాంతమూ ఆచరించాడు. అవసరమైన సమయంలో నిర్భయంగా వాటిని ధృతరాష్ట్రునికి బోధించాడు. Don’t say yes, when you want to say “NO”.. అన్నట్లుగా చెప్పవలచిన అంశాన్ని అది ఎవరికి ఇష్టమైనా కాకున్నా వీలైనంత మృదువుగానే చెప్పాడు. 

ఆత్మనిగ్రహము, వినమ్రత, నైతికత, నిబద్ధత, పారదర్శకత లాంటి పలు లక్షణాలు ఆతని వ్యక్తిత్వంలో పరిమళిస్తున్నాయి. మానవత్వంతో కూడిన కార్యాచరణ అతని మంత్రాంగంలో కనిపిస్తుంది. ఆ లక్షణాలు ఈనాటి నాయకులకు అవసరమైనవే. అతను రాజకుటుంబానికి సంబంధించిన వాడైనా తన పరిమితులను తెలిసి ప్రవర్తించాడు. అతి చనువును ఎవరికీ ఇవ్వలేదు.. ఎవరి వద్ద తీసుకోలేదు. అలాగే అతి కాఠిన్యతనూ చూపలేదు. మధ్యేమార్గంలో ఎక్కడ ఏది ఎలా వాడాలో అలా వాడాడు. మిత్రులను, శత్రువులను ఒక కంట కనిపెట్టడం వల్ల, ఎన్నోమార్లు ఎన్నో ప్రమాదాలను తప్పించాడు. రాబోవు పరిణామాలను పసిగట్టడం వల్ల, దూరదృష్టి వల్ల కార్యనిర్వహణలో విజయం సాధించగలిగాడు. ముఖ్యంగా లాక్షాగృహదహనం వేళ ఆతని ముందుచూపే పాండవులను పెనుప్రమాదం నుండి కాపాడింది.

రాజధర్మంలో బలహీనులకు అండగా నిలిచి కాపాడాలనేది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం బలవంతులైన ఆత్మీయులను దూరం చేసుకోకపోవడం. బలవంతుల తో ఎప్పుడూ పలు సందర్భాలలో చెప్పడం అతని విజ్ఞతకు గీటురాయిగా నిలుస్తుంది. దాని వల్ల ప్రత్యక్ష యుద్ధం వల్ల అనవసరమైన ప్రమాదాలను కొనితెచ్చుకోవడమౌతుందనే సత్యాన్ని సమయమూ, ధనమూ, మానవ వనరులు వృథా అవుతాయనే సత్యాన్ని తన బోధనలలో చెప్పాడు. నిజానికి తక్కువ శ్రమ, తక్కువ శక్తి, తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని సాధించడమే నాయకత్వ లక్షణాలలో ప్రధానమైనది. సంఘర్షణ వల్ల దాని పరిణామాలను సరి చేయడంలోనే అమూల్యమైన సమయం, వనరులు వృథా అవుతాయి. 

వాస్తవిక దృక్పథంతో ఆ సంఘర్షణను నివారించేందుకు చివరివరకూ ప్రయత్నించిన వ్యక్తి Vidura. నిజాయితీ, ఆశావాదం, సంకల్పశుద్ధి, దూరదృష్టి, సాహసోపేత నిర్ణయాలు త్వరగా తీసుకునే సామర్ధ్యం, సమస్యలు త్వరగా పరిష్కరించుకునే విజ్ఞత, భావవ్యక్తీకరణలో సరళత, వక్తృత్వంలో, ఆలోచనలో స్పష్టత, భావోద్వేగాలను నియంత్రించుకోవడం. క్రింది వారికి కార్యసాధనలో ప్రేరణాత్మక సూచనలతో సహాయపడటం, అవసరమైన చోట గోప్యత… ఇలాంటి లక్షణాలు Vidura ని పాత్రలో అడుగడుగునా మనకు మహా భారతం లో కనిపిస్తుంటాయి.

 ఆశ్చర్యంగా ఈ లక్షణాలే ఆధునిక నాయకత్వ లక్షణాలుగా పలువురు విజ్ఞులు పేర్కొంటున్నారు.నిజానికి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి తన బలాలపై శక్తిసామర్ధ్యాలను వ్యయిస్తాడు. అదే పెద్ద పెట్టుబడిగా అతనికి ఫలితాన్నిస్తుంది. తన బృందాన్ని అపరిమితంగా విస్తరిస్తాడు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. బృందాన్ని విస్తరించడం అంటే సభ్యుల సంఖ్యను పెంచుకోవడం కాదు. అనుభూతిపరంగా, భావోద్వేగాలపరంగా అందరినీ దగ్గరగా తీసుకురావడం మాత్రమే. దాని వల్ల మాత్రమే ప్రయోజనం ఉంటుంది. 

యాంత్రికంగా కలపడం కాకుండా నిబద్ధతతో కూడిన ఆకర్షణావలయాన్ని నిర్మించడం వల్ల అందరూ ఒకే లక్ష్యంవైపు పయనిస్తారు. దీనికి ప్రాతిపదిక తనను ప్రజలెందుకు అనుసరించాలో తనకు తెలియాలి లేదా అర్థం చేసుకోవాలి. నాయకుడు విశ్వసనీయతను పెంచుకోవడం వల్ల కార్యనిర్వహణ సులువవుతుంది. ఆలోచనలో అంకిత భావన, ప్రవర్తనలో నైతికత, కష్టించి పనిచేసే తత్త్వం, చేసే పనిలో ఉత్పాదకత, బృందాలను తయారు చేసుకోవడం, వాటిని సరైన మార్గంలో నడిపించడం… ఇవి సాధారణ పనులనూ అసాధారణ రీతిలో నిర్వహించే నాయకుల లక్షణాలుగా చెపుతారు. 

ఈ లక్షణాలు కలిగిన నాయకులను ప్రజలు విశ్వసిస్తారు. ఎదుటి వారి మనసులలో బలమైన ముద్ర వేయగలుగుతారు. ఆ ముద్రవల్ల ఇతరులకు నాయకునిపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయానుసారం, వారి అంచనాలకు అనుగుణంగా పని చేయడం వల్ల ఇతరులు తనను అనుసరిస్తారు. దానితో వారికి విస్తృతమైన, బలమైన సామాజిక సంబంధాలు ఏర్పడుతాయి. తద్వారా కార్యనిర్వహణ సులువవుతుంది.

ఈనాడు చెపుతున్న నిర్వహణాశాస్త్రం ప్రకారం… “ఆచరణాత్మక ప్రణాళికలు రచించడం, ఆచరణలో వాటిని నిర్వహించడం, బాధ్యతతో వాటికి నాయకత్వం వహించడం, అవసరం మేరకు సరైన సమయంలో వాటిని నియంత్రించడం” ఈ నాలుగూ ఏ సంస్థ ప్రగతిలోనైనా ముఖ్య భూమిక వహిస్తాయని చెపుతారు. దీనికి సృజనశీలత, కార్యసరళిని అనుసరించడం, సమస్యను త్వరగా గుర్తించడం, మార్పును ఆహ్వానించడం, మార్పును స్వీకరించడం, నిర్ణయాత్మకమైన నిర్ణయాలు త్వరగా తీసుకోవడం, ఆ కార్యనిర్వహణ వల్ల కలిగే లాభనష్టాలను ఖచ్చితంగా, త్వరగా అంచనా వేయడం లాంటివి ప్రగతికి సోపానాలుగా చెప్పుకోవాలి. “అనిశ్చిత పరిస్థితి ఏర్పడిన సమయంలో తీసుకునే నిర్ణయం ప్రభావవంతంగా ఉండాలి. తక్కువ నష్టంతో బయటపడటం అవసరమౌతుంది. ఈ లక్షణాలన్నీ భారతంలో Vidura ని పాత్రలో మనకు దర్శనమిస్తాయి.

మిగితాది పార్ట్ 2 లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *