Our Festivals: Essential Duties and Best Traditions to Follow
మన Festivals – చేయవలసిన విధులు: ఈనాడు మనం జరుపుకునే festivals శ్రీమహాభారత కర్తయైన శ్రీ వేదవ్యాసమహర్షి వేదాలను విభాగించి పురాణాలను రచించి యావత్ మానవాళికి ఈ పర్వదినాలు ప్రసాదించాడు. మనం జరుపుకునే పెండ్లి, వడుగు, బారసాల మొదలగు పుణ్యకర్మలకు కావలసిన విధులు తెలియజేశారు. హిందూ పండుగలన్నింటికి, నిత్యం సంధ్య వారు కోవాలన్నా ముందుగా మనకు ‘హిందూకాలమానం’ తెలియాలి. ప్రతి శుభకార్యమునకు ‘సంకల్పం’ లేకుండ మంత్రకాండ జరుగదు. కనుక హిందూవులమైన మనము హిందూక్యాలెండర్ తెలుసుకోవాలి. ఇది తెలిస్తే మనకు ఏ పండుగ తరువాత ఏయే పండుగ వస్తుందో, ఏ మాసం తరువాత ఏ మాసం వస్తుందో మనకు తప్పక తెలుస్తుంది.
ఇప్పుడు జరుగుతున్న కలియుగం యొక్క ‘ఆది’ అంటే సంవత్సర ప్రారంభకాలము (కలియుగ ప్రారంభ) కాలము) ‘ప్రమాది’ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఏర్పడిన గ్రహాల కూటమితో ప్రారంభమైనది. (ఇది షుమారు 5094, సంవత్సరముల క్రితం వచ్చినది. ఆరోజు శుక్రవారము, సూర్యగ్రహణం, అమావాస్య, అర్ధరాత్రి అష్టగ్రహకూటమీ అన్నీ కలిసి మేషరాశి ప్రారంభ బిందువులో కలిసిన కాలమే మన పంచాంగాలకు మూలం. ఆనాడే శ్రీకృష్ణుని నిర్యాణం జరిగింది. అదియే హందూ క్యాలెండర్కు మూలస్థంభము. ఆ రోజే సంవత్సరాది ప్రారంభం. ఆ చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారం ప్రారంభమైన ‘యుగాది’ మనకు ఇప్పుడు జరుపుకునే ‘ఉగాది’గా మారింది.
ఉగాది festival:
మనకు ప్రతిసంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమినాడు ఉగాది Festival వస్తుంది. ఈ పండుగ రోజున మనము చేయవలసిన విధులు. ఉదయం 5.30 గంటలలోపు నువ్వుల నూనెతో తలంటు కొని స్నానం చేయాలి. తిలకం ధరించి, నూతన వస్త్రములను ధరించాలి. తరువాత సూర్యభగవానునికి నూతన సంవత్సర సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి, ఆర్ఘ్యము, దీపం, ధూపం (ఊదువత్తి) సమర్పించి ఆ తరువాత “వేపపూత పచ్చడి” విధిగా తినాలి.
“నింభకుసుమ భక్షణం” అంటే.
“శతాయు ర్వజ్రదేహాయుః సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింభ కుసుమ భక్షణం”
ఈ వేపపూత పచ్చడిలో చింతపులుసు, మామిడిచి గుళ్ళు (చూతకుసుమం), అశోకవృక్షాల చిగుళ్ళు (అశోక కళికా ప్రాశనము) తో తయారుచేసి
“త్వామష్ఠ శోక నరాభీష్ట! మధుమాస సముద్భవ ! నిబావి శోక సంతప్తాం మామశోకం సదా కురు”
అంటే జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను ఓ అశోక కలికమా! నిన్ను సేవించుచున్నాను. మధు మాసము (వసంతము)లో చిగురించిన అశోకమా! నీవు నన్ను శోకములు లేకుండా (అ + శోకము) చేయుదువు గాక! అని అర్ధము. అశోక వృక్షములో అట్టి దివ్యశక్తి గలదు.
ఈ festival ప్రత్యేకమైనది: వేపపూత పచ్చడి వేపపూత రెమ్మలు, లేతమామిడి / చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్త బెల్లము, కొర బునాడు చింతపండు పులుసు, చిన్న చిన్న మామిడి ముక్కలు మనము / చెరుకు ముక్కలు, జీలకఱ్ఱ, పటికబెల్లము. ఉగాది రోజున పూర్ణ కుంభదానం ఆచరించాలి. నూతన అంటే రాగి చెంబును కలశంగా ఏర్పాటు చేసి కలశపూజ నూతన చేసి పంచపల్లవాలు వేసిన సుగంధ జలములో చందనముఖ్యము, పుష్పాలు, అక్షతలు వేసి పుణ్యమంత్రాలలో ఆవాహన చేసి దేపూత ఒక పళ్లెములో బియ్యము పోసి కలశమును అందులో / నిలబెట్టి, దానికి క్రొత్త వస్త్రము చుట్టి పసుపు, కుంకుమ, చందనములతో అలంకరించాలి. పూజా కార్యక్రమమయిన తరువాత పురోహితునికి దానమివ్వాలి. క్రొత్త వస్త్రాలు, దక్షిణలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి. దీనినే పూర్ణకుంభ దానము, ధర్మ కుంభ దానము లేక ప్రసాదానము అంటారు.
పంచాంగ శ్రవణం :
ఈ festival రోజు మనం పంచాంగశ్రవణం వినుట వలన, తిథి వలన సంపదయునూ, వారము వలన ఆయుష్య దేవిశే మునూ, నక్షత్రము వలన పాప పరిహారమును, యోగము వలన వ్యాధిని వృత్తియునూ, కరణము వలన కార్యాను నైవే కూలమున్నూ కల్గును. ఈ పంచాంగ శ్రవణం వల్ల ‘భూమి, పక్కల బంగారము, గోవులు, ధాన్యము, కన్యను దానము చేస్తే కల్గినంత ఫలితం కల్గుతుంది. అంతేకాక రాజాధి నవ నాయకుల యొక్క – నివారణ అయి, వినువారికి ఆరోగ్యమూ, ఆయుష్యును, గ్రహ ఫలితాలను శాస్త్రోక్తంగా వినుట వల్ల గ్రహదోషములు, సంపదల యందు శుభ ఫలితాలు కల్గును.
శ్రీరామ నవమి festival:
నవమి festival జరుపుకుంటున్నాము. సీతారాముల కళ్యాణం. శ్రీ శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజున మనము శ్రీరామ శ్రీరామ చంద్రమూర్తి రావణుని వధించి దిగ్విజయంగా నవమి తరువాత దశమి రోజున శ్రీరామపట్టాభిషేకము / అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుకూడ ఈ రోజే. మరునాడు జరిగినది. ఇది ప్రతి హిందువుకు మరువరాని సంతోషమైన రోజు. ఈ రోజున ధనశక్తికొలది ప్రతివారూ సీతారామ భరత శత్రుగ్నుల విగ్రహం గాని శ్రీరామ పట్టాభిషేక పటమును గాని పెట్టి పూజచేయాలి.
Festival పూజా విధానము:
Festival నాడు పూజా మందిరంలో గాని, పీఠం పైన గాని కడిగి పసుపురాసిన పీట వేసి దానిపై కుంకుమతో అలంకరించాలి. పీట మధ్యన చందనంతో అష్టదళ పద్మమును వ్రాయాలి. దానిపై నూతన వస్త్రమును పరచాలి. నూతన వస్త్రముపై బియ్యంతో “సందిలము” ఏర్పాటు చెయ్యాలి. ‘స్తుందిలము’ అనగా పీటపై పోసిన బియ్యంను అర 5 అంగుళం మందంతో నలుచదరంగ ఏర్పాటు చేయాలి. పీట మధ్యలో కలశం ఏర్పాటు చేయాలి. కలశము గంధ పుష్పాక్షతలతో పూజించి దాని చుట్టూ అష్ట దిక్పాలకులనూ, నవగ్రహములనూ, ‘అధిదేవతా ప్రత్యధిదేవత’ . సహితముగా ఆవాహనచేసి ‘మండపారాధన’ చేయవలెను. పూజా మండపమునకు నాలుగు ప్రక్కలా అరటి పలకలు, లేత చెరకుగడలూ కట్టి పూలతోనూ, మామిడాకు జలతోనూ అలంకరించాలి.
పూజ జరిగే పందిరికి స్తంభాలు, 2 కొబ్బరి ఆకులు, అరటిబోవెలు కట్టి, మామిడి తోరణాలతో అలంకరించవలెను. తర్వాత పురుష సూక్త సహితముగా శ్రీరామచంద్రమూర్తిని సపరివార సమేతముగా పూజ చేయాలి. ‘రామాష్టోత్తరము’, ‘సీతాష్టోత్తరము’, ‘ఆంజనేయా ష్టోత్తరము’ చదువుతూ తులసి, మారేడు, తమలపాకులతో సీతాదేవినీ, తమలపాకులతో ఆంజనేయుని పూజించి, శ్రీసూక్త పూజించాలి. తులసితో రామచంద్రుని, మారేడు దళములతో పురుషసూక్తములు, విష్ణుసహస్రనామము పఠించవలెను. నైవేద్యం: చక్కెరపొంగలి, మామిడిపండ్లు, చెరకు ముక్కలూ, పానకము, వడపప్పుతో నైవేద్యమిచ్చి కరూరహారతి నీయవలెను. ఈవిధంగా అతి వైభవంగా నడుపవలెను.
శ్రీ హనుమజ్జయంతి festival:
శ్రీ ఆంజనేయ స్వామివారి భక్తులకు ఇది ముఖ్యమైన పర్వదినము. చైత్రశుద్ధ పూర్ణిమనాడు మనము హనుమ జ్జయంతి జరుపుకుంటాము. భక్తతులసీదాస్కు సాక్షాత్కారం ఇచ్చి ఇప్పటికిని హిమాలయాలలో చిరంజీవిగా తపస్సు చేసుకొను చున్నాడు. “రామాయణంలోని ఆంజనేయుడు జీవించి ఉంటాడా?” అని ఆశ్చర్యపోనక్కరలేదు. ఆయన చిరంజీవుడు! అతులిత బలధాముడు మహాయోగి.
Festival పూజావిధానం:
హనుమజ్జయంతినాడు పూజా మందిరంలో ఆంజనేయ స్వామి పటం పెట్టి యథావిధిగా షోడశోపచారములతో పూజించాలి.
“అంజనానందనం వీరం కోటి బలార్కనన్నింధ్యాయామ్యహ రామదూతం సర్వదా హృదయాంబుజే ”
అనే శ్లోకంతో ఆవాహన చేయవలెను. ఆ తర్వాత పురుష సూక్త విధానంతో అఝ్యం, పాద్యం, ఆచమనీయం, నైవేద్యం మొదలయిన షోడశోపచారములతో పూజచేయ వలెను. ఆ తర్వాత క్రింద తెలుపబడినట్లుగా ఆంజనేయుని అంగపూజ చేసి తర్వాత ఆంజనేయ అష్టోత్తరశతనామ పారాయణ చేయవలెను. ధూపం సమర్పించునపుడు గుగ్గిలం సాంబ్రాణితో దశాంగమూ కలిపి ధూపం వేయవలెను. ధూపం సమర్పించు నపుడు గుగ్గిలం సాబ్రాణితో దశాంగము, కలిసి ధూపం వేయవలెను. దీపారాధన చేసినపుడు ఆవునేతితో చేయ వలెను. నైవేద్యం ఇచ్చునపుడు మామిడిపండ్లు, గుడాన్నము (బెల్లంతో చేసిన చక్కెరపొంగలి), వడలూ నివేదన చేయవలెను. శనిదోషం కలవారు నువ్వులతో కలిపిన బెల్లం ఉండలు (చిమ్మిలి) 18 గానీ 108 గాని చేసి నివేదించవలెను. ఎర్రని వస్త్రముతోను, ఎర్రని పుష్పముతోనూ, ఎర్రని చందనం (రక్త చందనం) తోను, ఎర్రని అక్షతలతోను ఆంజనేయస్వామిని ఆరాధించవలెను. దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు సేవించాలి. హన్మాన్ చాలీసా సుందరాకాడ పారాయణ చేయాలి. అలా చేసిన అన్ని రంగాలలోను ఎనలేని విజయం, ధైర్యసాహసాలు చేకూరుతావి.
కృష్ణాష్టమి festival:
ద్వాపర యుగములో రోహిణీ నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు. ఆరోజు మనము “శ్రీకృష్ణాష్టమి” పండుగను జరుపు కుంటాము. ఈరోజు వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చు కొని తులసీదళాలు వేసిన చన్నీటి స్నానం చేయాలి. అలా చేస్తే ‘ సమస్త నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. పగలు ఉపవాసం ఉండి పూజా కార్యక్రమము జరుపవలెను. ఈ రోజు సాయంత్రం ఇంటియందున్న పూజామందిరం అలంకరణ చేయాలి.
పూజా పీఠమునకు పసుపురాసి కుంకుమతో బొట్లు పెట్టి వరిపిండితో దానిపై ముగ్గులు వేసి తీర్చిదిద్దాలి. వేరు, రాగి, ఇత్తడి (శక్తికి తగిన విధంగా) చెంబులో (పాత్ర) మంచి నీటిని నింపి, అందులో రాగి నాణెములు, రత్నములు, మామిడి ఆకులు, పంచ పల్లవములుంచి వాటిపై కొబ్బరి కాయ ఉంచవలెను. రంగు కల్గిన నూతన వస్త్రముతో ఆ కొబ్బరికాయకు చుట్టవలెను. ఆవిధంగా తయారుచేసిన కలశమునకు పుష్పగంధాక్షతలతో అలంకరించవలయును. (రాగి, వెండి, బంగారంతో తయారుచేసిన ‘శ్రీకృష్ణ’ ప్రతిమను కలశంపై ఉంచి పూజించవలెను. ఇలా చేయుటకు అవకాశం లేనివారు శ్రీకృష్ణ పటమును మండపము లేక పీఠముపై ఉంచి పూజించవలెను. దేవాలయమునకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు సేవించి శ్రీ భాగవతమును విని దినమంతా గడుపవలెను. పల్లెటూర్లలో దేవాలయాలలో ‘ఉట్టుకొట్టు’ కార్యక్రమము ఉండును. అది తిలకించవలెను.
వినాయకచవితి festival:
భారతీయుల తొలి festival వినాయకచవితి. ఈ పండుగ భాద్రపదమాసంలో చతుర్దశినాడు మనము వినాయక చవితి తరువాతనే మిగతా పండుగలన్నీ ప్రారంభ మవుతాయి. జరుపుకుంటాము. వినాయక చవితినాడు వేకువజాముననే లెగిసి అభ్యంగ స్నానం చేసి గడపలకు పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి. గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. పూజామందిరంలో దేవుని పీఠాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఇరువైపుల అరటి స్తంభాలను కట్టాలి. పాలవెళ్ళి కట్టి దానికి కలువ పూలు, మొక్క బొత్తులు, ఉమ్మెత్తకాయలు, వెలగపండ్లు వేళాడగట్టాలి.
పూజా మందిరంలో అలంకరించిన పీటపై బియ్యం పోసి, దానిపై “పత్రి”ని కొంత ఉంచి పత్రిపై మట్టితో చేసిన వినాయక ప్రతిమను ఉంచవలెను. తలపై గొడుగు ఉంచాలి. మొదట గౌరమ్మను పూజించి ఆ తరువాత స్వామివారిని 21 రకాల పత్రితో, పూలతో పూజించాలి. చదువుకునే పిల్లలు వారివారి పుస్తకాలను సామివారి వద్ద ఉంచాలి. వినాయక వ్రత కథ పుస్తకంలో సూచించిన విధంగా పూజ నిర్వహించాలి. కథలోని శమంతకోపాఖ్యాన్ని విని అక్షింతలు తలపై చల్లుకుంటే చంద్రున్ని చూచినా నీలాపనిందలు రావని మన పూర్వీకుల విశ్వాసము.
దసరా festival:
ఆశ్వయుజమాసంలో శుద్ధపాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమము. . అందుకనే దేవీనవరాత్రులు” అని పిలువబడు చున్నవి. పూజామంది రంలో కలశస్థాపన చేయుటకు వేదికను తయారుచేసుకోవాలి. గోమ ఆవుపేడతో నలుచదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజాసామాగ్రితో పాటు పంచవల్లవాలు (ఐదు రకాల లేత చిగుళ్ళు కల్గిన చెట్టుకొమ్మలు) దూర్వాంకురములు (గరికపోచలు) తయారుగా ఉంచుకోవాలి.
Festival పూజా విధానము:
తెల్లవారుజామునే పట్టువస్త్రం కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు గ్రేవి అభ్యంగన స్నానం (తలస్నానం) చేసి, నామం ధరించి, ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై జింక చర్మము లేదా పంచెగాని, ఆసనంపై వేసి, లేనివారు (పీట మీద) తూర్పు రాఘ్రచర్మము లేదా తెల్లని పట్టుబట్టగాని ఎర్రని పట్టు ముఖం గాని, ఉత్తరముఖంగా కాని కూర్చుండవలెను. “ ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువును, పరమాత్మను ప్రార్ధించి, పదినిముషములు ధ్యానించి, గాయత్రీ మంత్రం జపించిన తరువాత మహాసంకల్పం చెప్పవలెను. గృహస్తు అయినవాడు భార్యతో సహా సంకల్పం చేయవలెను. ముందుగా విఘ్నేశ్వరపూజ జరిపి స్వస్తిపుణ్యాహమలు చెవలెను. ఆ తరువాత బ్రాహ్మణులకు వరణనిచ్చి తో.. దిరోజులు (నవరాత్రం) గాని లేదా ఏడురోజులుగాని హీన.. క్ష్యం మూడురోజులు కాని లేదా ఒక్కరాత్రి దీక్షగాని శక్త్యా సారము దీక్ష చేయవలెను. పూజాకాలములో రోజుక్ సారి భుజించి ఏకభుక్త వ్రతము చేయవలెను. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాధన రాత్రింబగళ్ళు వెలుగవలెను.
నాడు తన ఆయుధములను పూజించు పద్ధతియే నేటికీ ఆయుధపూజ : పూర్వకాలము రాజులకు ఈ నవమి ఆయుధపూజగా చేయబడుతున్నది. ఆయుధము లతో పాటు ఛత్రచామరములు రాజలాంఛనములు తానెక్కిన వాహనములను లేదా తాను పనిచేయు యంత్రములను పూజించవలెను. గజము, అశ్వము (ఈనాడు కారు, సైకిలు వంటి వాహనము
శమీపూజ: శమీ శమతే పాపం శమీ శతృనాశనం అను మంత్రంతో శమీ (జమ్మీ) వృక్షము ను పూజించ వలెను. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంలంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి, అపరాజితా దేవిని ఈ విధముగా పూజించవలెను.
మధ్య అపరాజితాయై నమః ఇత్యవరాజితామావాహ తద్దక్షిణే క్రియా శక్యైనమః ఉమాయైనమః ఇతి జయాం నామతః ‘ఇతి విజయామా వాహ్మ అపరాజితాయైనమః జయాయైనమః విజయాయై నమః
అట్లతద్దె Festival:
పండుగలను ఉయ్యాలల పండుగ అని, గోరింటాకు పండుగ అని అంటారు. భాద్రపద బహుళ తదియనాడు. వచ్చే పండుగను ఉండ్రాళ్ళ తద్దె అని, ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే పండుగను అట్లతద్దె అని అంటారు. ఈ రెండు పండుగలకు కన్నెపిల్లలు, ముత్తయి దువులు పండుగ ముందురోజు గోరింటాకు అందంగా అలంకరించు కుంటారు. ఆ మరునాడు వేకువ జామునే లేచి తలస్నానాలు ముగించుకొని అందంగా అలంకరించు కుంటారు. తరువాత పూజామందిరంలో మందిరంపీఠకు పసుపు, కుంకుమలతో అలంకరించి ఆ పీఠపై బియ్యం పోసి చదును చేయాలి. పసుపుతో గౌరమ్మను చేసి కుంకుమతో అలంకరించి తమలపాకు పై ఉంచి అలంకరించిన పీటపై ఉంచవలెను. ఆ తరువాత, ఉండ్రాళ్ళు, మిగతా పిండివంటలు గౌరమ్మకు నైవేద్యం పెట్టాలి. గంధం, పసుపు, పుష్పాలతో, అక్షింతలతో పూజించాలి. ఇది భక్తిశ్రద్ధలతో చేయాలి.
ముగ్గురు కాని, ఐదుగురు గాని ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వడం ఆనవాయితి. ఇలా చేసినందువల్ల ఆ గౌరీదేవి అనుగ్రహంతో కడుపు చలువ, ఐదవతనంతో పాటు ఎంతో పుణ్యం వస్తుంది. ఇది అట్లతద్దె జరుపు కోవడంలో ముఖ్య ఉద్దేశం. చద్ది తిన్న తరువాత, తాంబూలం వేసుకొని సరదాగా స్నేహితుల ఇండ్లకు వెళ్ళి ఉయ్యాలలూగుతారు.
దీపావళి festival:
ఈ దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ చతుర్దశి అమావాస్యనాడు వస్తుంది. ఇది రెండు రోజుల పండుగ. త్రయోదశినాటి రాత్రి “అపమృత్యు” నివారణకోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందుంచాలి. నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయాలి. (నూనె యందు లక్ష్మీ, నీటి యందు గంగ వుంటారు. కనుక “అలక్ష్మీ పరిహారానికై వంటికి, తలకు నూనె రాచుకొని అభ్యంగస్నానం చేయాలి) నూతన వస్త్రములు ధరించి ఇంటి యందుగాని, దేవాలయము నందు గాని పూజ చేయించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనట్టయితే అప్టైశ్వర్యాలు కలుగుతాయి. పంచత్వక్కులు మర్రి, మామిడి, జువ్వి, అత్తి, నేరేడు మొదలగు చెట్ల ఆకులు నీటిలో వేసినానబెట్టి ఆ నీటిలో అభ్యంగనస్నానం చేయాలి. లక్ష్మీపూజ చేయాలి. శ్రీ సూక్తం గాని, లక్ష్మీ సహస్ర నామస్తోత్రం కాని, అష్టోత్రంగాని చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
నాగుల చవితి festival:
వృశ్చికరాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల మనము నాగులచవితి పండుగ చేసుకుంటాము. ఇది మహిళామణుల పండుగ. సూర్యోదయానికి పూర్వమే నిద్రమేల్కొని తల స్నానం చేయాలి. నూతన వస్త్రములు ధరించి, నాగులకు ఇష్టమైన ఆవుపాలు, కోడిగ్రుడ్డు మరియు పూజాసామాగ్రి, ప్రసాదం తయారు చేసుకొని ఇంటిల్లిపాది దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆదిశేషుని అనుగ్రహం పొంద వలెను. ముఖ్యంగా కన్నెపిల్లలు, సంతానం కావలసిన మహిళలు భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి భర్త, శుభప్రదమైన సంతానం కల్గునని ప్రతీతి. తరువాత చిన్న పిల్లలు దీపావళినాటి మందుగుండు సామాగ్రిని (కాకర పువ్వోత్తులు) పుట్ట వద్ద సంతోషంతో కాలుస్తారు. కుజ, రాహు దోషాలున్నవారు, సంసారిక బాధలున్న వారు సుబ్రహ్మణ్యస్వామివారి పూజను ఈ మాసంలో వచ్చే షష్ఠీ, చతుర్దశిలలో మంగళవారంనాడుగాని, చతుర్దశి బుధవారం కలిసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసం చేసి, నాగులకు పాలుపోసి, నాగపూజ, అశ్వత్థ నారాయణ ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా చేసిన వారివారి దోషాలు నివారణమై సుఖశాంతులతో వర్ధిల్లగలరు. ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరుతాయి. రుణమిముక్తులవుతారు.
ముక్కోటి ఏకాదశి festival :
పుష్యమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి అందురు. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా / అంటారు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది ఈ వైకుంఠ ఏకాదు. ఈ రోజు వైకుంఠంలో మూడు కోట్ల దేవతలు శ్రీ – వారు మన్నారాయణున్ని దర్శించి సేవించుకుంటారు…. షష్ఠి, అందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది.
పోసి, ద్వారాలు మూసి ఉంచుతారు. ముక్కోటి ఏకాదశి రోజున ధంగా మాత్రమే ఈ ద్వారాలు తెరుస్తారు. భక్తులు సూర్యోదయానికి ఉంచాలి. (ఆవునెయి గలరు. ముందే నిద్రలేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని ఉత్తర ద్వారం ద్వార దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవాలి.
సంపూర్ణంగా లభిస్తుంది. భద్రాచంలోనూ తిరుమల క్షేత్రాల్లో ఈ ఉత్తరద్వార దర్శనం’ విశేషంగా జరుగుతూంటుంది. శ్రీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బంగారు వాకిలిలో జేగంటలున్న ప్రదేశానికి ఎడమపక్కగా ‘ముక్కోటి ప్రదక్షిణం వుంటుంది కూడ.
మకర సంక్రాంతి festival:
మనకు పెద్ద festival సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుము ఆ రోజూ ఉదయాన్నే ఇంటి ముంగిళ్ళలో రంగవళ్ళులు వేస్తూ నెలపట్టుతారు. ఆడపిళ్ళలు తెల్లవారుజామునే లేచి ఆవుపేడతో గో చేసి గుమ్మం ముందు పెడతారు. గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో, పలు రకాల పూలతో పూజిస్తారు. సంక్రాంతి పండుగ తో గొబ్బెమ్మలు పెట్టడు ముగిస్తారు. కనుమరోజు రథం ముగ్గుతో ‘నెలపట్టు’ విడుస్తారు. గొబ్బెమ్మలు భోగిపండుగ రోజు ఇండ్ల ముంగిట్లలో భోగి మంటలు వేసి – అమంటలలో పనికిరాని పాత వస్తువులను కాల్చివేస్తారు, ఆడవారు పసిపిల్లలను దీవించి తలపై భోగిపళ్ళు (రేగుపళ్ళు) పోస్తారు. రెండవరోజు సంక్రాంతి. ఈరోజు సూర్యోదయానికి ముందే నల్లనువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలింటిస్నానం నూలి. శివాలయమునకు వెళ్ళి శివునికి అమృతాభిషేకం తనకు తోచిన రీతిలో దానధర్మాలు చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. చేయించాలి. (ఆవునెయ్యితో) తరువాత మధ్యాహ్నమునకు ముందే ) మూడవరోజు కనుము.
ఇది వ్యవసాయం చేయు రైతులకు ఎక్కువ ప్రీతి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి, తన పాడి ఆవులను, పశువులను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. తరువాత పాలతో పాల పొంగలిని వండి తమ తమ కుల దైవాలకు ఆ పశువులశాలల్లోనే నైవేద్యం పెట్టి తరువాత తమ పొలాల సరిహద్దుల్లో చల్లివస్తారు. ‘దీనినే పొలివేయుట’ అంటారు.

మహాశివరాత్రి festival:
మాఘమాసంలో వచ్చే బహుళపక్ష చతుర్దశినాడు (అనగా అమావాస్యకు ముందు వచ్చే కృష్ణచతుర్దశినే శివరాత్రిగా జరుపవలెనని శాస్త్ర నిర్ణయమైనది. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజాకార్యక్రమాలు ఆచరించి, చతుర్దశి తిధినంతా నిరాహారుడై ఉపవాసం చేయాలి. తరువాత శివాలయమునకు వెళ్ళి స్వామివారిని మారేడు దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అభిషేకం చేయించాలి. శివుడు అభిషేక ప్రియుడు. శక్తి కలిగినవారు రుద్రాభిషేకం మహాన్యాస పూర్వకంగా గాని, లేక లఘున్యాస పూర్వకంగా కాని చేయవచ్చును. మహాశివరాత్రినాడు శివకళ్యాణము తిలకించి, లింగోద్భవకాలం వరకు జాగరణ చేసి, లింగోద్భవం జరిగిన తరువాత పూజ నిర్వహించి, తరువాత శివ పంచాక్షరీ మంత్రంతో గాని, లేక శివపురాణం వినుచూ జాగరణ చేసిన శివానుగ్రహం తప్పక కల్గునని ప్రతీతి.
హోలీ పండుగ – సాంప్రదాయాలు మరియు ప్రాముఖ్యత
హోలీ హిందూ మతంలో ముఖ్యమైన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగను ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఎంతో ఉత్సాహంగా జరుపుతారు. అయితే, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా ఈ పండుగకు మంచి గుర్తింపు లభించింది.

హోలీ పండుగ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, హోలికలకు సంబంధించిన పురాణ గాథతో ముడిపడిఉంది. హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుడిని చంపడానికి తన సహాయంగా హోలికను పంపాడు. అయితే, భగవంతుని కృపతో హోలిక అగ్నిలో కాలిపోయి ప్రహ్లాదుడు రక్షించబడాడు. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ హోలిక దహనం అనే సంప్రదాయాన్ని జరుపుకుంటారు.
హోలీ పండుగను రంగుల పండుగగా కూడా వ్యవహరిస్తారు. ఈరోజున ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లి ఆనందంగా వేడుకలు నిర్వహిస్తారు. చిన్న పిల్లలు నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారు కలిసి హోలీని జరుపుకోవడం ద్వారా స్నేహభావం, ప్రేమ మరింత పెరుగుతుంది.
హోలీ పండుగను జరుపుకోవడంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రంగులు వేసుకోవడం వల్ల శరీరానికి ఉత్తేజం లభిస్తుంది. ఉత్సవ వేళ ఆనందంగా గడిపే ఈ పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు సహాయపడుతుంది. హోలీ పండుగ అనేది మన సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప ఉత్సవం. అందుకే, ఈ పండుగను ఆనందంగా, సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం మనందరి కర్తవ్యం.
One thought on “Our Festivals: Essential and Best Traditions to Follow”