What Is The Importance of Us Growing Trees 1?

What Is The Importance of Us Growing Trees 1?

What is the importance of us growing trees?

Growing Trees లో గల ప్రధాన్యత యేమిటీ: మానవులు వర్షాలు, ఎండలు వచ్చినపుడు చెట్ల క్రింద తిండి బట్ట తరువాత మనిషికి గూడు కావాలి. పురాతన కాలంలో తలదాచుకొనేవారు. తరువాత ఆ చెట్ల ద్వారానే ఇళ్ళు నిర్మించడం నేర్చుకున్నారు. నేడు ప్రపంచంలో మనకు 400 పైగా చెట్ల ద్వారా మనకి మేలురకమైన ద కలప లభిస్తున్నది. నేడు ఇనుప తలుపులు, సిమెంట్ తలుపులు, / ప్లాస్టిక్ తలుపులు వచ్చినాగాని, కలపయొక్క ప్రాధాన్యత ఇంకా తగ్గలేదు. కలప ప్రధానంగా అడవుల నుంచి లభిస్తుంది. టేకును కలపలో రాజుగా పేర్కొనవచ్చు. కాని టేకు కలప చాలా ఖరీదు అయినది. మర్రి, చింత, నేరేడు, వేప, ఓక్, కూడా శ్రేష్టమైనవే! అడవులలో ఇవి పెరగటానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఆధునిక మానవులు నేడు విచక్షణా రహితంగా నేడు అడవులను నరికి వేస్తున్నారు. అడవులు తక్కువయిపోతే కలప తగ్గిపోతుంది. వాతావరణంలో కూడా మార్పు వస్తుంది.

చెట్టు యొక్క కాండంలో అనేక పొరలు వుంటాయి. ఆ పొరలు సంవత్సరానికి ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆ పొరలను లెక్కబెట్టి శాస్త్రవేత్తలు ఆ చెట్లు ఎన్ని సంవత్సరముల నాటిదో చెప్పగలరు. కాండంపై బెరడు మనకి చర్మం ఎట్లా, రక్షణగా వుంటుందో, చెట్టుకు బెరడు అట్లాగే రక్షణగా వుంటుంది. వర్షాకాలం, చలికాలములలో (Growing Trees) చెట్లు తొందరగా పెరుగుతాయి. వేళ్ళ నుంచి సారం కొమ్మలకి, ఆకులకి తొందరగా అందుతుంది. వేసవిలో మాత్రం ఈ ప్రక్రియ అంత తొందరగా వుండదు. ఆహారం కొరత ఏర్పడినప్పుడు కాండంకు చించుకుపోతుంది. అలాంటి సమయంలోనే చెట్లకు తొర్రలు ఏర్పడతాయి..

చెట్లు చేసే అపూర్వ సేవ:

Growing trees: ఒక సాధారణ వృక్షం 60 సంవత్సరాలు పెరిగినట్లయితే సమాజానికి 15,70,000 రూపాయల విలువగల సేవాసౌభాగ్యాన్ని కలిగిస్తుంది. ఆ చెట్టు సంవత్సరానికి 5,000 రూపాయల విలువ చేసే 1000 కిలోల ప్రాణవాయువును ఇస్తుంది. అంటే 50 సంవత్సరములకు దాని విలువ 2,50,000 రూపాయలు, 5,00,000 రూపాయలు, విలువ గల కాలుష్య నివారణ చేస్తుంది. వీటిని తిరిగి మరలా వినియోగానికి అనుకూలంగా మారుస్తుంది. దీని విలువ 3,00,000 రూపాయలు. వివిధ పక్షులు, జంతువులకు ఆశ్రమాన్ని కల్పిస్తుంది. దీని విలువ 2,50,000 రూపాయలు, 20,000 రూపాయల విలువగల జంతు సంబంధమైన ప్రోటీనులను తయారు చేస్తుంది.

plantation of growing trees

అసలు చెట్లు ఎలా శ్వాసిస్తాయి:

Growing Trees: పగటిపూట పచ్చని చెట్లు గాలిలోగల బొగ్గు పులుసు వాయువును గ్రహించి ప్రాణవాయువును బయటికి వదిలివేస్తాయి. అంతువులు మాత్రం దీనికి విరుద్ధంగా ప్రాణవాయువును గ్రహించి ( బొగ్గుపులుసు వాయువును విడుస్తాయి. అయితే చెట్లలో రాత్రి పూట బొగపులుసు వాయువును పీల్చే ప్రక్రియ ఆగిపోతుంది. అప్పుడు మాత్రం అవి ప్రాణవాయువును విడుదల చేస్తాయని సరిగ్గా జంతువులలాగే శ్వాసిస్తాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. నిజానికి అసలు పగటిపూట అని బొగ్గుపులుసు వాయువును గ్రహించడం వాటి శ్వాస ప్రక్రియ కాదు. ఇది ఆహారం సంపాదించుకొనే ప్రక్రియ. పగలు కూడా నిజానికి జంతువులలాగ అవి శ్వాసిస్తూనే వుంటాయి. కాని ఆ శ్వాస ప్రక్రియలో అది వదిలే బొగ్గు పులుసు గాలి అధిక ప్రమాణంలో వెలువడే ప్రాణవాయు వులో మరుగున పడిపోతూ వున్నది. చెట్లు వాతావరణ కాలుష్యాన్ని తెలియపర్చడంచెట్లు వలయాలు, సుళ్ళు పరిశోధించి వాతావరణంలోని కాలుష్యానికి గల కారణములు తెలుసుకొనవచ్చునని అమెరికాలోని నేషనల్ ల్యాబొరేటరీవారు ప్రతిపాదించారు.
19వ శతాబ్దము సగములో లోహాలు కరిగించే ప్రదేశమునకు 80 కిలోమీటర్ల దూరంలో గ్రేట్ స్మోక్ పర్వతాల దగ్గరగా చిన్న ఆకుల ‘ఫైన్’ వృక్షములతో ఏర్పడిన వలయాలను ఆధారం చేసుకొని ఇది ప్రతిపాదించబడినది. ఇప్పుడు నేషనల్ పార్కులో వున్న వృక్షాలు దీనివల్ల గిడసబారిపోయినాయి. వీటి దూలములలోని సన్నల వలయాలు సామాన స్థాయిలో కంటే ఎక్కువ ఇనుమును తెలియ చేస్తాయి.

ముఖ్యముగా రాగి కరిగించేటప్పుడు వెలువడిన సల్ఫర్ డయాక్సైడు వల్ల అధిక క్షారత ఇవి ఏర్పడ్డాయి. అడవులు ధ్వంసం) ప్రతి సంవత్సరం ప్రపంచంలోని పశ్చిమ యూరప్లో పోర్చలు సరిసమానమైన వైశాల్యంగల వర్షాధారపు అడవులను కొట్టివేస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కువ వర్షాధారపు అడవులు వున్న ఇండోనేషియాలో సంవత్సరమునకు సుమారు 2, 3 మిలియన్ ఎకరాల – విస్తీర్ణంగల అడవులను నరికివేస్తున్నారు. వ్యాపారానికి అవసరమైన కలపకోసం అడవులను కొట్టివేయడం వల్ల, మానవులు వసతి సౌకర్యాలు కల్పించుకోవడం వల్ల అమూల్యమైన అటవీవనరులు నశించిపోతున్నాయి.

Growing Trees: వ్యవసాయ భూములు సాగుచేసే భూములకంటె అడవులు 4 రెట్లు అధికంగా వాననీటిని నిలువ చేసుకుంటాయి. వరదలు రాకుండా అడవులు గంటకు 60 మొదలు 80 మిల్లీ మీటర్ల వర్షము నీటిని పీల్చుకుంటూ వుండి మనకి వరదలు తగ్గిస్తున్నాయి. వ్యవసాయం భూములు 22 మిల్లీ మీటర్ల వర్షపు నీటిని మాత్రమే గ్రహించగలవు. మానవులు కనుక ఒక చదరపు కిలోమీటరు అడవిని కొట్టివేయడం వల్ల 30,000 టన్నుల బొగ్గుపులుసు వాయువు వాతావరణం చెడుతూ వుంటుంది. అడవిలోని చెట్లను నరకడం వలనగాని, తగులబెట్టడం వల్ల గాని సాలీనా 100,000 చదరపు కిలోమీటర్ల అడవిప్రదేశం ధ్వంసం అయిపోతున్నదని బ్రిటీషు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. భారతదేశములోని గంగానదీ ప్రాంతంలోని అడవులలో 40 శాతం దాకా గత 30 సంవత్సరములలో నరికి వేయబడ్డాయి. దీని వలన అనేకమైన వరదలు, కరువు కాటకాలు సంభవించాయి.

Growing Trees:వర్షపాతాన్ని, వాతావరణాన్ని, అదుపు చేసేవి అడవులు, భారతదేశంలో సాలీనా అటవీ సంరక్షణ కార్యకలాపాలకు 8 లక్షల డాలర్లు ఖర్చు చేస్తూ వున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నాగాని మరో ప్రక్క వీటిని ధ్వంసం చేయడం వల్ల 80 కోట్ల డాలర్లు నష్టం వస్తూ వున్నది. అతి పురాతనమైన చెట్టు సుమారు 15 కోట్ల సంవత్సరముల కాలం నాటి చెట్టు తాలూకా శిలాస్థి ప్రస్తుతం మైసూరులోని జంతు ప్రదర్శనశాలలో వున్నది. చెట్టు మొదలులోని సూక్ష్మమైన కలప నిర్మాణము భద్రంగా నిలిచి ఉన్న ఈ శిలాస్థిని భూగర్భ శాస్త్ర శాఖవారు ఆంధ్రప్రదేశ్లోని అదిలాబాద్ జిల్లాలోని యామనపల్లి వద్ద వున్న ‘కోట’ కొండల ప్రాంతంలో దీనిని కనుగొన్నారు.

వెదురులోని రకాలు ఉపయోగాలు :

Growing Trees:వెదురులో 75 జాతులు, వెయ్యిరకాలు వున్నాయి. పెద్ద రాకాసిరకం వెదురు 35 మీటర్ల ఎత్తు నుండి 18 సెంటీమీటర్ల లావుగా పెరుగుతుంది. ఎత్తుగా వున్న శీతల ప్రదేశములలో పెరిగే వెదురు మనిషి లోపలకు ప్రవేశించలేనంత దట్టమైన కారడవులలాగా పెరుగుతాయి. వీటికి భూమిలో తేమ అవసరం. నీరులేని చోట ఇది పెరగదు. వెదురు భూమిలో అడ్డముగా పెరిగే వేరు నుండి పుట్టుకు వస్తుంది. వెదురులో అనేక రకాలు కొన్ని సంవత్సరములకు ఒకసారి పూతపూసి ధాన్యం పండి వెంటనే నశించిపోతాయి. ఒక రకం వెదురు సాధారణంగా పూత పూయటానికి 23 సంవత్సరాల కాలం పడుతుంది.

Growing Trees:ఇంకా కొన్ని అపూర్వమైన రకాలు అయితే ఒక శతాబ్దం పట్టవచ్చు. వెదురుకు ఒక విచిత్రమైన గుణంవుంది. ప్రపంచంలో ఏ మూలనయినాగాని ఒకే జాతికి చెందిన రకం ఒకే సమయములో పూతకు వస్తుంది. ఒకేసారి వెదురుపూత అంతా వెన్ను విరిసి ధాన్యం దిగుతుంది. దీనివలన ఎలుకలవంటి జంతువులలో జననాలు పెరుగుతాయి. వెదురు ధాన్యం నాశనం చేసిన తరువాత గాని ఎలుకలు వరిపంట మీదపడి నాశనం చేయడం ప్రారంభిస్తుంది. మానవునికి వెదురు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.

Growing Trees:ఇళ్ళు కట్టుకొనటానికి, నిచ్చెనలకు, కుర్చీలు, బల్లలకు, బుట్టలకు, చేటలకు, కిటికీ తెరలకు వెదురు ఉపయోగపడుతుంది. వీటిని నీటిపారుదలకు గొట్టాలుగా కూడా ఉపయోగిస్తారు. కాగితము తయారీలో గుజ్జును తయారుచేయటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వెదురు చిగుళ్ళను ఊరగాయలు పెట్టుకుంటారు. వైద్య చికిత్సకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. వెదురు చిగుళ్ళ కషాయం చాలా చలువ చేస్తుంది. కఫం, రక్తదోషం, మూలవ్యాధి, మధుమేహం మొదలయిన అనేక రోగాలకు పనికి వస్తుంది. స్త్రీలకు గర్భకోశమును శుభ్రం చేయుటకు దీని కషాయాన్ని ఇస్తారు. ఆకలిని పుట్టిస్తుంది. గడ్డి జాతికి చెందిన వెదురు మొక్కలలో కొన్ని రకాలు 90 అడుగుల ఎత్తుదాకా కూడా పెరుగుతాయి. మొలకా అనబడే వెదురు 24 గంటలలోనే విచిత్రంగా 2 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అతి శీఘ్రంగా పెరిగే చెట్లలలో ఒకరకం వెదురు 24 గంటల కాలంలో సుమారుగా 910 మిల్లీ మీటర్లు పెరుగుతుంది. ఇవి మూడు నెలల్లో 30 మీటర్లు ఎత్తు పెరుగుతాయి.

bamboo tree

తుమ్మ చెట్టు – ఉపయోగములు:

Growing Trees: పెద్ద పెద్ద పట్నములలో వుండేవారికి తెలియకపోయి నాగాని, గ్రామాలలో నివసించేవారికి అందరికీ తెలిసిన చెట్టు. ఇది ఎందుకు పనికిరాని ముళ్ళకంప చెట్టు అని చాలామంది అభిప్రాయం.ఇది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మరీ చిన్న చెట్టుకాదు. మధ్యరకంగా పెరిగే చెట్టు.
తుమ్మజాతికి చెందినవి ముఖ్యంగా నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ, బుద్ధ తుమ్మ, సీమ తుమ్మ అని నాలుగు రకాలు ఉన్నాయి. ఈ చెట్ల యొక్క బెరడు, కాయలు ఇండియా నుంచి యూరప్కు ఎగుమతి అవుతాయి. వాటినుంచి తయారు చేయబడిన టానిక్ దిగుమతి అయి టానిక్ గా ఇక్కడ వినియోగపడుతుంది.

Growing Trees: జూన్, జూలై నెలల్లో పూ నల్లరేగడి నేలలో బాగా పెరుగుతుంది. నదుల గట్టుమీద, అనుక పూసినప్పుడు తుమ్మచెట్టు. ఎంతో ప్రకృతి రమణీయంగా వుంటాయి. తమ్మకాయలు పశువులకు చాలా మంచి మేత తుమ్మ కర్ర చాలా దిట్టంగా వుండి చాలాకాలం మన్నుతుంది రెడ పట్టడు. బొమ్మలు, ఆట వస్తువులు దీనితో తయారు చేస్తారు. తుమ్మను బాగా ముదిరిన చెట్టు కర్ర నల్లగా అందంగా ఉంటుంది. గ్రామాలలో వంటచెరుకుగా ఎక్కువ వాడతారు. చింతపుల్ల తరువాత
బాగా ఎక్కువగా మండుతుంది. తుమ్మ చెక్కని చెప్పుల అట్టల మధ్య మందం కోసం వాడతారు. బట్టలకు ముదురు నీరు కాని రంగు వేయటానికి వాడుతారు. చెక్కును ఉడకబెట్టి రమ్ము, దేశవాళీ సారాయిని బట్టీ పడతారు. కాగితము పరిశ్రమలో కూడా దీని ఉపయోగిస్తారు.

Growing Trees:తుమ్మకాయలను ఉడకబెట్టిన యెడల కార్బానిక్ ఆమ్లాలు లభిస్తాయి. వీటితో తోళ్ళను పదునుబెట్టి వాటికి ఒక విధమైన పసుపువర్ణం వేయటానికి పూర్వం నుంచి మనదేశంలో వాడుకలో త ఉంది, సన్నపాటి కొమ్మలలో చాలాకాలం మన్నికగా వుండే బుట్టలు అల్లుతారు. తుమ్మ వేరు చెక్క చక్కెర పరిశ్రమలలో వాడబడుతూ | వున్నది. తుమ్మజిగురు, తుమ్మచెక్క, తుమ్మకాయలు మొదలయిన వాటితో వర్ణద్రవం తయారుచేసి నూలు బట్టలకు, పట్టుబట్టలకు రంగులు వేస్తారు. సాధారణంగా తుమ్మచెట్లు బీడు ప్రదేశములలో బాగా పెరుగుతాయి. రెమ్మలకు వాడిగా ఉండే ముళ్ళు ఉంటాయి. వీటి పువ్వులు, చిన్నచిన్న గుత్తులుగా పసుపుపచ్చని రంగులో చూడటానికి సాగనుగా వుంటాయి. ఇవి ఎక్కువగా కాలువగట్ల వెంట పెరుగుతాయి. కాబట్టి నీటి పక్షులు ఈ చెట్ల మీద గూళ్ళుగా కట్టుకుంటాయి.

కుంకుమపువ్వు చెట్లు :కుంకుమపువ్వు క్రోకన్సటివుస్ వృక్షజాతి పువ్వులలో కీలకము మీద కీలాగ్రాలు. కాశ్మీరు లోయలో అక్టోబరు నెలలో ఈ చెట్లు విస్తారంగా పూలు పూస్తాయి. పువ్వులు రంగు లేత ఎరుపు| వర్ణంలో ఉంటాయి. ఒక కిలోగ్రాము కుంకుమపువ్వును సేకరించటానికి 90,000 పువ్వులు అవసరము అవుతాయి.

లవంగాల చెట్టు:

లవంగాలు మిక్కిలి ముఖ్యమైన సుగంధ ద్రవ్యం. ఇది అన్నిరకముల కూరలలో మొదలయిన వాటిలో అవసరమైనది. లవంగాలకు క్లోవ్ అనే మాట లాటిన్ క్లావున్ నుంచి వచ్చినది. సుగంద ద్రవంగానే కాకుండా దీనిని అనేక ఔషధముల తయారీకి ఉపయోగిస్తారు. లవంగినూనె వంటి రోగాలకు ఉపయోగ పడుతుంది. భారతదేశంలో అడవి ప్రదేశం ఫెన్సింగ్ ఏజన్సీ వారు వివరించిన వివరాల ప్రకారం భారతదేశంలో భారతదేశంలో అడవులు గురించి నేషనల్ రిమోట్ / 1970-79లో ఉన్న 18.9 శాతం అడవి ప్రదేశం 1980-88లో 14.1 శాతానికి తగ్గిపోయినది.

మర్రిచెట్టు:

Growing Trees:కాలిఫోర్నియాలోగల ‘రెడ్ వుడ్’ చెట్టు ప్రపంచంలో ఉన్నతమైన చెట్లు, ఈ రెడ్వుడ్ వృక్షం 365 అడుగుల 6 ముల ఎత్తులో 40 అడుగులకై వారం కలిగి భూమి మట్టానికి అడుగుల ఎత్తుగా వుంది. 900 సంవత్సరముల పైన వున్న కాలిఫోర్నియాలోని కౌంటీలో రెడ్వుడ్ గ్రీక్కు తూర్పుగా వున్నది.
సాధారణంగా మరో “అతి శీఘ్రంగా పెరిగే చెట్టు మర్రి చెట్టు. ఇవి చెట్టు అభివృద్ధి పొందుతూన్న పరాన్నభుక్కు కాదు. కావలసిన పోషణను వాతా వరణంలో గాలి, వాన నుండి అదే స్తుంది.

Growing Trees:ఇతర చెట్లు, ఆకులమీద పక్షులు విసర్జించిన గింజలు మొలకెత్తి బలిష్టమైన వేళ్ళు బయలుదేరుతాయి. ఇవి బాగా రకపోయి భూమిలోకి చొచ్చి, దానికి ఆశ్రయమిచ్చిన చెట్టును వేస్తుంది. మృదువుగా, బూడిద రంగు బెరడుతో పెరిగే చెట్టు సాధారణంగా 20 మీటర్లు ఎత్తుగా పెరుగుతుంది. బాగా పెరిగిన చెట్టుకాండం సాధారణంగా స్తంభాకారంలో గుండ్రంగా ఉండదు. చెట్టు కొమ్మల నుండి బయలుదేరే అనేక ఊడలు చేరి ఇదిఏర్పడుతుంది.

చెట్టు కొమ్మల నుంచి బయలుదేరే ఊడలు క్రిందికి వ్రేలాడుతూ భూమిలోకి దిగుతాయి. ఇవి భూమిలో పాతుకుని బాగా పెరిగి చెట్టు కాండంగా తయారవుతుంది. పశ్చిమ బెంగాలులో కలకత్తా బొటానికల్ గార్డెన్స్లో ప్రసిద్ధి పొందిన మర్రిచెట్టు. అసలు ఒక ఖర్జూరం చెట్టు మొవ్వ మీద 1782వ సంవత్సరంలో బయలుదేరినట్టు నిర్ధారణ చేయబడింది. దీని మొదటి కాండం వీళ్ళు కనిపెట్టలేం. చాలా కష్టం. ఇంకొకటి గుజరాత్ బరూఖ్ జిల్లాలో వర్మదానది గట్టుమీద ఉన్న ‘కబీర్వాద్’ అనే మర్రిచెట్టు చారిత్రక ప్రసిద్ధి పొందింది. ఈ మర్రిచెట్లను ముఖ్యంగా విత్తనములు, కొమ్మలు మలంగా పెంచవచ్చు. బాగా పండిన పండ్లలో విత్తనాలు తీసి ఇటుకల పొడి, బొగ్గుపొడి చేర్చి నింపిన పూల కుండీలలో జల్లుతారు. వారు మొలిచిన తరువాత మొక్కలను బాగా ఎండ తగిలేచోట పెడతారు.

కొమ్మల ద్వారా వీటిని ప్రవృద్ధి చేయు విధానంలో 8 మొదలు 10 మీ. పెద్ద పెద్ద కొమ్మలు జనవరి – మార్చి మాసాలలో “భూమిలో పాతిపెడతారు. బాగా వర్షాలు పడేదాకా నీరు విస్తారంగా పెడుతుంటారు. మర్రిచెట్టు పూత పూయదు. కాయలే పండు తాయి. సాధారణంగా సూక్ష్మాతి సూక్ష్మమైన పుష్పాలు ఫిగ్స్ ‘లో కప్పబడి ఉంటాయి. ఈ ఫిగ్స్ కీటకాలు, చిన్న చిన్న మగ ఆడపువ్వులు ఉంటాయి. ఈ పురుగులు లేకుండా చెట్లకు విత్తనాలు రావు, ప్రతీ గ్లోను కీటకాలు ఉంటాయి పైన ఉండే రంధ్రం గుండా ఈ పురుగులు లోపలకు ప్రవేశించి గ్రుడ్లను పెడతాయి. ఇవి పొదగబడి పెరుగుతాయి. ఈ కొత్త పురుగులు వాటి నివాసాన్ని వదిలేటప్పుడు • పువ్వులలో పుప్పొడి అంటుకుని ఉంటాయి. ఇవి మరో ఫిగ్లో చేరి ఫలదీకరణం చేస్తాయి. సాధారణంగా ఫిగ్స్ ఫిబ్రవరి మే మాసాలలో గుడుతాయి.పేరు బలిష్టంగా ఉంటాయి. చెట్టు చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి మర్రిచెట్టు నీడకోసం రోడ్డుప్రక్తులు పెంచుతారు. దీని దీనిని పూర్తిగా నాశనం చేయడం చాలా కష్టం.

మర్రిచెట్టు కలప నీటిలో చెడిపోకుండా ఉంటుంది. వారు తయారుచేసి తాడు పేనుతారు. ఆకులు విస్తళ్ళు కుట్టుకుంటారు. నూతులలో ఒకలుగా దింపుతారు. దీని బెరడు, ఊడల నుంచి దీని జిగురు వంటి పాల నుంచి ఔషధం తయారుచేస్తారు. కండరాల నొప్పులకు, కీళ్ళ నొప్పులకు దీనిని వాడుతారు. చెట్టు బెరడు కషాయం | మధుమేహానికి దివ్యఔషధంగా పనిచేస్తుంది. ఆకులు వేడిచేసి కట్లు కట్టడానికి ఉపయోగిస్తారు.

పనస చెట్టు:

మామిడి, సపోటా, జామలాగే పనస కూడా బాగా పెరిగే ఫలవృక్షం. వర్షపాతం అధికంగా ఉండే ప్రదేశాలు పనసకు చాలా అనుకూలం. సాధారణంగా సారవంతమైన ఎర్రమట్టి భూములలో ఇవి ఏపుగా పెరుగుతాయి. సముద్ర మట్టానికి సుమారు 5000 అడుగుల ఎత్తున దక్షిణ భారతదేశంలోను, హిమాలయ పర్వత పాద ప్రదేశాలలోను పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాలలోను, గోదావరి జిల్లాలలోను పనసచెట్లను మామిడి తోటల్లో పెంచుతున్నారు. పనసరకాలు పూర్తిగా నిర్ణయించబడలేదు. కానీ పండు ఆకారాన్నిబట్టి, తొనల రంగును బట్టి, కాపుకాసే చెట్టుభాగాన్నిబట్టి, పరిమాణాన్నిబట్టి, లభించే కాలాన్నిబట్టి, ఉపయోగాన్నిబట్టి ఊహించి కొమ్మపనస, ఖర్జూర పనస, బురద పనస, వేరుపనస, తేనె పనస, ఎర్రపనస, పెద్దకాల పనస, చిన్నకోల పనస, గుండ్ర పనస, గులాబిపనస అని వివిధ రకాలుగా వ్యవహరింపబడుతుంది. బాగా పండిన పండులో తొనలు మంచి సువాసనతో తేనెలు కారుతూ తియ్యగా ఉంటాయి. పచ్చికాయలు పై పెచ్చుతీసి లోపలి భాగాన్ని పొట్టులా తరిగి రుచికరమైన అపురూపమైన వంటకాలు చేసుకుంటారు. పోక, ఏలకులు, కాఫీ, కోకో, మిరియాలు తోటలలో నీడకోసం Growing Trees వీటిని పెంచుతుంటారు.

చింత చెట్టు :

ఆఫ్రికా దేశానికి చెందిన వృక్షం. పండిన చింతకాయలలో చింతపండు గుజ్జుతో అనేక విధాలైన చల్లని పానీయాలను తయారుచేస్తారు. నూరు గ్రాముల గింజలు, ఉట్టేలులేని శుభ్రమైన చింతపండు 283 కెలొరీల శక్తిని ఇస్తుంది. చింతపండు తియ్యగా పుల్లగా ఉంటుంది. చింతపండు కొద్దిగా క్షారగుణం కలిగి ఉంటుంది. కాబట్టి పులిత్రేనుపులకు, కడుపు ఉబ్బరంతో కూడిన జ్వరం, వికారం, విదాహము మొదలైన రోగాలకు ఔషధంగా వాడుతారు. ఆరుచెంచాల చింతపండురసం ఉదయమే సేవిస్తే ఆకలి కలిగిస్తుంది.

వాపులకు, నొప్పులకు చింతపండురసం ఉప్పు కలిపి మర్దన చేస్తారు. బెణుకులకు, వాపులకు చిక్కటి చింతపండు రసం ఉడికించి పట్టువేస్తే వాపులు తీసి బెణుకు నొప్పి తగ్గుతుంది. నోటిలో చిగుళ్లు వాచి నెత్తురు కారుతూంటే చింతపండు నోటిలో పెట్టుకుంటారు. ప్రతిసారీ భోజనం అయిన తరువాత బాగా పండిన చింత పండు కొద్దిగాతింటే మంచి జీర్ణకారిగా ఉపయోగపడుతుంది. అజీర్ణ రోగాలకు, ఆకలి మందానికి చింతపండు చికిత్స ఉపకరిస్తుంది. నాలుగైదు చుక్కలు’ చింతపండు రసం ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలలో కలిపితే పాలువిరిగి నీళ్లు పైన చేరతాయి. పాలు విరగొట్టగా వచ్చిన తేటనీరు రోజుకు మూడు పూటలు పుచ్చుకోవాలి. ఈ పాల తేటనీటిలో పాలలో లభించే ప్రోటీనులు అన్నీ లభిస్తాయి; సులభంగా జీర్ణమవుతాయి. దీన్ని తీసుకునేటప్పుడు తేలికగా అన్నం తింటూండాలి.

భారతదేశంలో దక్షిణాత్యులు ప్రతిరోజు చింతపండుతో తయారు చేసుకున్న చారు, సాంబారు (పప్పు పులుసు) తింటారు కాబట్టి వారికి గుండెపోటు జబ్బులు, మూత్రకోశంలో రాళ్ళు పెరగడం మొదలైన రోగాలు చాలా అరుదు అని కొందరు శాస్త్రజ్ఞులు అభిప్రాయం.
చింతగింజల పొడికి అపూర్వ ఔషధగుణాలు ఉన్నాయి. ఒక పెద్ద చెంచాడు చింతగింజల పొడి శుభ్రమైన నీటితో రోజుకు మూడు పర్యాయాలు పుచ్చుకుంటే ఆమశంక, జిగట విరేచనాలు నివారింపబడతాయి, అర్ధ పెద్ద చెంచాడు చింతగింజల పొడి రోజుకు రెండుసార్లు తేనె అనుపానంతో సేవిస్తే రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.

ఒక పెద్ద చెంచాడు చింతగింజల పొడి రుచికి కావలసినంత పంచదార కలిపి రాత్రి పూట భోజనానికి ముందు రెండు వారాలపాటు తీసుకుంటే వీర్యస్థలనాన్ని నివారిస్తుంది. చింత చిగురుతో అనేక రకాల రుచికరమైన వంటకాలు తయారుచేసుకుంటారు. దీనియందు ఎసిలు, ఇనుము పుష్కలంగా లభిస్తాయి. చింతకర్ర కాల్చగా వచ్చిన చింతబొగ్గు పొడి, తగినంత ఉప్పుపటిక, పిప్పరమెంటుపూవు చేర్చి పండ్ల పొడి తయారుచేస్తారు. నువ్వుల నూనెలో చింతబొగ్గుల పొడి చేర్చిన ముద్దకాలిన పుళ్ళను శీఘ్రంగా మాన్చుతుంది. ‘పులిత్రేనుపులకు, అజీర్తివల్ల కలిగే వాంతులకు, ఇతర మత్తులకు, అజీర్ణానికి చింతపండు దివ్యౌషధము. విషపదార్థాలు జఠరకోశంలో చేరినప్పుడు చింతపండు.రసాన్ని అనేకసార్లు తాగించి కృత్రిమ వయనం చేయిస్తారు.

అన్నకోశము వాచినప్పుడు చింతపండు రసంలో లవంగాలు, దాల్చినచెక్క (లవంగపట్ట) నూరి ఆ ముద్దను కలిపి త్రాగిస్తారు. 10 మిల్లీలీటర్ల శుభ్రమైన నీటిలో గ్రాముల చింతపండు రెండుగంటలసేపు నానబెట్టి ఆ నీటిని నాలుగేసి గంటలకొకసారి పుచ్చుకుంటే వాంతులు తగ్గిపోతాయి. ఎప్పటికప్పుడు తాజాగా ఈ మందును చేసుకుంటూండాలి. 25 గ్రాముల చింతపండు 120 మిల్లీ లీటర్ల నీటిలో ఒకగంటసేపు నానబెట్టి 6 గ్రాముల పంచదార చేర్చి ఇస్తే తలతిరగడం తగ్గుతుంది.

ఇప్పచెట్టు:

ఇప్పచెట్టు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్లో విస్తారముగా అడవులలో పెరిగే చెట్టు ఇప్పచెట్టు. ఇది సాధారణంగా పొడిగా వుండే రాతినేలలో ఏపుగా పెరుగుతుంది. బాగా పెరిగిన ఇప్పచెట్టు సుమారు 10 మొదలు 15 మీటర్లు ఎత్తుగా పెరుగుతుంది. మహావృక్షాలలో ఇది ఒకటి. ఈ చెట్టు బెరడు సాధారణంగా నల్లగా ఉంటుంది. ఒక్కొక్కటి బూడిద వర్ణంలో కూడా ఉంటుంది. చెట్టు బెరడు దీని ఆకులు బాగా దళసరిగా, సూదిగా ఉంటాయి. ఆకులలో ఈనెలు బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. బాగా కండగలిగిన చిన్న చిన్న పువ్వులు తెలుపు వర్ణంలోగానీ, పాలిపోయిన తెలుపు వర్ణంలోగానీ ఉంటాయి. కస్తూరి వాసనతో ఘుమఘుమ లాడుతూంటాయి. దీని కాయల్లో పెద్ద పెద్ద గింజలు ఆకుపచ్చగా ఉంటాయి. బాగా పండినప్పుడు గింజలు పసుపు రంగుగా ఉంటాయి. ఇప్పచెట్టు బెరడు మొదలు గింజలు దాకా అన్ని భాగాలు ఏదో విధంగా ఉపయోగిస్తారు.

ఇప్పపువ్వులను ఉడకబెట్టుకొని తింటారు. లేకపోతే ఎండబెట్టి పొడిచేసుకుని తింటారు. అవసరమైనప్పుడు పళ్ళను కూడా తింటారు. ఇప్పపువ్వులు రుచిగా తియ్యగా ఉంటాయి. కాస, క్షయ మొదలయిన రోగాలను హరిస్తుంది. వెల్లుల్లిలాగా ఇవి తిన్నప్పుడు వీటి వాసన వంటికి పడుతుంది. దీని బెరడు కషాయం వాతపు నొప్పులను హరిస్తుంది. చిగుళ్ళ వెంట రక్తం కారినప్పుడు. ఈ కషాయం పుక్కిలిస్తారు. శరీరం మీద దురదలు, పుళ్ళ నివారణకు దీన్ని ఉపయోగిస్తారు. ఈ కషాయం మధుమేహానికి బాగా పనారాయణ పనిచేస్తుంది.

మాడ్చిన ఆకుల బూడిద నేతిలో కలిపి కాలిన పుళ్ళకు, బొబ్బలకు వాడితే తొందరగా తగ్గుతాయి. ఇప్ప కల్లు తగుమాత్రం ఔషధంగా వాడినప్పుడు ఇది ఒక అమోఘమైన టానిక్ గా పనిచేస్తుంది. ఇప్ప విత్తులనుండి తీసిన నూనె పైత్య తాలకు మందుగా పనిచేస్తుంది. తలవెంట్రుకలకు పుష్టిని కలిగించి బా పోగొడుతుంది. జుట్టు నల్లబడుతుంది. శరీరంపై దురదలు ప్రణములను పోగొడుతుంది. పిల్లల కడుపులో క్రిములను కూడా ‘ నాశనం చేస్తుంది. కళ్ళకు ఎంతో మేలు చేస్తుంది. ఇప్పనూనెను ఎక్కువగా సబ్బుల తయారీకి, క్రొవ్వొత్తుల తయారీకి ఉపయోగిస్తారు.

Growing Trees:పంటలకు కూడా ఉపయో గిస్తారు. పూర్వం మన దేశంలో దీపావళినాడు ఇప్పనూనె తోనే దీపాలు పెట్టుకునేవారు. ఇప్పనూనె తీసిన తరువాత వచ్చే ఇప్పపిండి పశువులకు పుష్టికరమైన ఆహారం, భూమిని సారవంతం చేయడానికి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పపిండిని బాగా చూర్ణం చేసి ఒక చిన్న గుడ్డపీలికలో వేసి గట్టిగా చుట్టి పత్తిలా తయారుచేయాలి. అ వత్తిని వేపనూనెలో నానబెట్టి నూనెను పిండి, వత్తిని కలిపి వెలిగిన బాగా నిలిచి మండుతుంది. ఆ మంటను ఊది ఆర్పితే పొగ బయలుదేరుతుంది. యీ పొగ వాసన చూచిన నొప్పి తగ్గుతుంది. ఇప్ప కలప చాలా గట్టిగా ఉంటుంది. గృహ నిర్మాణాలకు, ఇతర కట్టడాలకు ఉపయోగిస్తారు.

సాధారణంగా ఇప్పచెట్టు 10 మొదలు 15 సంవత్సరాలకు పూతకు వస్తుంది. అన్ని చెట్లు ఒకేసారి పుష్పించవు. పూతకాలం చెట్టుచెట్టుకి ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని వేసవిలో పుష్పిస్తే, కొన్ని శీతాకాలంలో పుష్పిస్తాయి. ఇప్పచెట్టు 40 సంవత్సరాలపాటు పళ్ళు ఫలాలను ఇస్తుంది.

Growing Trees ముగింపు:

చెట్లు మనిషి జీవితంలో అపరిమిత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. అవి వర్షాలను ఆకర్షించడంలో, వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో, మరియు మనకు అనేక ఉపయుక్త పదార్థాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కలప ముఖ్యమైన వనరు అయినప్పటికీ, విచక్షణా రహితంగా అడవులను నరికివేయడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందువల్ల, అడవులను కాపాడుతూ, మరిన్ని Growing trees ద్వారా భవిష్యత్ తరాలకు మనం ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *