Vidura Part-8: Unveiling Paths of Truth and Justice

Vidura Part-8: Unveiling Paths of Truth and Justice

Vidura Part-8: Unveiling Paths of Truth and Justice

Vidura Part-8: Unveiling Paths of Truth and Justice సానతేలిందే జాతిరత్నం: తృణోల్కయాజ్జాయతే జాతరూపం వృత్తేనభద్రో వ్యవహారేణ సాధుః, శూరోభయేష్వర్ధ కృత్ప్రేషుధీరః కృత్ప్రేష్వాపత్సు సుహృదశ్చర యశ్చ! (రూపము కలిగిన వస్తువు చీకటిలో ఉన్నను గడ్డిమంటలో దానిని గుర్తించవచ్చు. ఒకవ్యక్తి ధర్మపరుడా కాదా అనేది అతని నడవడితో తెలుసుకోవచ్చు. తనలోని మంచితనము ఆతడు సలిపే వ్యవహారము చేత తెలుస్తుంది.

 శూరుని శూరత్వం భయానక వాతావరణంలో తెలుసుకోవచ్చు. కష్టసమయంలో ఒకవ్యక్తి ధీరత్వం తెలుస్తుంది. బాగా ఆపదలలో చిక్కిన సమయంలో మనకు మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలుస్తుంది అంటాడు Vidura.

మనసులో ఉన్నతమైన సదాశయము రూపము దిద్దుకున్నది. దానిని సాధించాలనే తపన ఉన్నది. ఆ తపనకు తగిన అవకాశాలు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి కాని వాటిని చుట్టుముట్టి అవరోధాలు ఉన్నాయి. వాటిని తెలుసుకునే క్రమంలో మనసులో అలముకొన్న చీకట్లు ఆ ఆశయ సాధనలో మనకున్న అవకాశాలను గుర్తించేందుకు అవరోధమై నిలుస్తున్నాయి. ఇప్పుడు ఒక గురువు లేదా మెంటార్ లేదా శ్రేయోభిలాషి గడ్డి మంట అనే చిన్న దీపాన్ని ఉపదేశ రూపంలో వెలిగించాడు. మనం మన మార్గాన్ని, అవకాశాలను అర్హతలను గుర్తించాము… ముందుకుసాగాము… విజయాన్ని సాధించాము.

ఒక వ్యక్తి ఉన్నత పదవిలో నియమితుడయ్యాడు. అప్పటి వరకు అతనికి అవకాశాలు రాలేదు కాబట్టి ధార్మికుడుగానే నడుచుకున్నాడు. ఇప్పుడు అతని పదవి అతని నడవడికకు పరీక్ష పెట్టింది. అధికారం… ధర్మమార్గాన్ని విడిచిపెడితే అర్థకామాలను అపారంగా సాధించే అవకాశాలు అందివచ్చాయి. తనకు ఆలంబనయై పదుగురికి ఉపయుక్తమయ్యే పదవిని దుర్వినియోగం చేస్తాడా లేదా ఆ పదవిని ఉపయోగించి పదుగురికి శ్రేయస్సునందిస్తాడా అనేది అతని నడవడిక నిర్ణయిస్తుంది. స్వార్థపరతనాశ్రయిస్తే అతడు అధార్మికుడౌతాడు… న్యాయబద్ధమైన అధికారాన్ని ఉపయోగించి ప్రజాసేవలో ధార్మికుడౌతాడా అనేదే అతని నడవడికకు గీటురాయి అవుతుంది. ఆయా వ్యక్తిలో సాధారణంగా రెండు వ్యక్తిత్వాలు అవ్యక్తంగా ఉంటాయి. 

సందర్భాలననుసరించి ఒక్కొక్కటి వ్యక్తమౌతుంది. ఆశ్రిత పక్షపాతము, స్వార్థపరత వల్ల పతనమౌతాడు.. చట్టబద్ధ వ్యవహారము, న్యాయబద్ధ వ్యవహారము రెండూ సమంగా కనిపించినా రెంటిలో వెంట్రుకవాసి భేదము ఉంటుంది. ఇందులో దేనినాశ్రయిస్తాడు. అనేది అతని వ్యవహారసరళిని నిర్ణయిస్తుంది. సాధారణ పరిస్థితులలో అందరూ శూరులే… కాని పరిస్థితులు ప్రతికూలంగా భయానక వాతావరణంలో చిక్కుకున్న సమయంలో ఎలా ప్రవర్తిస్తామన్నదే ముఖ్యం. చుట్టూ సమస్యలు ఎదురై భయపెట్టిన వేళ శౌర్యం చూపి వాటినెదిర్చి లక్ష్యాన్ని చేరుతా పారిపోతాడా అనేదే వ్యక్తి శూరత్వాన్ని నిర్ణయిస్తుంది.

సమస్యలు చుట్టుముట్టిన సమయంలో తీసుకునే నిర్ణయాలు వ్యక్తిలోని ధీరత్వాన్ని నిర్ణయిస్తాయి. కష్టసమయంలో లేదా అపజయాలు ఎదురైన సమయంలో “ఒత్తిడి” పెరుగుతుంది. ఆ ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలు అపజయాన్ని ఇవ్వవచ్చు. “ధీ” అనగా బుద్ధి. దాని సారాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్నది కష్ట | సమయంలో ఉన్న వ్యక్తి వ్యక్తిత్వ పరిణతికి అద్దం పడతాయి చెపుతున్నాడు Vidura

ఒక చెరువులో నీరున్న సమయంలో చేపలు, కప్పలు చేరుతాయి.. ఆ చెరువులో నీరు ఎండిపోతే… ఆ చేపలు కప్పలు వెళ్ళిపోయిన విధంగా మన విజయంలో మన వెంట ఉన్న మిత్రులు మనం అపజయాల పాలయి, జారి పోతున్న వేళ ఆసరాగా ఉంటారా లేదా వారు కూడా మరో నాలుగురాళ్ళు వేసి పారిపోతారా… అనేది వ్యక్తి కష్టాలలో ఇరుక్కున సమయంలో తెలుస్తుంది.

మనం ప్రయాణిస్తున్న నావ మునిగిపోతున్న సమయంలో దాని మానాన దానిని విడిచి మన దారి మనం చూసుకోవచ్చు. అలాకాక, బాధ్యత తీసుకొని అందరినీ ఒక్క త్రాటిపై నడిపి సమష్టి తత్త్వంతో గట్టును చేరనూవచ్చు. ఏ మార్గాన్ని అనుసరిస్తామనేది వ్యక్తిగత నిర్ణయం.. అదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ఏ జీవితమనే పుస్తకంలో పరీక్షా సమయాలనే కొన్ని ఆధ్యాయాలు ఉంటే ఉండవచ్చు.. అంతమాత్రాన పుస్తకం అంతా అలాగే ఉంటుందని భావించనవసరము లేదు. ధృడవిశ్వాసంతో ముందుకుసాగితే విజయం మన వెంటనే నిలుస్తుంది. దానితో ఆ సడలని నమ్మకాన్ని ఊపిరిగా శత్రువులైన పరిస్థితులే అనుకూలమౌతాయి. నిలుపుకోగలగడం వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరిస్తుంది.

Vidura Part-8

నిజానికి ఒక సంస్థను నిర్వహించే నాయకుని విజయానికి అవకాశాలు ఎన్ని ఉంటాయో అన్ని అవరోధాలూ ఉంటాయి. అవరోధాలు ఎదురైన వేళ తన బలాన్ని బలహీనతలను బేరీజు వేసుకొని ముందుకు సాగిన వ్యక్తి విజయానికి ప్రకృతి సహకరిస్తుంది. విజయాన్ని ఎలా నిర్వహించుకున్నామనే దానికన్నా ఎదురైన అపజయాలను ఎలా నిర్వహించుకున్నామనేదే మన విజయావకాశాలను మెరుగు పంది. (ఉన్నత ఉద్యోగాలకు జరిగే ఇంటర్వ్యూలలో దీనినే ప్రాధాన్య పరిగణిస్తారు)

 ఒక మెంటర్ ఎవరో వచ్చి మార్గాన్ని చూపుతాడు. అలాగే.. తన ధార్మికవర్తనకు పరీక్షా సమయాలుగా నిలిచిన కష్టసమయంలో తన ధర్మవర్తనయే తనకు రక్షగా నిలుస్తుంది. తప్పు చేసిన వ్యక్తి అధార్మికుడై కాలాంతరంలో పతనమౌతాడు. తన నైతిక వర్తనవల్ల ఉద్యోగుల, వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనడం సాధ్యపడుతుంది. సంస్థ ప్రగతిపై ఆధారపడి ఉద్యోగుల అభ్యుదయము, ఉద్యోగుల సామర్థ్యం ఆధారపడి సంస్థ నిలుస్తుంది. ఈ రెండూ పరస్పరాధారితాలు.

సంస్థను ప్రగతిపథంలో నిర్వహించడం నాయకునికి కత్తిపై సాములాంటిదే. ప్రత్యర్థులు అవరోధాలు సృష్టించవచ్చు. ప్రత్యర్థుల మాయమాటలకు ఆకర్షితులైన వినియోగదారులు తమను విడిచివెళ్లవచ్చు. స్వార్థపరులైన ఉద్యోగాలు.. ఉత్పత్తి ఉత్పాదకతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నది. ప్రభుత్వ నిర్ణయాలు తమ సంస్థ ఆశయాలకు పని తీరుకు వ్యతిరేకంగా ఉండవచ్చు. నిరంతరం మారుతున్న సాంకేతికత… సంస్థ ఉనికికే ప్రశ్నార్ధకం కావచ్చు. ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముట్టి భయంకర వాతావరణాన్ని కల్పించవచ్చు. ఆ సమయంలో భయపడి ప్రయత్నాన్ని విడిచిపెడితే విజయం కనుమరుగవుతుంది. అదే ధైర్యాన్ని వహించి ఆ కష్టాల కడలిని దాటగలిగితే సంస్థ నిలుస్తుంది… ఉద్యోగులు నిలబడుతారు.. అలా కాని నాడు సంస్థ కనుమరుగవుతుంది.. ఉద్యోగులు నిరాశ్రయులు అవుతారు.

అలా కష్టాల కడలిలో మునిగిన వేళ నిజమైన మిత్రులు శత్రువులు ఎవరో మనకు తెలుస్తుంది. సమస్యలు నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టమని చెపుతున్న వేళ నమ్మకం మరొకసారి ప్రయత్నించమని గుసగుసలాడుతుందని చెపుతారు. ఆ సూచనను గ్రహించిన వ్యక్తి ప్రగతివైపు ప్రయాణిస్తాడు. శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకునే వ్యక్తి తాత్కాలికమైన అవరోధాల మంటలలో అవకాశాలను వ్రేల్చడం సమంజసం కాదు అనే సత్యాన్ని చెపుతున్నాడు విదురుడు.

Wealth-Happiness: సంపద-ఆనందం:

శ్రీర్మంగళాత్ ప్రభవతి ప్రాగల్భ్యాత్ సప్రవర్ధతే దాక్ష్యాత్తు కురుతే లం సంయమాత్ ప్రతితిష్ఠతి!

సంపద శుభకార్యాల వల్ల పుడుతుంది. నేర్పువల్ల పెరుగుతుంది. సమర్ధత వల్ల స్థిరత్వాన్ని పొందుతుంది.. మిడిసిపాటు లేకపోతే అది నిలుస్తుంది. సంపద ఆనందాన్ని ఇవ్వాలి అంటే వ్యక్తిలో దానిని నిలుపుకునే ప్రజ్ఞ ఉండాలి.. నిగ్రహము కావాలి, చదువు అంటే విజ్ఞత కావాలి, ప్రయత్నం కావాలి, శక్తిమేరకు మంచి కార్యాలకు సంపదను వినియోగించగలిగిన త్యాగభావన కావాలి అప్పుడా సంపద వల్ల ఆనందం కలుగుతుంది, వ్యక్తి ప్రకాశితుడౌతాడు. అన్నింటికన్నా మిన్నగా ఇతరులలోని మంచిని గుర్తించి వారిని సత్కరించే సద్గుణం కావాలి.

అలాకాక అసూయాపరుడైతే అతనిలో ధర్మాచరణ నశిస్తుంది. కోపిష్టియైతే సంపద హరించుకుపోతుంది, నీచులు దుర్మార్గుల సహవాసము వల్ల శీలము మసిబారుతుంది, కామాతురుడైతే విచక్షణ లుప్తమౌతుంది. మానాభిమానాలకు పోతే సర్వమూ నశించిపోతుంది. సంపద ఆనందాన్నివ్వాలి అనుకున్నాము. అయితే ఆనందం అంటే ఏమిటి? మన శరీరం, మనస్సు, బుద్ధి వీటిని నడిపే ఆత్మతో సంఘటితమై తన్మయతతో రమించే ఒకానొక స్థితి, ఆనందం. ఆ స్థితిలో ఆహ్లాదం, ప్రశాంతత, మాధుర్యం, ఉత్సాహం, పరవశం.. ఇలా భావాతీత వికాసం కలుగుతుంది. ఆ వికాసమే ఆనందం అనుకుందాం.

 ఈ స్థితి భౌతికమైన పంచేంద్రియాల వ్యాపారానికి అతీతమైన స్పందనతో కలిగే అపూర్వమైన చైతన్య స్థితి. ఈ స్థితిలో ప్రతికూల భావనలు కలుగవు. వ్యక్తిత్వం అన్నింటియందూ అనుకూల శక్తినంది వ్యాప్తమవడము, తద్వారా కలిగే చైతన్య స్థితిలో రమించడం జరుగుతుంది దానినే ఆనందంగా చెప్పుకోవచ్చు.

ఈ స్థితిలో అనుకూల భావనలు వెలుగుచూస్తాయి. దానివల్ల అన్ని కార్యాలలో చురుకుగా పాల్గొనగలుగుతాము. మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల సకారాత్మకమైన ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. సమయానికి కార్యసాఫల్య కలుగుతుంది. ప్రయత్నాలు సమర్ధవంతంగా ముగుస్తాయి. ఆర్థిక ప్రణాళికలు జయప్రదమవడం జరుగుతుంది. అధ్యయన సాధనాలు, పరిశోధనా ప్రయత్నాలు కూడిన సహ జీవనం, ఇచ్చి పుచ్చుకునే వైఖరి, ప్రేమించే హృదయం అనుకున్న విధమైన ఫలితాలను ఇవ్వడం వల్ల అవి ఉత్సాహాన్నిస్తాయి… అవగాహనతో ఆవిష్కృతమౌతుంది. విశ్వాసపాత్రులైన అనుచరులు, బాధ్యతాయుత నాయకులు మనలను ఆశ్రయిస్తారు. 

అందరినీ సంఘటితపరచే చైతన్యం, ఏకత్వ దృష్టి అలవడుతుంది. ఆ ఆనంద వికాసం వల్ల మనమేకాక చుట్టూ ఉండే వాతావరణమూ ఆనందభరితమై శాంతి ప్రసారం వ్యాప్తమౌతుంది. దివ్యానుభూతిని అందరిలో ఆనందాన్ని సాధించగలమా అనే సందేహం వద్దు. దృఢనిశ్చయంతో ప్రయత్నిస్తే, ఏకాగ్రతతో పట్టువదలక సాధనచేస్తే సాధ్యం కానిది ఏమీలేదు. నేను చేయగలను. నీవు చేయగలవు, మనం చేయగలము అనే భావనతో కూడిన అనుకూల సూచనలతో బలోపేతమైన అంతర్మనస్సు అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తుంది. ఈ ప్రయత్నంలో ఒక్కొక్కసారి ఓటమి ఎదురుకావచ్చు.. దానిని ఆదరించవద్దు. క్రుంగిపోనూవద్దు. అపాయాల గురించి ఆలోచించుకోవడం, అపజయాల నుండి నేర్చుకోవడం, పొరపాట్లను సరిదిద్దుకోవడం వల్ల ప్రతికూల భావనలు దూరం చేసుకోగలుగుతాము.. సంపద సమకూరుతుంది… దానిని సద్వినియోగం చేయడం వల్ల వృద్ధి పొందుతుంది. అదే మనకు ఆనందాన్ని ఇస్తుంది. నింపుతూ సమాజాన్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది. శరీరం, మనస్సు చురుకుగా ఉండాలి అంటే ఆలోచనలు సహకరించాలి. 

ముందుచూపు కలిగిన వ్యక్తి ఆలోచనలు చురుకుగా ఉంటాయి. ఏ ఆచరణకైనా ఆలోచనయే మూలం.. ఆ ఆలోచనలు సదభిప్రాయాల నుండి వెలుగుచూస్తే సత్ఫలితాలనిస్తాయి. వనరులు, వసతులు, ప్రణాళికలు అన్నింటినీ సమగ్రంగా విశ్లేషించుకునేందుకు అవసరమైనది చురుకైన ఆలోచనలే. అన్నింటినీ సరిగా మేళవించుకోవడం (Tuning), కార్యాన్ని పూర్తి చేసుకునే శక్తిసామర్ధ్యాలను ప్రోదిచేసుకోవడం (Energy), అవసరమైన సర్దుబాటులు చేసుకోవడం (Adjustment), లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగడం (Mission)… ఇదే బృందం… Team. వీటిని సమర్ధవంతంగా నడపడమే… చురుకుగా ఉండటం. చురుకుతనం నిర్లక్ష్యానికి దారితీయవద్దు. సరైన నిర్ణయం తీసుకోవడమే కార్యసాఫల్యతకు మార్గం చూపుతుంది. ఆచరణ కోసమే నిర్ణయాలు.. వాటిని వాయిదా వేయడం వల్ల అపజయం పలకరిస్తుంది. సాధ్యాసాధ్యాల పరిశీలన తదుపరి తీసుకున్న నిర్ణయాన్ని చురుకుగా అమలు చేయడమే సంపదను సృష్టిస్తుంది. అదే ఆనందానికి కారణమౌతుంది.

సమయోచిత ప్రజ్ఞ వెలుగుచూడాలి. దక్షతయే సమర్ధతకు గీటురాయి. సమయాన్ని సద్వియోగం చేసుకోవడమే కార్యసాఫల్యతకు దగ్గర దారి. సమర్ధత దానిని ఫలప్రదం చేస్తుంది, శ్రేష్ఠతను ప్రసాదిస్తుంది. ఉత్సాహంగా క్రొత్తదనానికై అన్వేషించడం వల్ల క్రొత్త మార్గాలు లభ్యమౌతాయి. ఉత్సాహం వల్ల సాహసంగా ముందుకు సాగుతాము. అదే ధైర్యాన్ని తోడుతెచ్చుకుంటుంది. బుద్ధితో చేసిన విచారం, శక్తిసామర్ధ్యాలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. 

ప్రయత్నం యత్నకార్య సిద్ధిని ప్రసాదిస్తుంది. సదవగాహన వల్ల స్పష్టత కలుగుతుంది. అయోమయం దూరమవుతుంది. సంపూర్ణ అవగహన వల్ల కార్యసాధన.. తద్వారా సంపద.. దాని వల్ల ఆనందమూ కలుగుతాయి. దీనిలో పరస్పరావగాహన ప్రముఖ పాత్రను పోషిస్తుంది. సహకారం స్ఫురణను పెంచుతుంది. పరస్పర సహకారాన్ని మించి అవరోధాలను తొలగించుకోవడంలో ఉపకరించేది మరేదీ లేదు. బాధ్యతను పంచుకోవడం, పరస్పరం ప్రేమించుకోవడం, ఉన్నది ఇతరులకు ఇవ్వడం, సంపదను పంచుకోవడం వల్ల ఒకరిపై మరొకరికి విశ్వసనీయత పెరుగుతుంది. విశ్వసనీయత వల్ల కార్యసాఫల్యత నిలుస్తుంది.

రాజా! ఈ లక్షణాలు లేని కౌరవుల వల్ల జరగబోయే మారణహోమాన్ని నీ అధికారాన్ని వినియోగించి ఆపలేకపోతే నీవు దుర్మార్గుడైన చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోతావు. అంతే కాదు.. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా నీ సంపదా నిలువదు… ఆనందమూ నిలువదు.. ఆలోచించు అంటాడు విదురుడు.

Responsible leadership… బాధ్యతాయుత నాయకత్వం…

నసా సభా యత్ర న సంతి వృద్ధాఃనతే వృద్ధా యే న వదంతి ధర్మమ్, నాసౌ ధర్మో యత్ర న సత్య మస్తిన తత్ సత్యం యత్ ఛలేనాభ్యుపేతమ్!

ఏ సభలోనైతే వృద్ధులు (ఆర్యులు) ఉండరో అది సభయే కాదు.. ఏ సభలోనైతే దర్శ వృద్ధులు ధర్మము చెప్పరో వారు వృద్ధులే కాదు. సత్యం లేని ధర్మం, ధర్మమే కాదు..

 ఏదో ఒక నెపంతో, కపటముతో కూడుకొని తాము పలికిందే సత్యమంటే ఆ | సత్యమూ సత్యం కాదు. ఇక్కడ ఆర్యులు అంటే గుణముచే గొప్పవారని గుణవాచకమే కాని జాతివాచకము కాదు. సత్యము, రూపము, చదువు, ఉపాసన, బలము, పరాక్రమము, యుక్తితో కూడిన మాట తీరు ఇలాంటి లక్షణాలను కలిగియుండటం ఉత్తమంగా చెపుతారు. 

ఈ గుణాలన్నీ కూడా పాండవులయందు శోభిస్తున్నాయి. అంతేకాదు, ఇన్ని కష్టాలు పడినా వారింకా నిన్ను తండ్రివలె గౌరవిస్తున్నారు. నీవు కూడా వారిని కొడుకుల వలె ప్రేమతో ఆదరిస్తే సుఖసంతోషాలు సమకూరుతాయి. అలాకాక, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిలయందు నమ్మకాన్ని, సంపదను పెట్టి మంగళాన్ని కోరుతున్నావు… అది ఎలా సాధ్యపడుతుంది. దుర్యోధనాదులు భేదదృష్టి కలిగిన వారు. అలాంటి వారు ధర్మం ఆచరించరు. సుఖము, శాంతి, గౌరవాదులను ఇష్టపడరు. వారికి హితోక్తులు రుచింపవు. యోగక్షేమములు వారికి లభింపవు. వారికి వినాశము కంటే తుది గతి యొకటి కనిపించదు.

రాజా! ధర్మరాజు ప్రతిభ నీవెరుగనిది కాదు, దుర్యోధనుని ప్రజ్ఞ కూడా నీకు బాగా తెలియును. వారి గుణగణాలు బలాబలాలు పాలనా నైపుణ్యాలు అన్నీ నీకు తెలిసినవే. అంతేకాదు ఎవరి పాలనలో ప్రజాళికి సౌఖ్యం కలుగుతుందో నీకు తెలుసును. అయినా పుత్రవాత్సల్యంతో బాధ్యత కలిగిన నాయకుడైన ధర్మరాజును పరిత్యజించి, బాధ్యతారహీనుడైన దుర్యోధనునికి రాజ్యాన్ని అప్పగించాలని భావిస్తున్నావు.. అది అనర్ధదాయకం. నీవు అడిగావు కాబట్టి నాకు తెలిసిన ధర్మాన్ని చెపుతున్నాను.

రాజా! ధర్మరాజులో ఒక బాధ్యతగలిగిన నాయకుని చూస్తున్నాము. స్వయంగా తాను కష్టాలను అనుభవిస్తూ కూడా తన వారు క్రుంగిపోతున్న సమయాలలో వారికి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ, వారు పైకిలేచి నిలదొక్కుకునేందుకు అవసరమైన ప్రేరణను ఇస్తున్నాడు. సంక్షోభాల సమయంలో శక్తిహీనులైన తన వారికి (అనుచరులకు) ఆ సంక్షోభాలను అధిగమించే మార్గం చూపుతూ తోడుగా మార్చలేము కాబట్టి.. దానినే నడుస్తున్నాడు. ఇదివరకు ఏం జరిగిందో దానిని అంగీకరించడం (గతాన్ని దూరమవుతాము), జరగని దానిని గూర్చి ఆలోచించక పూర్తిగా వర్తమానంలోనే జీవించడం.. దీనినే వివేకం అంటాము. ఆ వివేకాన్ని కలిగి ఉండటమే ఉదాత్తమైన బాధ్యత కలిగిన నాయకుని లక్షణం. ఆ లక్షణాన్ని ధర్మజునిలో మనం చూడవచ్చు.

 క్లిష్ట పరిస్థితులను తన వివేకంతో అధిగమించి అనుచరులను కూడా తమంత శ్రీ తాముగా విపత్కర సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు సన్నద్ధం చేసిన వ్యక్తిత్వం తవ్వుకుంటూ కూర్చుంటే మనశ్శాంతికి ధర్మజునిది. స్వయం కృషి, ఔదార్యం, బుద్ధికుశలతలు తన వనరులు, వసతులుగా; శ్రీ ఆచరణాత్మక మార్గదర్శన చేయడం నాయకుని ప్రాధమిక లక్షణం. పరస్పర అంగీకారం, పరస్పర సహాయ సహకారాలు, సత్సంకల్పం, నిరంతర ప్రయత్న శీలత… ఇవి బాధ్యతాయుత నాయకుని లక్షణాలు… ఈ ప్రయత్నంలో లభించిన ఫలితాలనే కాదు అందులో లభించే పరువు ప్రతిష్ఠలను కూడా తనవారందరితో ఉదాత్తమైన మనస్సు బాధ్యతాయుత నాయకునికి ఉంటుంది.

మనం నడచే విజయద్వారానికి తాళం పడటమే ఉపద్రవం అనబడుతుంది. మన ప్రయాణంలో ఎదురయ్యే ఉపద్రవం సక్రమ మార్గంలో గమించే మన మార్గాన్ని న మూసివేసి మన యానాన్ని అయోమయంలో పడవేస్తుంది. ఆ సమయంలో బాధ్యత గలిగిన నాయకుడు స్వయం ప్రేరణతో, ఆలోచనతో తానే ఆ ఉపద్రవాన్ని గడచి విజయుడై బయటకు వస్తాడు. ఆ దారిలో అనుచరులకూ మార్గదర్శన చేస్తాడు… బాధ్యత వహిస్తాడు.

ఒక మామూలు బండరాయిని తీసుకొని అందులో అవసరం లేని భాగాలను తొలగించడం ద్వారా శిల్పి దానినొక అద్భుతమైన శిల్పంగా మలచినట్లు, బాధ్యత గలిగిన నాయకుడు తన అనుచరులలో, వ్యవస్థలో, సంస్థలో జరుగుతున్న కాపు లోటుపాట్లను తప్పులను సరిచేసి దానికి ఉన్నతమైన, ఉత్తమమైన వ్యవస్థగా సంస్థ కు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు.

మనం చేసే పనిలో అంకితభావం, స్పష్టత ఉంటే సామర్థ్యం పెరుగుతుంది. శ్రద్ధ, జ్ఞానం, వివేచన, వివేకం, అవగాహన, స్పష్టత… ఇలాంటివి వ్యక్తిని తర్కస్థాయిని దాటి ముందుకు నడిపిస్తాయి. ఆ క్రమంలో చీకాకులు తొలగిపోయి శాంతి లభిస్తుంది. ఇవి నాయకుడు సాధించే విజయానికి అదనపు ఫలాల చెప్పబడతాయి కారణం “సందేహం” మాత్రమే. సందేహాలు వివాదాలకు మూలమవుతాయి. దానివల్ల కార్యసాధనలో లేదా కార్యాచరణలో పని జరగకుండా వాయిదా వేయడానికి కాలహరణ, శక్తిని కోల్పోవడం జరుగుతుంది.

 అయితే ఆ సందేహాలను అధిగమించేందుకు పరిశీలన, పరిశోధనలు ఉపకరిస్తాయి. నిజానికి సందేహాలు హేయత్వంగా చెప్పుకోవాలి. ప్రయత్నపూర్వకంగానైనా సందేహాలు తీరిన వేళ నాయకుడు, మబ్బులు తొలగిన మధ్యాహ్న సూర్యుని వలే ప్రకాశిస్తాడు. దర్శనం అసాధ్యాన్ని దర్శిస్తుంది.. కర్తవ్యం దాన్ని సుసాధ్యం చేస్తుంది. ఉపాసన ఆ ఫలితాలను అందరికీ పంచుతుంది. 

ఈ ప్రక్రియ అంతా బాధ్యతాయుత నాయకత్వంలో సాధ్యపడుతుంది. సంపూర్ణమైన ఏకాగ్రత విజ్ఞానంతో జత కలసి పెంపొందితే శ్రేష్ఠతా పరిపూర్ణతలు సమర్ధవంతంగా ఆవిష్కృతమౌతాయి. విలువలతో కూడిన నాయకత్వం, ఉన్నత దృష్టితో పరిశీలించడమే, సరైన పర్యవేక్షణగా చెప్పబడుతుంది. ఉద్దేశం లేని పర్యవసానాలు ప్రముఖం కావు. అక్రమ మార్గంలో సఫలతకన్నా సక్రమ మార్గంలో విఫలతను ఆహ్వానించడమే మిన్నగా చెప్పబడుతుంది. శ్రద్ధాసక్తులు ప్రేమను, ప్రేమ శ్రద్ధాసక్తులను పుట్టిస్తాయి..

రాజా! కౌరవ పాండవులు విడివిడిగా ఉన్నట్లయితే నిప్పుకణికలవలె పొగలు గ్రక్కుదురు.. అదే కలసి ఉన్నట్లయితే జ్వాలగా మండుతారు. ధర్మరాజులో బాధ్యతాయుత నాయకత్వ లక్షణాలు సమృద్ధిగా పరిఢవిల్లుతున్నాయి. పాండవులను పిలిపించి వారి రాజ్యాన్ని వారికి అప్పగించడం ద్వారా రెండు వర్గాలూ సహకార ధోరణిలో అభ్యుదయాన్ని పొందుతాయి… అంటున్నాడు విదురుడు.

విదురుని మాటలు కాలానుగుణంగా మాత్రమే కాక, సర్వకాలిక సత్యాలుగా నిలుస్తున్నాయి. “కౌరవ పాండవులు విడిగా ఉన్నపుడు నిప్పుకణికలు, కలసి ఉన్నపుడు జ్వాల” అన్న విదురుని మాటలు సామరస్యానికి ఇచ్చిన గాఢమైన సందేశం. ఇది నేడు కୂడా అన్ని కుటుంబలు, సమాజలు, రాజ్యణలୁ, గమనించవలసలన సూత్రం.

ధర్మరాజు నాయకత్వం యొక్క పరిపక్వతను విదురుడు బాగా గుర్తించాడు. ఆయనలో నాయకుని ప్రామాణికత, దూరదృష్టి, క్షమాశీలత, ధర్మబద్ధత ఉన్నాయని స్పష్టంగా చెప్పాడు. పాండవులకు రాజ్యాన్ని తిరిగి ఇవ్వడం వల్ల కేవలం రాజకీయం లోనే కాదు, సమాజంలోని శాంతి, అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. విదురుని సందేశం ఈ విషయాన్ని స్పష్టంగా వ్యక్తీకరిస్తోంది — ప్రతిష్టాభంగం కన్నా శాంతి ముఖ్యం, ద్వేషం కన్నా సహకారం అవసరం.

విదుర నైతికత, నాయకత్వం గురించి మనం ఎన్నిసార్లు చదివినా, ప్రతి సారి కొత్త అర్థాలు తేలిపోతుంటాయి. ఆయన చెప్పినది ఒక్క రాజకీయులు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి పరిగణించవలసిన ధర్మపాఠం. ఒక వ్యక్తి, కుటుంబం, సమాజం — ఎక్కడైనా విభేదాలు ఉండవచ్చు, కానీ అవి విడదీసే శక్తులు కాకూడదు. సహజీవనం ద్వారా మనం పెద్ద కార్యాలను సాధించగలం. విదురుడు సూచించినట్లుగా, మనం మనలోని మంచి లక్షణాలను అభివృద్ధి చేసుకుంటూ, ఇతరులనూ ప్రోత్సహిస్తూ ముందుకెళ్లాలి.

సారాంశంగా చెప్పాలంటే, విదురుని ఈ మాటలు నేడు మన రాజకీయాల్లో, సామాజిక జీవితంలో, మరియు వ్యక్తిగత సంబంధాల్లో బలమైన మార్గదర్శకంగా నిలుస్తాయి. ధర్మాన్ని ఆధారంగా చేసుకున్న నాయకత్వం ఎప్పుడూ సత్యాన్ని నిలబెట్టే శక్తిగా మారుతుంది. విదురుని సిద్ధాంతాలు మనలో అందరికీ ఆత్మపరిశీలనకు, ధర్మాన్ని అనుసరించే జీవన పథానికి ప్రేరణనివ్వాలి. అదే నిజమైన అభివృద్ధి దిశ.

Vidura నైతికత, నాయకత్వం గురించి మనం ఎన్నిసార్లు చదివినా, ప్రతి సారి కొత్త అర్థాలు తేలిపోతుంటాయి. ఆయన చెప్పినది ఒక్క రాజకీయులు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి పరిగణించవలసిన ధర్మపాఠం. ఒక వ్యక్తి, కుటుంబం, సమాజం — ఎక్కడైనా విభేదాలు ఉండవచ్చు, కానీ అవి విడదీసే శక్తులు కాకూడదు. సహజీవనం ద్వారా మనం పెద్ద కార్యాలను సాధించగలం. విదురుడు సూచించినట్లుగా, మనం మనలోని మంచి లక్షణాలను అభివృద్ధి చేసుకుంటూ, ఇతరులనూ ప్రోత్సహిస్తూ ముందుకెళ్లాలి.

సారాంశంగా చెప్పాలంటే, విదురుని ఈ మాటలు నేడు మన రాజకీయాల్లో, సామాజిక జీవితంలో, మరియు వ్యక్తిగత సంబంధాల్లో బలమైన మార్గదర్శకంగా నిలుస్తాయి. ధర్మాన్ని ఆధారంగా చేసుకున్న నాయకత్వం ఎప్పుడూ సత్యాన్ని నిలబెట్టే శక్తిగా మారుతుంది. విదురుని సిద్ధాంతాలు మనలో అందరికీ ఆత్మపరిశీలనకు, ధర్మాన్ని అనుసరించే జీవన పథానికి ప్రేరణనివ్వాలి. అదే నిజమైన అభివృద్ధి దిశ.

మిగితాది పార్ట్ 9 లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *