Srinagar – The City of Lakes, a Heavenly Dreamland of Scenic Beauty:5

Srinagar – The City of Lakes, a Heavenly Dreamland of Scenic Beauty:5

Srinagar – The City of Lakes, a Heavenly Dreamland of Scenic Beauty: శ్రీనగర్ – సరస్సుల నగరం, స్వప్నిల అందాల ఊహలో విహరించే స్వర్గం

Srinagar: కాశ్మీర్ లోయ గుండెస్థానంగా నిలిచిన శ్రీనగర్, దాల్ లేక్ వంటి చల్లని సరస్సులు, తేలియాడే హౌస్‌బోట్స్, షికారా రైడ్స్, రంగుల పూలతో కళకళలాడే ట్యూలిప్ గార్డెన్లు, మరియు చారిత్రిక మసీదులు, గార్డెన్లతో ఆకట్టుకునే నగరం. ఇది కేవలం టూరిస్టులకి గమ్యం మాత్రమే కాదు, కాశ్మీర్ సంస్కృతీ సౌందర్యానికి ప్రతిబింబంగా నిలిచే జీవంత చిత్రకళ.

ముఘల్ గార్డెన్లు వంటి చారిత్రిక తోటలలో పర్యటించటం, దాల్ లేక్‌పై షికారా రైడ్ చేయటం, స్థానిక బజార్లలో కాశ్మీరీ హస్తకళలను పరిశీలించడం – ఇవన్నీ శ్రీనగర్‌ను ప్రతి పర్యాటకుడి జాబితాలో టాప్‌ ప్లేస్‌గా నిలబెట్టాయి.

రాష్ట్ర రాజధాని శ్రీనగర్! బ్రిటిష్ రాజుల కాలంలో కాశ్మీర్ ఓ స్వతంత్ర రాజ్యంగా పరిఢవిల్లింది. స్వతంత్ర భారతదేశ ఆవిర్భావకాలంలోనే కాశ్మీర్ వివాదం ఉద్భవించింది. పాకిస్తాన్ దేశ ఆరాచక కుయుక్తుల ప్రతాపానికి ఎరగా మారిపోయింది. ఆ కారణంగానే 1965 లోనూ 1971 లోనూ భారతదేశం పై పాకిస్తాన్ దురాక్రమణని గావించింది. చైనా కూడా 1962 యుద్ధంలో కొంత కాశ్మీర్ భూభాగాన్ని కబళించి వేసింది. ఇప్పుడు కూడా కాశ్మీర్లోని కొంత భూభాగం పాకిస్తాన్ ఆక్రమిత ఆధీనంలో వుండిపోయింది.

సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు నడుంకట్టిన సంయుక్తరాష్ట్ర మహాసంస్ధ మనదేశపు స్వతంత్ర ప్రతిపత్తికి ఇతోధిక దోహదం చేసేంతవరకూ ఈ కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించదు. అందుకై మనం ఎంతో కృషి చేయాల్సివుంది.

పశ్చిమోత్తర హిమగిరి నగరాల్లో తలమానికంగా కొనియాడబడుతున్న శ్రీనగర్ పట్టణం కాశ్మీర్ నదీలోయ మధ్యభాగంలో నెలకొని ఉంది.  సింధూ మహానదికి ఉపనదియైన ‘జీలం’ నదీ తీరాల పైన విస్తరించిన ఈ నగరం ప్రపంచ ప్రఖ్యాతిని గాంచింది. నగరం నడిబొడ్డున ఉన్న ‘నానీ’, ‘డాల్’ అనే సరస్సులు ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలుగా భావించాలి. ఇక్కడి వాతావరణం కాలానుగుణంగా మారుతూ వుంటుంది. అయినా కూడా ఉష్ణోగ్రత మాత్రం ఎప్పుడూ వెనుకబడే వుంటుంది.

‘రాజతరంగిణి’ భౌతిక యితిహాస గ్రంథకర్త అయిన కాలహనుడు అశోకచక్రవర్తి కాలంలో ఈ నగరం ఆవిర్భవించినట్లుగా వ్రాశాడు. క్రీస్తు మూడవ శతాబ్దంలో  ప్రవరసేనుడనే రాజుచే ఈ నగరం నిర్మించబడింది. క్రీ.శ. 631లో హ్యూనా త్సాంగ్ ఈ నగరాన్ని దర్శించినట్లుగా చారిత్రిక ఆధారాలు వెల్లడిస్తున్నాయి.

క్రీ.శ. 1339 వరకూ లలితాద్యిత ముక్తావిద మహారాజు జనరంజకంగా ఈ రాజ్యాన్ని పాలించాడని శాసనాల వల్ల వెల్లడి అవుతోంది. అతనే చివరి హిందూరాజుగా చెప్పబడుతోంది. క్రీ.శ. 1420 నుంచి 1470 వరకు బాగా జైనులాబుధీన్ పాలన కొనసాగింది. ఈ రాజు తురుష్కుడయినా కూడా సంస్కృత భాషపై ఎనలేని అభిమానాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత ఈ రాజ్యాన్ని అక్బర్ చక్రవర్తి వశపరుచుకోవటం జరిగింది. అక్బర్ కాలంలోనే అనేక మసీదులకూ, అతి సుందరమైన ఉద్యానవనాలకు అంకురార్పణ గావించబడింది.

క్రీ.శ. 1819 లో ముస్లిం పాలన అంతమయ్యాక శ్రీనగర్ రాజ్యం సిక్కుల హస్తగతమయి కూచుంది. మహారాజా రంజిత్ సింగ్ తర్వాత 1846లో డోగ్రా రాజవంశీయులు బ్రిటీష్ దాస్యశృంఖలని తెంచుకోగలిగారు. 1947 వ సంవత్సరంలో జమ్మూ మరియు కాశ్మీర్ రాజ్యాలు భారతదేశంలో అంతర్భాగంగా విలీనమయిపోయాయి.

The Land of Lakes, Srinagar

శ్రీనగర్లోని జలమార్గాలు జగతిప్రసిద్ధిని చెందాయి. డాల్ లెక్ లోని ఓడల గృహాలు ఓ ప్రత్యేక తరహాకి చెందినవి. అలాంటివి మరెక్కడా కనిపించవు. శ్రీనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూటతోటలకు, పళ్ళ ఉత్పత్తికీ ప్రఖ్యాతి గాంచాయి.

ఇక్కడ మందమయిన జుత్తు గల గొర్రెల పెంపకం ఓ గృహ పరిశ్రమగా రూపుదిద్దుకుంది. ఆ కారంణంగా ఉద …… శాలువాల తయారీ ప్రజల ముఖ్యవృత్తిగా మారింది. యివి రెండూ కాకుండా కర్ర బొమ్మల తయారీ, చక్కని నగిషీలని చెక్కిన శిల్పాలని కూడా యిక్కడ తయారుచేస్తూ వుంటారు.

దాదాపు 105 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన శ్రీనగర్ పట్టణం సముద్రోపరితలానికి 1750 మీటర్ల ఎత్తులో వుంది. నగర జనాభా దాదాపు ఏడు లక్షల వరకు వుంటుంది.

ఇక్కడి జనం మాతృభాష ‘కాశ్మీరీ’ తో బాటుగా ఉర్దూ ప్రాబల్యం కూడా అధికంగానే వుంది. ఢిల్లీ నుండి శ్రీనగర్‌కి సరాసరి విమాన సౌకర్యం వుంది. లేదా రైల్లో జమ్మూదాకా ప్రయాణించి అక్కణ్ణుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది.

శ్రీనగర్ నుంచి చండీఘర్కి సరాసరి బస్సులు నడుస్తాయి. నగరం నడిబొడ్డున వున్న డాల్ సరస్సు ఓ మూడు చెరువుల సమాగమం కాని వాటి ఎల్లల్ని గుర్తించటం మాత్రం అతికష్టం!

డాల్ లెక్ లోనూ, నాగినీ సరస్సులోనూ, జీలం నదిలోనూ పడవలు గృహాలు మనకు కనిపిస్తాయి. సరస్సు తీరాన్నంటి పెట్టుకుని హిమాలయ పర్వత పంక్తులు కనిపిస్తాయి. దాపులోని కొండలన్నీ కూడా రోడ్డు మార్గాలతో కలపబడి వున్నాయి. అలాగే నదీజలాల్లోని ‘శికరాలు’ ప్రయాణ రేవులకూ, దాల్ సరస్సులోని పడవల యిళ్ళకూ చేరుకునేందుకు ఉపయోగించబడుతున్నాయి. ‘శికారా’ అంటే ఓ పొడవాటి సన్నని రూపంలో వుండే పడవ!

Dal Lake Srinagar

డాల్ లెక్ లోని పడవగృహాలు కొన్ని చోట్ల నదీ అంతర్భాగం ఆధారంగా నిర్మించబడినవిగా కదలకుండా వుండగా కొన్ని ప్రయాణానికి అనుకూలంగా తేలుతూ కనిపిస్తాయి. ఈ పడవల యిళ్ళన్నీ డాలేక్ దక్షిణ దిశలో కేంద్రీకరించబడి ఉంటాయి.

జీలం నది నగరం చుట్టూ వేళ్ళాడుతున్న మణిహారంలో కనిపిస్తుంది. జీలం నదిలోకి కలిసే ఓ కాలువని కలిపి చూస్తే ఈ భాగంలోని నేలంతా కూడా ఓ ద్వీపంలా కనిపిస్తుంది. డాల్ లేక్ ని పడవల గృహాలు చక్కని వసతి సౌకర్యాన్ని కలిపిస్తాయి. 

సరస్సు ఒడ్డులోనూ నదీ తీరంలోనూ వున్న అనేక హోటళ్ళు దేశవిదేశీ యాత్రికుల అవసరాల్ని తీరుస్తూ వుంటాయి. సంవత్సరంలో ఏ సమయంలోనైనా శ్రీనగరిని సందర్శించవచ్చు. చలికాలంలో మాత్రం తగు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది.

షాలిమార్ గార్డెన్స్ : రోడ్డు పక్కన పట్టణంలో షాలిమార్ గేటు ఉంది. ఇది కాలువ చివర దాల్ లేక్ దగ్గర ఈ గేటు వుంది. దీనికి ప్రవేశ రుసుము 10 రూ. 1619లో దీనిని నిర్మించారు. జహంగీర్ దీనిని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాడు.

ఈ నాలుగు పెంకుటిల్లు తోట ఎంతో అందంగా వుంటుంది. వేసవి విడిది నల్లటి మార్బల్ రాళ్ళు పంపోర్ నుంచి తెచ్చారు. ఇది ఏ యాత్రకైనా ప్రేమకు నిలయం. ప్రజాస్వామ్యానికి ఎన్ని గాయాలు తగిలినా షాలీమార్ రాజరికపు హోదాలో వుంది. జహంగీర్ నూర్ జహాన్ వారు ఇక్కడ ఇక్కడ నుండి యుద్ధం చేశారు. రాజసింహాసనాన్ని మొట్టమొదట ఇక్కడే వుంచారు. 

nishant Bagh srinagar

నిషాంత్ బాగ్ : ఇది లేక్ షోర్కు 4 కి.మీ. దూరంలో జహంగీర్ గార్డెనక్కు దారి చూపుతూ ఎంతో సుందరమైన, ఆహ్లాద వాతావరణాన్ని దాలే లేక్ మీదుగా కొండల పైకి చూపిస్తున్నది. ఆ కొండల పై నుండి ఇళ్ళ నుండి సరస్సు మీద వెలుగుపడుతోంది. ఈ కింది భాగం అంతా రోడ్లు డాబాలతోను నిండి వున్నది. ఇది 1632లో జహంగీర్ బావగారు అసన్ దీనిని నిర్మించాడు. నిజంగా చెప్పాలంటే ఇది పూర్తిగా రాజ ఉద్యానవనం కాదు.

షాజహాన్ 1633లో నిషాత్న దర్శించాడు. ఈ ఉద్యానవనం రాజుల ఆధీనంలో వుండాలని నిర్ణయిం చాడు. అసఖాన్ దీనిని ఐచ్ఛికంగా ఒప్పుకోలేదు. కాని దీనికి ఆయన తగిన మూల్యం చెల్లించాడు. అతని భవంతికి వచ్చే నీటిని అపేశారు. తరువాత చక్రవర్తి పశ్చాత్తాపపడ్డాడు.

చష్మ సాహిగార్డెన్స్ : రాజు తన గుర్తుగా ఒక దానిని వదిలి వెళదామన్న నిర్ణయంతో ఇక్కడ జబేర్వాన్ కొండ వాలులలో షాజహాన్ ఎంతో ఖర్చుపెట్టి ఉద్యానవనాన్ని నిర్మించాడు. ఆయన ఆదేశాల ప్రకారం మొగల్ గవర్నర్ ఆలీవర్దన్ ఖాన్ ఒక చష్మ సాహిగార్డెన్స్ 1632లో నిర్మించాడు.

ఇటీవల అల్స్ హాక్సి శ్రీనగర్‌కు దగ్గరలో ఎంతో వాసునైపుణ్యంతో తోటను నిర్మించాడు. అసన్ ఈ ఉద్యానవనాన్ని కొండపై సరస్సుకు దగ్గరలో నిర్మించాడు. దీనికి సరస్సు నుండి నీటిసరఫరా ఏర్పాటు కూడా చేశారు. చస్మాసాహిను దర్శించాలంటే మీరు టూరిస్ట్ డిపార్ట్మెంటువారి అనుమతి తీసుకోవాలి. ఇది అతి భద్రత కలిగిన రక్షిత ప్రాంతం. 

పారిమహల్: ఇక్కడ నుంచి కొంత దూరం పోతే జబ్బర్వాన్ కొండ మీద ఆరు భాగాల పారిమహల్ వుంది. ఇది ప్రిన్స్ దారాషికో నిర్మించాడు. ఆయన తన ఉపాధ్యాయుడు ఆకుండ ముల్లా మహమ్మద్ బాదశేని కోరిక మీద దీనిని నిర్మించారు. ఇది సఫీ విద్వాంసులకు మంచి పరిశోధనా కేంద్రం.

శంకరాచార్యుని కొండ దక్షిణ సరస్సుకు 1000 అడుగుల ఎత్తున వుంది. జ్యేష్ఠశ్వర గుడి మహారాజు గోపాదిత్యుడు నిర్మించాడు. లలితాదిత్యుడు దీనిని అభివృద్ధి చేశాడు. హరిపర్బత్, ఇది అదే పేరుతో 16వ శతాబ్దిలో నిర్మించిన కోట ఇక్కడే వున్న మరొక పవిత్ర పుణ్యక్షేత్రం మర్రిుం సాహెబ్; ఇది నిర్లక్ష్యం చేయబడిన నిర్మాణము. మజీద్ అఖండ్ మల్లాద్వారా తన గురువుగారి స్మారక చిహ్నంగా నిర్మించిన విహారం. ఇది 1648లో నిర్మించారు. 

సంగీత్ దర్వాజా, కాకీ దర్వాజా అనేవి అక్బరు నిర్మించిన రెండు ప్రసిద్ధి చెందిన ద్వారాలు. నగరానికి తిరిగి వచ్చిన తరువాత శ్రీనగర్ లోని ప్రధానమైన విహార కేంద్రాలు పర్యటించాను. ఎంతో అందమైన దసగిరి సాహిబ్ (కన్యార్) రోజబాలైన్ దర్శించాను. ఇక్కడే జీసస్ సమాధిని కూడా చూశాము. వాయువ్యాన ఖన్క్వాఆఫ్ ఖాజా మొయినుద్దీన్ నక్షా బందీ దర్శించాను. ఇది చాలా అందమైన వాస్తు నిర్మాణం. 

ఇది పవిత్రమత ప్రవక్త మోయిముకద్దాస్ 1699లో మొదట నివాసం వున్న స్థలము. తరువాత ఎంతో విశాలమైన హజరత్బల్కు ఈ ముస్లిం ప్రవక్త అవశేషం మార్చబడింది. జామమసీద్ శ్రీనగర్లోని ప్రధానమైన మసీదు. మొఘలాయి చక్రవర్తులు అంతకు ముందు రాజులు దీనిని దర్శించారు. ఇది మొదలు 1402లో బుక్షీఖాన్ నిర్మించాడు. తరువాత ఆయన కుమారుడు జైనుల్ అబెదిన్ దానిని ఎంతో అభివృద్ధి చేశారు. 

కాని 1479లో అది దగ్ధమైంది. హసనా, మహమద్ ఫతేషా అనే ముగ్గురు వరుస రాజుల హయాంలో మళ్ళీ దగ్ధం అయింది. 1674లో జహంగీర్ షాజహాన్ నిర్మించారు. కాని 1674లో ఇది మళ్ళీ తగలబడింది. ఔరంగజేబు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశోధించి దానిని నిర్మించి 3 సంవత్సరాల పాటు ప్రభుత్వమే నడిపే ఏర్పాటు చేశాడు.

జామి మసీదుకు కొంచెం దూరంలో జీలం నదికి ” కుడి పక్కన కాంక, కాహంబాన్” ఒక కవి మీర్ సయ్యద్ ఆలీ హందానీ ఒక ముస్లిం ముని తైయూర్ పరిపాలనా కాలంలో ఇక్కడకు వచ్చారు.  ఆయన ఈ ప్రాంతాన్ని 3 సార్లు పర్యటించి 37000 మందిని తమ మతంలోకి మార్చాడు. ఆయన మొదటిసారిగా కాశ్మీర్ నగరానికి 1372లో వచ్చారు. 

అక్కడ ఒక గుడి ఉండేది. తరువాత ఆ గుడికి రెండుసార్లు అగ్ని ప్రమాదం జరిగింది. అది 1479 మరియు 1731 లోను, దానిని 1732 లో పునఃనిర్మించిన తరువాత ఇంత వరకు నిలబడింది. దానిలోని దారు శిల్పాల పని ఎంతో సౌందర్యాన్ని ప్రతిబింబిస్తున్నది.

 శ్రీనగర్లోని అనేక నిర్మాణాలు, జామ మసీదుతో సహా వాటి కప్పులు సహజసిద్ధంగా లేవు. మరో విచారకర విషయం ఏమంటే ఇక్కడ అందమైన బోర్డు కూడా లేదు. ప్రస్తుతం స్త్రీలు ముస్లింలు కాని వారు ఈ లోపలకు ప్రవేశించరాదు. కంకాకు ఎదురుకుండా షా హందాని ఉంది. ఇది జీలం నదికి ఎడమ పక్కన ఉంది.

మొఘలాయి రాణి నూర్ జహాన్ దీనిని నిర్మించింది. దీని ఖరీదు ఆవిడ ధరించిన చెప్పుల ఖరీదు అంత కూడా లేవని అనుకున్నారని ప్రతీతి. ఈ మసీదులో ఏ విధమైన హోదాలు లేవు. దీనిలో ఒక అందమైన ఉద్యానవనం ఉంది. జైనకాదల్ బ్రిడ్జి దాటిన తరువాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళితే శ్రీనగర్‌కు మకుటాయ మాయమైన జైన్ – ఫుల్ అబిదిన్ తల్లి 15వ శతాబ్దం సమాధి కనిపిస్తుంది. 

ఇక్కడ ఒక పెద్ద వ్యాపార కేంద్రం ఉంది. ఇది బిజెంటైన్, టెర్రాకోట గుడుల వాస్తు నిర్మాణాన్ని గుర్తుకు తెస్తుంది. దీని ప్రాధమికంగా ఇది పర్షియన్ వాస్తు నిర్మాణాన్ని పోలి ఉంది. ఈ సమాధిఉత్తర భాగాన ఎన్నో ప్రసిద్ధి చెందిన వారి చిత్రాలు వున్నాయి. అందులో బాబర్ యొక్క కజిన్, మిర్జా హైదర్ బొమ్మ కూడా ఉంది. ఈయన కాశ్మీరును 1542-2551 వరకు హుమయూన్ అన్న పేరుతో పాలించాడు. ఇంత సుందరమైన సమాధి ఎందువల్లనో ప్రభుత్వంవారు నిర్లక్ష్యం చేస్తున్నారు.

డాల్ లేక్ – కాశ్మీర్ మణిహారంలో మెరిసే ముత్యం:

డాల్ లేక్, శ్రీనగర్‌కి హృదయం వంటిది. ఈ సరస్సు కేవలం నీటి విస్తీర్ణం మాత్రమే కాదు – ఇది కాశ్మీర్‌కి సౌందర్యంగా, సంస్కృతిగా ప్రాణం పోసే ప్రదేశం. మంచు పర్వతాల నీడల మధ్య తేలియాడే హౌస్‌బోట్స్, రంగురంగుల షికారాలు (వెన్నెల నౌకలు), నీటిపై తేలే పూల బజార్లు – ఇవన్నీ కలసి ఈ సరస్సును ఒక కలల ప్రపంచంలా మారుస్తాయి.

డాల్ లేక్ ఉదయం ఆరుణోదయంలోనూ, సాయంత్రపు చిమ్మ చీకటిలోనూ వేరే వేరే స్వరూపాలతో కనిపిస్తుంది. ఇది కేవలం పర్యాటకులకు మాత్రమే కాదు, స్థానిక ప్రజల జీవనశైలికి కూడా కీలక భాగం. వేసవిలో తేలికైన చల్లదనంతో, శీతాకాలంలో కొంత మంచుతో కప్పబడి ఉండే డాల్ లేక్, సంవత్సరంలో ఏ సమయానైనా కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

Dal Lake the city of lakes Srinagar

భూలోకంలోని స్వర్గధామం అనబడే కాశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ అందచందాలను ఏ కవులూ సంపూర్ణంగా వర్ణించలేకపోయారు. ఏ ప్రతిభావంతుడైన రచయిత కూడా యింత వరకు కాశ్మీర్ సౌందర్యాన్ని కాగితం పై పూర్తిగా వ్రాయలేక పోయాడు.

శ్రీనగర్ సిటీ అంతా కూడా హిమాలయాల్లో వెలసిన వెనిస్ నగరంలా ఉంటుంది. విశాలమైన డాల్ సరస్సునంటి పెట్టుకునివున్న ఈ నగరం దాదాపు 100 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. నగరం నిందా కాలువలూ, వంతెనలూ కనిపిస్తాయి. దాల్ సరస్సులోని పడవల యిళ్ళు శ్రీనగరికే అలంకారాన్ని కలిగిస్తున్నాయి. కాలువలన్నీ కూడా జీలం నదిలో కలుస్తాయి. జీలం నది శ్రీనగర్ పట్టణానికి ఓ వైపునుంచి వున్న హిమాలయాలకి అందాల కంఠాభరణంలా కనిపిస్తుంది.

డాల్ లేక్ మూడు భాగాలుగా విభజించటం జరిగింది. ఈ మూడు ముక్కల్ని లోకుటాల్, బోడాల్, నాగిని లేక్ అని పిలుస్తారు. విశాలమైన డాలోక్లో అనేక ద్వీపాలున్నాయి. అలా అక్కడక్కడా తేలివున్న నేలని ‘ఫ్లోటింగ్ గార్డెన్స్’ అని కూడా పిలవటం జరుగుతోంది.

డాల్ లేక్   ఉత్తర దిశలో వున్న ఓ పెద్ద లంకని సిల్వర్ పోలాండ్ లేక ‘సోనాలాంక్’ అనీ, దక్షిణాన వున్న మరో పెద్ద లంకని గోల్డ్ పోలాండ్ లేదా ‘రూపాలాంక్’ అని పిలుస్తారు. యివి రెండు కాకుండా తూర్పువైపు నెహ్రూలాంక్, కొఠార్ కానాలాంక్లు వున్నాయి. భూపాలాంక్ని చార్ చినార్ అని కూడా పిలుస్తారు. కొఠార్ ఖానాలో పావురాలు అధికంగా కనిపిస్తాయి. యిక్కడ వెనకటి రాజవంశీయులు బసచేసేవారట.

గోల్డ్ మరియు సిల్వర్ పోలండ్లు మంచి పిక్నిక్ విహార కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి. సరస్సుని మధ్యలో విభజించినట్లుగా వున్న కట్టదారి గుండా గుఱ్ఱాలపై స్వారీ చేసే వీలుంది. ఈ మార్గమే డాల్ సరస్సుని ముఖ్యమైన రెండు భాగాలుగా విడదీస్తుంది. నాగినీ లేక్ కంఠాభరణంలో వేళ్ళాడుతున్న ఓ మణిలా కనిపిస్తుంది. ఈ సరస్సు చుట్టూ అనేక ఎత్తైన చెట్ల గుంపులు కనిపిస్తాయి. నాగినీలేక్లోని నీరు చాలా తేటగా వుంటుంది.

డాల్ లేక్ లోని  పడవల గృహ సముదాయం అధికంగా శ్రీనగర్ పట్టణ దక్షిణ దిశలో కనిపిస్తుంది. ఈ బోట్ హౌస్లు యిటు నాగినీ సరస్సులోనూ అటు జీలంనదిలో కూడా నుంచుని వుంటాయి. చాలావరకు ఈ పడవల యిళ్ళన్నీ కూడా సరస్సు అడుగున నేలలో బలంగా వున్న ఆధారాలతో నిలుస్తాయి. కొన్ని యిళ్ళు మాత్రం తేలిపోతూ ఉంటాయి. ఈ పడవల యిళ్ళన్నిటికీ కూడా ‘ఘాట్’ రోడ్డు నుంచి చేరుకునే వీలుంది. 

Dal lake floating boats

డాల్ లేక్ కి ఉత్తరంలో శ్రీధర్, దక్షిణంలో శంకరాచార్య, పశ్చిమంలో హరిపర్వతాలు ఉన్నాయి.సరస్సు వైశాల్యం పద్దెనిమిది చదరపు మైళ్ళుంటుంది, ఓ అంచనా! ఈ సరస్సు అంచునే మొఘలు చక్రవర్తులు అనేక ఉద్యానవనాల్ని ఏర్పాటు చేశారు. వాటిని “మొఘల్ గార్డెన్స్” అని వ్యవహరించటం జరుగుతోంది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ ప్రతీ ఏడాది వేసవిలో ఈ డాల్టిక్ ఓ పడవ గృహంలో నివసించేవాడట.

డాల్ సరస్సు చుట్టూ వున్న కొండల సానువుల వెంట ఘాట్ రోడ్డులో గుర్రపు స్వారీ చేస్తూంటే శ్రీనగర్ పట్టణ దృశ్యం, డాల్టిక్ పరిసరాల్లోని హిమాలయాలు అన్నీ కలిసి స్వర్గాన్నే మరపింపజేస్తాయి.

డాల్ సరస్సు లోని నీరు కూడా స్వచ్ఛంగానే కనిపిస్తుంది. కాని పడవల యిళ్ళల్లోని కలుషితం అంతా కూడా సరస్సులోనే కలుస్తూ వుందన్న విషయం మనం మరచిపోకూడదు. పడవల గృహాలు అన్ని సౌకర్యాల్నీ కలిగి ఉంటాయి. ఫైవ్ స్టార్ సౌకర్యాలతో మొదలుకుని అన్ని హంగుల్ని సంతరించుకుని ఉంటాయి.

ఈ పడవలను డీలక్స్ A, B, C, D అన్న కేటగిరీలలో నిర్మించటం జరిగింది. తదనుగుణంగా యాత్రీకులు తమ బసకు వెల చెల్లించవలసి ఉంటుంది. కాశ్మీర్ దర్శించిన ప్రతి యాత్రికుడూ కనీసం ఒక రోజన్నా బోటు హౌస్లో గడపకపోతే అది యాత్ర అనిపించుకోదు. పెద్ద పడవల యిళ్ళలోనే అనేక దుకాణాలుంటాయి. ఆ దుకాణాలన్నీ శిఖరాలలో వెళ్ళి దర్శిస్తేనే కనిపిస్తాయి. పట్టణాల్లో ఆటోరిక్షాల్లా డాలేక్లో చిన్న చిన్న పడవలు చేపల్లా కదిలిపోతూ ఉంటాయి.

ఢిల్లీ నుంచి విమానంలా నేరుగా శ్రీనగరిని చేరుకోగలం, లేదా ఢిల్లీ నుంచి జమ్మూ అక్కడ నుంచి బస్సులో రావాల్సి ఉంటుంది. శీతాకాలంలో మాత్రం తగు జాగ్రత్తలు వహించాల్సి వుంటుంది. డాలెక్‌లోని పడవల యిళ్ళని చూసి సంతృప్తి చెందాకే అందులోకి చేరాలి. చూడకుండా బ్రోకర్ల మాటల్ని విశ్వసించి నేరుగా వెడితే యిబ్బందులుంటాయి. కావున గమనించగలరు.

మొఘల్ గార్డెన్స్ – శిల్పసౌందర్యానికి, స్వచ్ఛతకు ప్రతీకలు:

శ్రీనగర్ నగరానికి ఓ ప్రత్యేకమైన అందాన్ని, చారిత్రిక వైభవాన్ని చేకూర్చేవి మొఘల్ గార్డెన్స్. ముఘల్ చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన ఈ తోటలు, ఇస్లామిక్ మరియు పర్షియన్ తోటల శైలిలో నిర్మితమయ్యాయి. నీటి ప్రవాహం, బాగ్‌ల నిర్మాణ శైలి, పూల తోటలు, ప్రాకృతిక నదులు – ఇవన్నీ కలసి ప్రశాంతతను ప్రసాదించే వాతావరణాన్ని సృష్టిస్తాయి.

ఈ గార్డెన్స్‌లో ముఖ్యమైనవి:

  • శాలిమార్ బాగ్ – జహంగీర్ నిర్మించిన తోట, ప్రేమకు ప్రతీక.
  • నిషాత్ బాగ్ – “సంతోషానికి తోట”గా ప్రసిద్ధి.
  • చష్మా షాహి – పర్వతాల మధ్య నిర్మితమైన చిన్న కానీ అద్భుతమైన తోట.

వసంతకాలంలో పూలతో కళకళలాడే ఈ తోటలు, టూరిస్టులకు ఫొటోగ్రఫీకి, విశ్రాంతికి, మరియు చారిత్రక అనుభూతికి ఆదర్శంగా నిలుస్తాయి. మొఘల్ గార్డెన్స్ అనేవి కేవలం తోటలు కాదు – అవి కాలాన్ని తలపించే కళా విభవాల పరంపర.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఆవిర్భావ చరిత్ర అంతా కూడా అలనాటి మొఘల్ చక్రవర్తుల రాచరికంతో ముడివడి వుంది. మొఘలులు సాంస్కృతిక ప్రియులు, ప్రకృతి ఆరాధ్యులు. వారి కాలంలోనే శ్రీనగర్ రాష్ట్ర రాజధానిగా సంపూర్ణ రూపం ధరించింది. దాల్ సరస్సు అభివృద్ధిని వారే చేపట్టినట్లుగా చారిత్రిక ఆధారాలున్నాయి. ఆ సరస్సు అంచులంచుల వెంటే అనేక ఉద్యానవనాలకు వారు నాంది పలికారు.

జహంగీరు చక్రవర్తి పాలనాకాలంలో ఈ ప్రాంతాభివృద్ధికి ఎంతో దోహదం లభించింది. ఆనాటి మొఘల్ ఉద్యానవనాలు చస్మాషాహీ, నిషాత్ఫాగ్, షాలిమార్ భాగ్, నసీం భాగు ఎంతో వృద్ధి కాగా నెహ్రూ మెమోరియల్ పార్క్ ఈ మధ్యకాలంలో ఏర్పాటు గావించబడింది.

1632వ సంవత్సరంలో శ్రీనగర్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో చస్మాషాహీ ఉద్యానవనం నిర్మించబడింది. కొండల పాదాల నుంచి డాల్ సరస్సు వరకు విస్తరించిన ఈ ఉద్యానవనం అందచందాల గురించి వర్ణించటం అంత సులువుకాదు. ఉద్యానవనానికి ఎగువన పారీమహల్ అనే ఓ చారిత్రక కట్టడం ఉంది. దాన్ని సూఫీ అధ్యయనశాల అంటారు.

1633వ సంవత్సరంలో జహంగీర్ ప్రియురాలయిన నూర్జహాన్ సోదరుడు అసన్ నిషాత్ గార్డెన్స్‌క రూపకల్పన చేశాడు. ఈ ఉద్యాన నిర్మాణానికి అతను వీరపంజల పర్వత పాదభూమిని ఎన్నుకున్నాడు. ఆ కొండ నుంచి డాల్ సరస్సు మధ్య ప్రాంతంలో ఈ గార్డెన్ ఏర్పాటు చేయబడింది. శ్రీనగర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఉద్యానవనం మధ్యలో నుంచి చూస్తే డాల్ సరస్సు సంపూర్ణంగా కనిపిస్తుంది.

మరీ ప్రాచీనమైన వసీంభాగ్ 1586వ సంవత్సరంలో అక్బర్ చక్రవర్తిచే నిర్మించబడింది. యిప్పుడీ ఉద్యానవనం నిర్వహణ కుంటబడింది. అనేక విశ్వవిద్యాలయ కళాశాలలకిది అనువుగా మారింది. ఈ తోటని దర్శించటానికి అధికారులు అనుమతిని పొందాలి.

నసీంభాగ్ ప్రక్కనే ఈ మధ్యనే ఉగ్రవాదులాక్రమించుకున్న హజ్రత్బల్ మసీదు వుంది. ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త పవిత్ర కేశాన్ని భద్రపరిచారట. ఈ మసీదు ఓ అద్భుత సుందర కట్టడం ! డాల్ లేక్ నుంచి చూస్తే దృశ్యం అద్భుతంగా వుంటుంది.

1616వ సంవత్సరంలో శ్రీనగర్‌కు పదిహేను కిలోమీటర్ల దూరంలో షాలిమార్ ఉద్యానవనాన్ని జహంగీర్ చక్రవర్తి తన స్వయంపర్యవేక్షణలో నిర్మించాడు. తన ప్రేయసి నూర్జహాన్ కోసం అతని బాధ్యతని స్వీకరించినట్లుగా చెప్పబడుతోంది. ‘నూర్జహాన్‘ అంటే ప్రపంచానికే ‘కాంతి’ అని అర్థం. ఆ అర్థం వచ్చేలా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఉద్యానవనం !

డాల్లోక్లో నుంచి శికారా (పడవ) ద్వారా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. అంచెలంచెలుగా కనిపించే ఈ ఉద్యానవనంలో రాత్రిపూట ‘సౌండ్ లైట్’ ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తారు. మే మాసం నుంచి అక్టోబర్ దాకా గార్డెన్ యాత్రికులతో కిటకిటలాడుతూ వుంటుంది.

స్థానిక హరిపర్వతం పై ఓ ప్రాచీన దుర్గం వుంది. దీన్ని షారికాపాల్ అని కూడా పిలుస్తారు. డాలేక్కు పశ్చిమదిశలో వున్న ఈ కోట 1592 లో అక్బర్ చక్రవర్తిచే నిర్మించబడింది. ఈ దుర్గాన్ని దర్శించేందుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సి వుంటుంది.

చస్మాషాహీ నెహ్రూ పార్క్, నిషాత్ గార్డెన్స్, షాలిమార్ గార్డెన్స్లో కలిపే మార్గాన్ని ‘హర్వాన్ రోడ్డు‘ అంటారు. ఈ ‘హర్వాన్’ లో ప్రాచీన బౌద్ధమత కట్టడాల అవశేషాల్ని కనుగొన్నారు. మూడవ శతాబ్దకాలం నాటికి చెందిన కళాఖండాలను శ్రీనగర్ మ్యూజియంలో భద్రపరిచారు.

హర్వాన్కి వెళ్ళే దారిలోనే శంకరాచార్య పర్వతాన్ని దర్శించవచ్చు. ఈ పర్వతాన్ని ‘తక్తే సులేమాన్‘ అని కూడా అంటారు. యిక్కడే క్రిస్టియన్ మత చక్రవర్తి అయిన ‘కింగ్ సాలెమెన్‘ సింహాసనం వుండేదట ! ఆ పరంగా ఇప్పుడు ఆధారాలేమీ కనిపించవు. అశోకచక్రవర్తి కుమారుడుచే ఇక్కడి హిందూ దేవాలయ నిర్మాణం గావించబడింది. జహంగీర్ చక్రవర్తి కాలంలో అది పునరుద్ధరించబడింది.  ఈ కొండపై నుంచి డాల్ సరస్సు సంపూర్ణంగా సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. అది శంకరాచార్యులచే నిర్మించబడిన శంకరమందిరం అనేకమంది భక్తుల్ని ఆకర్షిస్తూ వుంటుంది.

శ్రీనగర్లోని ఈ ఉద్యానవనాలన్నిటినీ చూడటం వల్ల యాత్రికుల మనస్సులు పరవశం అయిపోతాయి. ఢిల్లీ నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాల వల్ల మనం ఇక్కడికి చేరుకోగలం. చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డాల్లోక్లో నుంచి శికారా (పడవ) ద్వారా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. అంచెలంచెలుగా కనిపించే ఈ ఉద్యానవనంలో రాత్రిపూట ‘సౌండ్ లైట్’ ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తారు. మే మాసం నుంచి అక్టోబర్ దాకా గార్డెన్ యాత్రికులతో కిటకిటలాడుతూ వుంటుంది.

స్థానిక హరిపర్వతం పై ఓ ప్రాచీన దుర్గం వుంది. దీన్ని షారికాపాల్ అని కూడా పిలుస్తారు. డాలేక్కు పశ్చిమదిశలో వున్న ఈ కోట 1592 లో అక్బర్ చక్రవర్తిచే నిర్మించబడింది. ఈ దుర్గాన్ని దర్శించేందుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. చస్మాషాహీ నెహ్రూ పార్క్, నిషాత్ గార్డెన్స్, షాలిమార్ గార్డెన్స్లో కలిపే మార్గాన్ని ‘హర్వాన్ రోడ్డు‘ అంటారు. ఈ ‘హర్వాన్’ లో ప్రాచీన బౌద్ధమత కట్టడాల అవశేషాల్ని కనుగొన్నారు. మూడవ శతాబ్దకాలం నాటికి చెందిన కళాఖండాలను శ్రీనగర్ మ్యూజియంలో భద్రపరిచారు.

హర్వాన్కి వెళ్ళే దారిలోనే శంకరాచార్య పర్వతాన్ని దర్శించవచ్చు. ఈ పర్వతాన్ని ‘తక్తే సులేమాన్‘ అని కూడా అంటారు. యిక్కడే క్రిస్టియన్ మత చక్రవర్తి అయిన ‘కింగ్ సాలెమెన్‘ సింహాసనం వుండేదట ! ఆ పరంగా ఇప్పుడు ఆధారాలేమీ కనిపించవు. అశోకచక్రవర్తి కుమారుడుచే ఇక్కడి హిందూ దేవాలయ నిర్మాణం గావించబడింది. జహంగీర్ చక్రవర్తి కాలంలో అది పునరుద్ధరించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *