Sutlej Valley, Mandi, Palampur, Dharamshala, and McLeod Ganj: Icons of Natural Splendor and Cultural Grace in Himachal Pradesh సుట్లెజ్ వ్యాలీ, మండి, పాలంపూర్, ధర్మశాల, మక్లియోడ్ గంజ్: హిమాచల్ ప్రదేశంలోని స్వభావిక శోభకు, సాంస్కృతిక వైభవానికి ప్రతిరూపాలు:
Sutlej Valley – A Harmonious Blend of Culture, Nature, and Himalayan Grandeur: సట్లేజ్ వ్యాలీ: సట్లేజ్ వ్యాలీ – పర్వత ప్రవాహాల మధ్య సంస్కృతి, సహజ సౌందర్యాల కలయిక;భారతీయ సంస్కృతి ఆనాడు గంగా సింధూ మైదానాల్లో వెల్లివిరిసింది. ఆర్యులు ఆనాడు అవలంభించిన జీవన విధానం యావత్ ప్రపంచానికే నాగరిక ప్రమాణాల్ని సమకూర్చి పెట్టింది. జనం ఆ రోజుల్లో ముఖ్యంగా నదీ తీరాల్లో నివసిస్తూ వుండేవారు. అందుకే ఈ రోజు ఎన్నో యాత్రా స్థలాల్నీ, చారిత్రిక స్థలాల్నీ మనం నదులకు చేరువగా చూడటం జరుగుతోంది. మతం ఆనాడు మనుషుల మనుగడకి మార్గదర్శిగా ప్రవర్తించేది
అ మత ప్రవక్తలందరూ కూడా Sutlej Valley నదీ తీరాల్లోనే గుళ్ళూ గోపురాలూ నిర్మించేందుకు రాజులని ప్రోత్సహిస్తూ వుండేవారు. ఆ కారణంగానే హిందూ, బౌద్ధ మతాలు రెండూ కూడా సమ ఉజ్జీలుగా భారతీయుల్ని ప్రభావితం చేస్తూ వచ్చేయి. సింధూనదికి ఉపనదులయిన సట్లెజ్, రావి, బీస్ నదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రాచీన భారతీయులు అధికంగా నివసించినట్లుగా చారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి.
సిమ్లాకి 140 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్న Sutlej Valley తీరంలో అనేక దర్శనీయ స్థలాలు వున్నాయి. వాటిలో రామప్పర్, సరాహన్, కిన్నాపూర్, కల్పా ముఖ్యమయినవి. ఇక్కడి బౌద్ధారామం చాలా ప్రసిద్ధి చెందింది ప్రస్థుతం రామాపూర్ పట్టణం ఓ ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతోంది.
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రామప్పర్లో నవంబరు నెల రెండో వారంలో ‘లావీ’ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి రాష్ట్రంలోని యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. దేశం నలుమూలల్నుంచీ యాత్రీకులు తరలి వస్తారు. ఆ సమయంలో యిక్కడ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మకాలతో సందడిగా వుండే ఆ ప్రాంతం సాయంకాలం కాగానే సంబరాల్లో మునిగి తేలుతుంది.
పరాహన్ నగరం సిమ్లాకి 184 కిలోమీటర్ల దూరంలో వుంది. ఆనాడు Sutlej Valley తీరంలో పరిఢవిల్లిన రామూర్ రాజ్యానికి పరాహన్ రాజధానికగా వుండేది. యిక్కడి భీమా ్కలీ మందిరం అతి ప్రాచీనమయింది. ఈ మందిరం హిందూ బౌద్ధమత సిద్ధాంతాల్ని పుణికి పుచ్చుకుని నేటికీ సగర్వంగా నుంచుని వుంది. ఈ ఆలయంలోని శిల్ప సౌందర్యం మన కన్నులకి పండుగని చేస్తుంది. నగరంలో అనేక దర్శనీయ స్థలాలు ఆనాటి రామ్పూర్ ఋషాహర్ రాచరిక చిహ్నాల్ని ప్రతిబింబిస్తుంటాయి.

‘కిన్నాపూర్’ Sutlej Valley పరివాహక ప్రాంతంలో వెల్లివిరిసిన మరో సుందర ప్రదేశం ! సట్లెజ్లో కలిసే యితర చిన్న జలాధారాలు అన్ని కూడా దాపులోని హిమగిరుల్లో నుంచే ఉద్భవించాయి. మంచుతో నిండిపోయి వుండే ఈ ప్రాంతంలోని అనేక బౌద్ధారామాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. సట్లెజ్ లోయంతా సర్వాంగ సుందరంగా ప్రకృతి శోభతో కళ్లకు విందు చేస్తుంది. పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా వున్న ఈ ప్రాంతంలో జన సంచారం తక్కువగా వుంటుంది. కాని పర్వతారోహక బృందాలకి మాత్రం ఈ లోయ ట్రెక్కింగ్కీ, స్కేటింగ్్క మంచి అవకాశాల్ని కలిగిస్తుంది.
చుట్టూ వున్న అడవులన్నీ కూడా మంచు ముసుగుని వేసుకుని వుంటాయి. అక్కడక్కడా వున్న ఇళ్ళన్నీ కూడా కర్రలతో నిర్మించబడి వుంటాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ వసతి గృహాలు మనకి కనీసావసరాల్ని తీరుస్తాయి. ఈ ప్రాంతాన్నానుకుని వున్న ‘కిన్నె కైలాసగిరి’ పర్వతాన్ని పరమశివుడి నివాస స్థానంగా పరిగణించటం జరుగుతోంది.
కల్పా ఓ చిన్న గ్రామం! సముద్రమట్టానికి 2760 మీటర్ల ఎత్తులో వున్న ఈ ప్రాంతం అంతా కూడా ప్రకృతి సౌందర్యంతో విరాజిల్లుతోంది. దట్టమయిన అడవులూ, ఎత్తైన మంచు శిఖరాలూ యిక్కడ మనకు దర్శనమిస్తాయి. ‘కిన్నెర కైలాస పర్వతశ్రేణి యిక్కణ్ణించే ఆరంభమవుతుంది.
పర్వతారోహక బృందాలతో ఈగ్రామం ఎప్పుడూ రద్దీగానే వుంటుంది. కల్పా నుంచి ‘మూరంగ్’ అనే మరో సుందర పర్వత గ్రామాన్ని దర్శించవచ్చు ! సట్లెజ్ వ్యాలీ మొత్తం కూడా సిమ్లాతో రోడ్డు సంబంధాల్ని కలిగివుంది. అయితే దశలవారీగా ఈ ప్రయాణాన్ని చేయవలసివుంటుంది.
ఢిల్లీ నుంచి నేరుగా బస్సులో కానీ, లేదా రైల్లో చండీఘర్ని చేరుకుని అక్కడికి దగ్గరా వున్న పల్కా నుంచి న్యారోగేజీ మార్గంలో సిమ్లాని చేరుకోవాలి. సిమ్లా నుంచి సట్లెజ్ వ్యాలీ సందర్శనానికి తగు సౌకర్యాలు లభిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ బస్సులు, లేదా టాక్సీలు, జీపులు మన అవసరాల్ని తీరుస్తాయి. అతిశీతల ప్రదేశం కాబట్టి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని బయల్దేరాలి. ఏప్రిల్- సెప్టెంబరుమాసాల మధ్యకాలం ఈ యాత్రకు అనుకూలంగా వుంటుంది.
Mandi – The Cultural Heartland of Himachal, Known as the Land of Gods మండీ – దేవతల భూమిగా ప్రసిద్ధిగాంచిన సంస్కృతిక కేంద్రం
చండీఘర్ నుంచి 202 కిలోమీటర్ల దూరంలో వున్న Mandi ని కులూ లోయకు ముఖ్యద్వారంగా చెప్పవచ్చు. సముద్రమట్టానికి 760 మీటర్ల ఎత్తులోవున్న ఈ స్థలంలో ఉష్ణోగ్రత కొద్ది హెచ్చుస్థాయిలో వుంటుంది. మండీని బీసీ నదీ లోయలోని భాగంగానే పరిగణిస్తారు. ఈ పట్టణం 400 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి టిబెట్వెళ్ళే మార్గంలో ఆవిర్భవించింది. అనేక ప్రాచీన కట్టడాలు గల ఇరుకైన సనాతన వీధి మార్గాలతో ఈ నగరం అలరారుతోంది.

మండీ పట్టణంలో శిల్పకళలకి జీవం పోయబడింది. యిక్కడున్న అనేక దేవాలయాల్లోని శిల్పాలు ఆ విషయాన్ని రూఢిపరుస్తాయి. పంచవక్త్ర, అర్ధనారి, త్రిలోకనాధ్ మరియు భూతనాధ దేవాలయాలు ప్రముఖ దర్శనీయ స్థలాలు. బీస్ నదీ తటంలో వున్న ఈ పట్టణాన్ని ఆనుకుని వున్న హిమగిరిమాల కులులోయకు కంఠహారంగా కనిపిస్తుంది. -మండీకి ఊర్ధ్వభాగమంతా సస్యశ్యామల వాతావరణంతో మిడిసిపడుతూ వుంటుంది. అందుకే యిది ఓ ప్రముఖ పర్యాటక కూడలి స్థానంగా చెప్పుకోబడుతోంది.
Mandi లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మొత్తం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ఉత్సవాన్ని పరమ పవిత్రంగా భావించి వేల సంఖ్యలో జనం అక్కడికి చేరుతారు. ఆ వారం రోజుల పండుగ సందర్భంగా మండీ జిల్లా మొత్తంనుంచి దేవతామూర్తులెన్నో అక్కడికి చేరతాయి. ఆ దేవుళ్లందరికీ ఒకే వేదిక పైన పూజలు జరుగుతాయి. ఆ తర్వాత ఆ విగ్రహాలన్నింటినీ కప్పువేసిన మేనాల్లో యధాస్థానాలకి తరలిస్తారు. ఆ సమయంలో భూతనాథ దేవాలయం యాత్రికులతో కిట కిట లాడి పోతూవుంటుంది.
Mandi కి దగ్గరలో రెవల్సర్ సరస్సు వుంది. ఇది ఓ ప్రముఖ యాత్రాస్థలం ! హిందూ, బౌద్ధ, శిక్కు మతాలు మూడింటికీ ఈ సరస్సు ఓ తీర్థస్థానంగా విరాజిల్లుతోంది. ఇక్కడ వున్న ఓ కొండగుహలో బౌద్ధ శిల్పకళా ఖండాలు వున్నాయి. ఈ బౌద్ధరామాల్ని దర్శించే విదేశీయులు ఈ గుహల్లోనే విశ్రమిస్తుంటారు. ఇక్కడే టిబెట్ దేశపు సంస్కృతితో నిర్మించబడిన ఓ బౌద్ధారామం కూడా వుంది.
చండీఘర్ నుంచి Mandi వెళ్ళే రోడ్డు మార్గంలో ‘రెవల్సర్ ‘ సరస్సు కు ముందుగా వున్న బిలాస్పూర్ ఓ శ్రీవైష్ణవ పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతోంది. ఇక్కడికి దగ్గర్లోనే భక్రానంగల్ ఆనకట్ట వుంది. గోవిందసాగర్ అని పిలువబడుతూన్న ఈ మానవ నిర్మిత సాగరతీరంలోనే వ్యాస మహర్షి గుహవుంది. అక్కడే లక్ష్మీనారాయణ, రాధాకృష్ణుల మందిరాలు కూడా వున్నాయి.
Mandi లో నివసించేందుకు అనేక విశ్రాంతి గృహాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూన్న టూరిస్టు బంగళాలు కూడా పనిచేస్తున్నాయి. ఇక్కడినుంచి యితర దర్శనీయ ప్రాంతాలకు వెళ్ళేందుకు అనేక రకాల రవాణా సౌకర్యాలు లభిస్తాయి. ఢిల్లీ నుంచి చండీఘర్ ద్వారా మండీని చేరుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ వారి బస్సు సౌకర్యం వుంది.
ఈ ప్రాంతాన్ని సంవత్సరంలోని ఏ భాగంలో నయినా దర్శించవచ్చు. చలికాలంలో మాత్రం తగు మోతాదులో ఉన్ని దుస్తులతో తరలివెళ్ళవలసి వుంటుంది.
Palampur – A Serene Himalayan Town Draped in Tea Gardens and Mountain Breezes: పాలంపూర్ – టీ తోటల మధ్య హిమాలయాల కిందలే వెలసిన ప్రకృతి రమణీయత
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని యితర యాత్రాస్థలాల్లో జనాన్ని విపరీతంగా ఆకర్షిస్తూన్న మరో పర్యాటక కేంద్రం Palampur.
పంజాబ్ రాష్ట్రంలోని పథాన్కోర్ పట్టణం నుంచి యిక్కడికి రైలు మార్గం వుంది. అమృతసర్ విమానాశ్రయం యిక్కడికి 208 కిలోమీటర్ల దూరంలో వుంది. మనాలీ పఠాన్కోర్ నేషనల్ హైవే- 20 మార్గంలో వున్న ఈ యాత్రాస్థలం నుంచి ధర్మశాలకూ, బాజీనాథ్కూ, జోగీందర్ పూర్కు మండీ, మనాలీకులూ, సిమ్లాలకూ వెళ్ళే అవకాశం వుంది. కంగ్రా లోయలో వున్న ఈ పట్టణంలోని విశేష స్థలాలని దర్శించేందుకు బస్సులు, టాక్సీలు మొదలగు వాహన సౌకర్యాలు లభిస్తాయి.
పట్టణానికి రైల్వేస్టేషను ‘5’ కిలోమీటర్ల దూరంలో వుంది. కంగ్రా లోయలో వున్న ఈ పట్టణంలోని విశేష స్థలాలని దర్శించేందుకు బస్సులు, టాక్సీలు మొదలగు వాహన సౌకర్యాలు లభిస్తాయి. పట్టణానికి రైల్వేస్టేషను ‘5’ కిలోమీటర్ల దూరంలో వుంది.
సముద్రమట్టానికి 1219 మీటర్ల ఎత్తులో వున్న ఈ హిమగిరి నగరం సమశీతోష్ణ పరిస్థితుల్ని కలిగి వుంటుంది. వర్షపాతం యిక్కడ అధికంగానే వుంటుందని చెప్పుకోవాలి. సంవత్సరంలో 250.6 సెంటీమీటర్ల వర్షం పడుతూ వుంటుంది. చలి కాలంలో శీతల పవనాలు 4.4 సెంటీ గ్రేడ్కి జారిపోతే వేసవిలో మాత్రం యింతవరకూ 3.3 సెంటీగ్రేడ్ను మించలేదు. అందువల్ల Palampur ఓ మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పాలంపూర్ జనాభా 15000కి మించి వుండదు. ఈ ఊళ్ళో బస చేసేందుకు మంచి హోటళ్ళున్నాయి.

ఇక్కడ బుండ్లా చాసమ్ నది ప్రవహిస్తోంది. ఈ నది ఎంతో లోతయింది. సట్లెజ్ నదీ పరివాహక ప్రాంతంలోని తషిమ్‌జోంగ్ అనే ప్రాంతం స్థానిక ఆచారాలను పుణికి పుచ్చుకుని వుంటుంది. చందనపు కర్రలో మలిచిన బుద్ధ విగ్రహాన్ని గల ఇక్కడి ఓ మందిరాన్ని తుకూర్వాడా మందిరంగా పిలుస్తుంటారు. ఇక్కడి బాజీనాథ్ శివక్షేత్రం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. క్రీస్తు పూర్వం 804వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆలయం పాలంపూర్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో వుంది.
బాజీనాధ్ లోని శివక్షేత్రాన్నే వైద్యనాథ్ క్షేత్రంగా కూడా పిలుస్తారు. యిక్కడి దేవదేవుణ్ణి ‘వైద్యోదేవుడ’ ఊర్ధ్వభాగం అంతా కూడా ఓ నాలుగు బ్రహ్మాండమయిన స్థంభాలపైన నిలిచివుంది. ఈ స్థంభాలపైన శిల్పులు చెక్కిన శిల్ప సౌందర్యాన్ని కన్నులారా చూడవలసిందే కాని వర్ణించనలవికాదు. వుంటుంది. మందిరంలోనే బాజీ నాథ్ లక్ష్మీనారాయణుల శిల్పాకృతి కూడా మనకి కన్పిస్తుంది. ఈ మందిరంలోనే రావణుడు శివపూజ చేశాడని వినికిడి.
బాజీనాథ్ దేవాలయంలోని లింగాకృతిని దేశంలోని ద్వాదశలింగాల్లోని ఒకటిగా పరిగణించటం జరుగుతోంది. శివరాత్రి పర్వదినాన యిక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున పాలంపూర్ ప్రాంతం అంతా కూడా పండుగ సంబరాలతో చాలా అలజడిగా ‘న్యూగల్కార్‘ అనే ప్రదేశం పాలంపూర్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో వుంది. యిక్కడ నుంచి ధవళగిరి హిమగిరి శ్రేణి సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. ‘నాదౌన్’ మరియు ‘చింతపూర్ని’ అనబడే ఓ రెండు ప్రదేశాలు కూడా Palampur యాత్రికులని బాగా ఆకర్షిస్తూ వుంటాయి.
‘బుండ్లా’ సెలయేరు యిక్కడ ఓ వందమీటర్ల వెడల్పుతో ప్రవహిస్తుంది. ఈ చిరునది చాలా వేగంగా ప్రవహిస్తూ వుంటుంది. వర్షాకాలంలో ఆ వేగం మరీ ఉధృతమయిపోయి నీటి హోరు చాలా దూరం వరకు వినిపిస్తూ వుంటుంది.
‘బీర్‘ యిక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో వున్న ఓ ప్రముఖ బౌద్ధారామం ! యిక్కడి ‘హాండ్ గైడింగ్‘ క్రీడలు బహుళ ప్రజాదరణని పొందాయి. యిక్కడి శిఖరాగ్రం నుంచి గైడింగ్ క్రీడాకారులు లోయలోకి దూకటం ఓ సాహసక్రీడ అనే చెప్పుకోవాల్సి వుంటుంది.

‘ఆంద్రెట్టా‘ పాలంపూర్కి పదమూడు కిలోమీటర్ల దూరంలో వున్న ఓ ప్రముఖ యాత్రాస్థలం. యిది దేశంలోని చిత్రకారులు కళా కౌశలానికి ఎంతో దోహదం చేస్తోంది. యిక్కడి ధవళగిరి శ్రేణుల దృశ్యం చిత్రకారుల కుంచెలకు ఎంతో పనిని కల్పిస్తూ వుంటుంది. ఏప్రిల్-నవంబర్ మాసాల మధ్యకాలంలో ఈ యాత్రకి అనుకూలంగా వుంటుంది.
Dharamshala: A Mesmerizing Canvas of Nature in the Lap of the Himalayas: ధర్మశాల: హిమాలయ కనుబొమ్మలపై ప్రకృతి అందాల తీయని దృశ్యం
పశ్చిమోత్తర హిమాలయాల్లోని కంగ్రాలోయ ‘ప్రకృతి దృశ్యాలకి దర్పణంగా సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. హిమాలయాల్లోని అత్యున్నత ధవళగిరి పర్వత శ్రేణులీ ప్రాంతంలో నయనానందాన్ని కలిగిస్తాయి. పథానకొ నుంచి యిక్కడికి సులువుగా చేరుకోగలం.
దాదాపు 29 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ ధర్మశాలక్షేత్రం. సముద్రమట్టానికి 1250 నుంచి 1980 మీటర్ల ఎత్తులో విస్తరించి వుంది యిక్కడి శీతకాలపు వాతావరణం 0° సెంటీగ్రేడులోకి పడిపోయి వేసవిలో మాత్రం 38 సెంటీగ్రేడుల వరకు పెరుగుతుంది. యిక్కడి వర్షపాతం కూడా అధికమే. జనాభా ఓ పాతిక వేల దాకా వుంటుంది. మార్చి నుంచి – సెప్టెంబరు నెల మధ్య కాలం దాకా ఈ ప్రాంతాన్ని దర్శించటానికి అనుకూలంగా వుంటుంది.
క్రీ.పూ. 3500 సంవత్సరానికి చెందిన కాంగ్రా సంస్కృతి యిక్కడ ఎంతగానో పరిఢవిల్లుతోంది. Dharamshala ని అతి ప్రాచీనమయిన పర్వత యాత్రాస్థలంగా భావించాలి. పురాణాల్లో కూడా ఈ స్థలాన్ని వర్ణించటం జరిగింది. ‘మహాభారతం‘ లోనూ ‘రాజతరంగిణి‘ లోనూ ఈ యాత్రా స్థలాన్ని గురించి వివరించటం జరిగింది. పద్దెనిమిదవ శతాబ్దకాలానికి చెందిన ‘రాజా సంసార చంద్ర’ అనే ఓ మహారాజు పరిపాలనని గురించి యింకా యిక్కడి జనంలో చర్చలు కొనసాగుతూనే వుంటాయి.

Dharamshala లో అనేక దేవదారు వృక్షవనాలు కనిపిస్తాయి. శీతాకాలంలో ఈ వృక్షాలన్నీ హిమభరితాలవుతాయి. ధర్మశాలలోనే ‘నోబెల్ శాంతి బహుమతి‘ గ్రహీత దలైలామా యొక్క నివాసగృహం వుంది. ఆ కారణంగా ఈ ప్రాంతాన్ని ‘లిటిల్ లాసా ఆఫ్ ఇండియా‘ గా పిలవటం జరుగుతోంది. Dharamshala ని రెండు భాగాలుగా విభజించారు. ఓ భాగాన్ని ‘లోయర్ ధర్మశాల‘ గానూ మరో భాగాన్ని ‘అప్పర్ ధర్మశాలగానూ’ పరిగణించటం జరుగుతోంది. అప్పర్ ధర్మశాల విభాగంలో ‘కోత్పాలీ బాజార్‘ మాక్లీయొడ్ గంజ్, ఫోర్సితగంజ్అనే వీధులు ఏర్పడ్డాయి.
దలైలామా నివసించే బౌద్ధారామాన్ని ‘గెలుగ్పా‘ అంటారు. యిక్కడంతా టిబెట్ దేశపు సంస్కృతీ, నాగరికతా మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. పైగా యిక్కడ టిబెట్ కళాకృతుల్నీ, శిల్పాల్నీ విక్రయిస్తూ వుంటారు.
ధర్మశాల లోనే ఆనాటి బ్రిటీష్ రాజదూత, వైస్రాయి, అయిన ‘లార్డ్ ఎల్జిన్‘ సమాధి వుంది. ఆ ప్రాంతంలోనే ఆ వైస్రాయ్ గౌరవార్థం నిర్మించబడిన ‘సెంట్జన్’ చర్చి నేటికి క్రైస్తవ మతభక్తుల్ని ఆకర్షిస్తూనే వుంది. 1863లో ఈ చర్చిని నిర్మించారు. ధర్మశాలకి దగ్గరలోనే ‘భాగ్ సునాధ్’ అనే ఓ పెద్ద జలపాతం వుంది. యిక్కడే అనేక సెలయేరులు పుట్టి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ‘కునాలత్రీ‘ అనబడుతోన్న మార్గం స్థానిక దేవాలయాలకి పరిగణించబడుతోంది. ‘స్వామి చిన్మయానంద’ నిర్మించిన తపోవనం యిక్కడే ఓ కొండ శిఖరం పైన నెలకొనివుంది.
కాశ్మీర్లోని ‘డాల్ సరస్సు’ మాదిరిగానే యిక్కడ కూడా ఓ ‘డాల్ సరస్సు’ వుంది. ఈ సరస్సు దాకా మంచి రోడ్డు మార్గం వుంది. చిక్కని ‘ఫిర్‘ వనం మధ్యనున్న ఈ సరస్సు యాత్రికులని ఎంతగానో ఆకర్షిస్తూ వుంటుంది.
‘ధర్మకోట‘ అనే మరో ప్రాంతం కంగ్రాలోయనీ, ధవళగిరి శ్రేణుల్నీ దర్శింపజేయగలిగే యాత్రాస్థ భావించాలి. సముద్రమట్టానికి 2850 మీటర్ల ఎత్తులో వున్న ‘తివుండ్‘ నుంచి ధవళగిరి శ్రేణి ప్రారంభం అవుతుంది. యిక్కడ యాత్రికులు బస చేసేందుకు అనేక వసతి సౌకర్యాలు లభిస్తాయి.

ధర్మశాలకి 40 కిలోమీటర్ల దూరంలోని ‘త్రిలోకపూర్‘ లో స్వతః సిద్ధమైన గుహాంతర్భాగంలో ఓ శైవక్షేత్రం వుంది. యాత్రికుల సౌకర్యార్థం యిక్కడ ఓ ప్రభుత్వ విశ్రమాలయం పనిచేస్తోంది.’చాముండీ దేవాలయం’ మరో ప్రసిద్ధ యాత్రాస్థలం ! యిక్కడ కూడా ఓ గుహలో నందికేశ్వరాలయం వుంది.
పాంగ్ ఆనకట్టకు సంబంధించిన సరస్సు ‘ మహాసీర్ ‘ రకం మత్స్య సంపదకి నిలయం! యిక్కడ చేపల వేట బహు ప్రాచుర్యాన్ని పొందింది. ధర్మశాలని ‘ గగ్గర్ ‘ విమానాశ్రయం ద్వారానూ, రైలు మార్గం ద్వారానూ చేరుకోగలం !
McLeod Ganj: A Little Tibetan World in the Heart of Dharamshala; మాక్లీయొడ్ గంజ్: ధర్మశాల హృదయంలో ఒక చిన్న టిబెటన్ ప్రపంచం:
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల యాత్రాస్థలం పేరు వినని భారతీయులు వుండటం అరుదు ! ఈ ధర్మశాల పట్టణాన్ని రెండు భాగాలుగా విభజించటం జరిగింది. ఒక భాగం లోయర్ ధర్మశాలగా మంచుకొండల నానుకుని ఉండటం వల్ల ఈ ప్రాంతానికా పేరు వచ్చింది.
1250 మీటర్ల ఎత్తులో విస్తరించి వుండగా, దాదాపు 1800 మీటర్ల ఎత్తులో మాక్ యొడ్ గంజ్ పేరిట రెండవభాగం చెలామణి అవుతోంది. పట్టణంలోని ఈ రెండు భాగాల్లోనూ ఉష్ణోగ్రతలో ఎంతో తేడా వుంటుంది. ఈ రెండు భాగాల్ని కలుపుతూ అనేక కొండబజార్లు వున్నాయి. జనసమ్మర్ధం గుండా వెళ్ళే ఆ బాటల్ని నడకతోనే చేరవలసి వుంటుంది. లేదా చాలా దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వుంటుంది.

ఢిల్లీ, చండీఘర్, సిమ్లా ల నుంచి McLeod Ganj కి గంట గంటకి బస్సులున్నాయి. రాత్రి వేళ బయలుదేరే డైరెక్టు బస్సుల సౌకర్యం ‘మనకెంతో సుఖప్రదంగా వుంటుంది. మాక్అయొడ్ గంజ్, టిబెట్ సంస్కృతీ నేత అయిన దలైలామా నివాసం! ధర్మశాలలో లోయర్ బ్రిటిష్ రాజ్యాధికారుల నివాసస్థలాలుండేవి. మరణించిన బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఎల్జిన్ని యిక్కడే సమాధి చేశారు. 1863 లో మరణించిన ఎల్జిన్ పేరిట పూర్తిగా ఆద్దాల గోడలతో కట్టబడిన ఓ చర్చి యిక్కడవుంది.
గత ‘ 35 ‘ ఏళ్ళుగా యిక్కడ నివసిస్తూన్న దలైలామా ధర్మశాలలోని ఊర్ధ్వభాగాన్ని ఎన్నుకుని తమ ఆశ్రమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. బ్రిటీష్ కాలంలో మాక్ లీయెడ్ అనే అధికారి యిక్కడ బస చేయటం మాక్డ్ గంజ్ లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టిబెటిన్ స్టడీస్ అండ్ లైబ్రరీ అనే విద్యాసంస్థ పనిచేస్తోంది.
మాక్ లీడ్ గంజ్ని ఓ లిటిల్ లాసా గానూ లేదా రెండో ఖాట్మండూ కూడా పరిగణించటం జరుగుతోంది. విదేశీయాత్రికుల బృందాలిక్కడ అధికంగా కనిపిస్తాయి. అంతటా టిబెట్ సంస్కృతి ప్రతిబింబిస్తూ వుంటుంది. గంజ్ (బజారు) లోని హోటళ్ళూ, అంగళ్ళూ అన్నింటిని కూడా టిబెట్ దేశీయులే నిర్వహిస్తున్నారు. వీధులన్నీ బౌద్ధాచార్యులతోనూ,లామాలతోనూ నిండి వుంటాయి. McLeod Ganj నుంచి కొండ బజార్ల ద్వారా ధర్మశాలకి రాకపోకలు సాగించే బౌద్ధమతాచార్యులు కాషాయ వస్త్రాలతో అడవుల మధ్యన ఆకుల్లో కదిలే ఎర్రని పూవుల్లా దూరం నుంచి కనిపిస్తూ వుంటారు. ‘ధవళగిరి’ ముఖ్య శిఖరం మాక్ యెడ్ గంజ్ నానుకుని ఆకాశంలోని చొచ్చుకుని పోతున్నట్లుగా కనిపిస్తుంది.
యాత్రికులు McLeod Ganj నివాసియైన దలైలామాని ఆయన నివాస స్థానంలో కలుసుకోవచ్చును. కాని ఆయన్ని కలుసుకోదలిచిన వాళ్ళు కనీసం ఓ నెల రోజులు ముందుగా అనుమతిని పొందాల్సివుంటుంది. 14వ చెసి జిగ్ మరియు బౌద్ధమతస్థుల ఆరాధ్యదైవం అయిన దలైలామాని కలుసుకోవటం కోసం దేశవిదేశాలనుంచి వచ్చిన అనేక యాత్రికులిక్కడ క్యూలో నుంచుని వుంటారు. దలైలామా తన దర్శనార్థం వచ్చిన ప్రతివ్యక్తినీ పలకరిస్తారు. ఆశీర్వదిస్తారు. ఆయన అక్కడ మతాతీతంగా ప్రవర్తిస్తారు. దగ్గరనుంచి మామూలు వ్యక్తిలా కనిపిస్తారు. కాని దూరం నుంచి చూసినపుడు ఆ గదినిండా ఆయనే వున్నట్లుగా భ్రాంతి కలుగుతుంది.
దలైలామా అందరినీ ఆహ్లాదంతో కలుసుకుంటారు. ప్రతివ్యక్తి చేతిని తన అరచేతిలో వుంచుకుని తమ శిరస్సుకు తగిలేలా ఎత్తుతారు. అడిగిన విషయాలకి క్లుప్తంగా నవ్వుతూ జవాబు చెబుతారు. యాత్రికుల వివరాల్ని ప్రేమతో తెలుసుకుంటారు. అదే ఆప్యాయతతో ప్రతివ్యక్తినీ తమ గది ద్వారం వెలుపలి దాకా వచ్చి 1989వ సంవత్సరంలో సాగనంపుతారు. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చినప్పటి నుంచి మాక్డ్ గంజ్కి విదేశీయాత్రికుల రద్దీ మరీ ఎక్కువయింది.

మాడ్ గంజ్లో దర్శకుల సౌకర్యార్థం అనేక హోటళ్ళు పనిచేస్తున్నాయి. రాకపోకలకు మాత్రం బస్సులన్నీ ధర్మశాలనుంచే బయలుదేరుతాయి. సంవత్సరంలో ఏ సమయంలోనయినా ఈ ప్రదేశాన్ని దర్శించవచ్చును. నంగ్యమై స్థూపం తమ మాతృ దేశం కోసం ప్రాణాలు అర్పించిన టిబెటన్ల స్మారకార్ధంగా నిర్మించినదీ స్థూపం. ఇది ఇండో టిబెటన్ల పద్ధతులకు అనుగుణంగా నిర్మించారు.
సెంట్రజాన్ చర్చ్ లోయర్ ధర్మశాల నుంచి కిందకు దిగుతుంటే లిటిల్ ప్లాసాకు బయట ఒక పెద్ద రాతి కట్టడం ఒకటి కనిపిస్తుంది. ఈ చర్చికి వున్న గ్లాసు కిటికీలని బాప్టిస్ట్ జాన్ జీసెస్లు మొట్టమొదటి సారిగా 1852 లో పెయింట్ చేశారు. ఈ చర్చి భవనంలో మాజీ వైశ్రాయి లార్డలెన న్ను సమాధి చేశారు.
దాల్ లేక్: ఒకసారి మహారాజు మణీమహేళలేక్లో స్నానం చేస్తుండగా ఆయన బంగారు వుంగరం జారిపోయింది. దాల్ లేక్ లో కనిపించింది. మణి మహేస్ `క్కు వెళ్ళలేనివారు దాల్ లేక్కు వెళ్ళి స్నానం చేస్తారు. గతంలో ఈ రెండు సరస్సులు ఒకటే. ఇప్పుడు అవి ఒక జంట మాదిరిగా తయారయినవి. ఈ సరస్సులోని జలాలు ఎంతో పవిత్రమైనవి.
భుంశూనాగ్ : ఇది దాల్ లేక్ అంత ప్రాచీనమైనది. ఇది పట్టణానికి రెండు కి.మీ. దూరంలో వుంది. ఇక్కడ భుంశూకు నాగరాజుకు బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఈ పట్టణం ఎక్కువసార్లు అలాంటి యుద్ధాలు ఎన్నోసార్లు కావటంతో పునర్నిర్మించబడింది. ఇక్కడ నుంచి మీరు కొంచెం దూరం కిందకు వెళితే ప్రశాంత నది కనిపిస్తుంది. మెక్లియోడ్ గంజ్ యొక్క ముఖ్యమైన బజారుల్లో టిబెటన్ కార్పెట్లు, ధంగ్స్, పౌంచోన్, జాకెట్లు, చౌబాస్, మాస్క్, వెండి మరియు స్టోన్ నగలు, లామ్స్, స్లీపింగ్ బ్యాగ్ లు లభిస్తాయి. ఇక్కడ యాత్రికుల సౌకర్యార్ధం హోటళ్ళు వున్నాయి.