Manali to Keylong Road Trip: The Ancient Route from India to Tibet-1

Manali to Keylong Road Trip: The Ancient Route from India to Tibet-1

Manali to Keylong Road Trip: The Ancient Route from India to Tibet;

Manali – Keylong రోడ్ ప్రయాణం: టిబెట్ కు దారితీసే భారతదేశపు అతి ప్రాచీన మార్గం
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లోని ఉత్తర ప్రాంతం సహజసిద్ధమైన అందాలతో, ఆధ్యాత్మికతతో, సాహస ప్రయాణాల అనుభూతులతో నిండి ఉంటుంది. Manali నుండి Keylong వరకు జరిగే ఈ ప్రయాణం, భారతదేశంలోని అత్యంత అపురూపమైన, తక్కువగా అన్వేషించబడిన ప్రాంతాలను పరిచయం చేస్తుంది. ఈ మార్గంలో ప్రసిద్ధ Rohtang పాస్ ద్వారా Lahaul మరియు Spiti వంటి విభిన్న సంస్కృతుల, వింత భౌగోళిక పరిస్థితుల కలయికను ఆస్వాదించవచ్చు.
ఇక, ఆధ్యాత్మికతకు మారుపేరైన మణికర్ణ, అక్కడి వేడినీటి చెరువులు మరియు మతపరమైన ప్రాధాన్యతతో ప్రతి పర్యాటకుడి మనసును తాకుతుంది. చివరగా, సట్లేజ్ వ్యాలీ తన సంపన్న సంస్కృతి, చారిత్రక ప్రాముఖ్యత, అపూర్వ ప్రకృతి దృశ్యాలతో ఈ హిమాలయ యాత్రను మరచిపోలేని అనుభూతిగా మార్చుతుంది. ప్రకృతి ప్రేమికులు, సాహసయాత్రికులు, లేదా సంస్కృతి అన్వేషకులు అయినా, ఈ ప్రాంతాలు అందరికీ ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి.

Manali నుంచి Keylong – పర్వతాల మధ్య ఓ అద్భుత ప్రయాణ గాధ:

భారతదేశం నుంచి టిబెట్కి వెళ్ళే అతి ప్రాచీన రోడ్డు మార్గం Manali నుంచి ప్రారంభం అవుతుంది.
Manali నుంచి Keylong షుమారు 110 కిలోమీటర్ల దూరంలో వుంది. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని ‘దానా’ అని పిలిచేవారు. ఆ తర్వాత ‘ధఫ్ – ‘డన్బార్’ అని పిలిచేవారు. బహుశా మొట్టమొదట మనాలీ లో నివసించిన యూరోపియన్ దేశస్థుడి పేరిట ఆ పేరొచ్చి వుంటుంది. ఇంగ్లీషు వాళ్ళ రాకపోకలతో పాత మనాలీకి దగ్గర్లోనే కొత్త మనాలీ వృద్ధి చెందింది.

Manaliలో మనాల్సూ నది ఎత్తైన కొండల మధ్య గుండా ప్రవహిస్తోంది. స్థల పురాణం ప్రకారం ‘మను అనే దేవర్షి స్వర్గం నుంచి నేరుగా యిక్కడికి వచ్చి దిగిపోయాడట. యిక్కడ నివసిస్తూనే ఆయన ‘మను ధర్మశాస్త్రాన్ని’ రచించాడట. ఆయన చూపిన ధర్మమార్గంలో ప్రయాణం చేస్తూ హిందూ
జాతి విశ్వవిఖ్యాతి నొందిందని చరిత్ర వివరిస్తోంది.

 Manali- మనాలీ

‘మనువు’ పేరిట Manali లో ఓ దేవాలయం వుంది. ఢిల్లీ నుంచి భుంటర్కి విమాన సౌకర్యం వుంది. ఈ విమానాశ్రయం మనాలీకి 50 కిలోమీటర్ల దూరంలో వుంది. ఢిల్లీ నుంచి రోడ్డు ప్రయాణం ద్వారా నేరుగా యిక్కడికి చేరుకోవచ్చును లేదా చండీఘర్ నుంచి కల్యా మీదుగా న్యారోగేజి రైలు మార్గం ద్వారా జోగిందర్ నగర్ స్టేషనులో దిగి వెళ్ళాలి. కాని, ఢిల్లీ నుంచి డైరెక్టు బస్సు ప్రయాణమే బాగా సౌకర్యంగా వుంటుంది.

‘ Keylong’ Lahaul Spiti లకి జిల్లా కేంద్రం! యిక్కడి మైదానాల్లో బార్లీ, గోధుమ పంట అధికంగా పండుతోంది. కేలాంగ్ పట్టణం చుట్టూ బ్రహ్మాండమయిన హిమాలయాలు పెద్ద గోడలవలె నుంచుని వుంటాయి. యిక్కడి ‘కాగ్’ ఓ అతి గొప్ప బౌద్ధారామంగా పేరు పొందింది. ఈ ఆరామం కేలాంగ్ కి మూడు కిలోమీటర్ల దూరంలో చంద్రభాఘా నదికి అవతలి వొడ్డున నెలకొని వుంది. కార్డింగ్ బౌద్ధారామాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చారిత్రకాధారాలున్నాయి. నోర్ బ్బూరున్పోచే అనే బౌద్ధబిక్షువు ఈ శతాబ్దపు తొలిదశలో దీన్ని పునర్నిర్మించారట. ఇక్కడి ఆలయాల గోడలపై బుద్ధుని జాతక కథల్ని చిత్రీకరించారు.

manali keylong travel

‘కిబ్బర్’ యిక్కడికి దగ్గరగా వున్న మరో పర్వత గ్రామం ! సముద్రమట్టానికి నాలుగువేల రెండొందల మీటర్ల ఎత్తులో నెలకొని వున్న ఈ గ్రామాన్ని ప్రపంచంలోనే అతి ఎత్తైన పల్లెగా పరిగణించటం జరుగుతోంది. ‘ధంకర్ ఒకప్పుడు ‘Spiti ‘ రాజవంశాలకు రాజధానిగా వుండేది. కాజాకి 24 కిలోమీటర్ల దూరంలో స్పితీ నది నానుకుని విస్తరించి వుందీ పట్టణం ! ఎంతో ఎత్తైన ఈ కొండ శిఖరం నదీ లోయలోకి తొంగిచూస్తున్నట్లుగా కనిపిస్తుంది.

‘చంద్రా’నదీ ‘భాషూ’ నదీ తుప్చింగ్’ లో కలుస్తాయి. ఈ సంగమ ప్రదేశాన్ని అతి పవిత్ర స్థానంగా భావించబడుతోంది. యిక్కడే అతి “ప్రాచీనమయిన గొంపాగురుగోంటాల్ బౌద్ధారామం
వుంది. ఈ బౌద్ధారామానికి ‘గురుపద్మసంభవ’ కూ అవినాభావ సంబంధంవుందని చెబుతారు. గురు పద్మసంభవుడు ఓ గొప్ప బౌద్ధమతాచార్యుడు. జూన్లో ఆయన పేరిట ‘ఘంటాల్’ అనే ఉత్సవం క్కడ జరుగుతుంది. 4500 మీటర్ల ఎత్తులో వున్న ‘కుంజామ్ కనుమ’ యిక్కడికి దగ్గరలోనే వుంది. ఈ కనుమ మార్గం వేసవి కాలంలోనే ప్రయాణికులకి ఉపయోగపడుతుంది. ‘గోంపా’ లేదా ‘తాబోగోంపా’ అనే ఓ గ్రామం లాహుల్స్పతీ లోయలోని అతిప్రాచీన బౌద్ధారామాలకి ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలోని మందిరాన్ని మొత్తం భారతదేశంలోనే అతి ముఖ్యమైన తీర్థస్థానంగా బౌద్ధమతస్థులు భావిస్తారు. ఇక్కడే అనేక బౌద్ధమత తాళపత్ర గ్రంధాలు నిలయాన్ని ఏర్పాటుచేసారు.
Manali – కేలంగ్ ప్రాంతాలన్నీ కూడా యాత్రికులతో ముఖ్యంగా బౌద్ధభిక్షువులతో ఎల్లప్పుడూ కిటకిటలాడుతూ వుంటాయి. ప్రకృతి శోభకి ప్రత్యక్ష దర్పణమయిన ఈ ప్రాంతాల్ని మే – సెప్టెంబరు మాసాల మధ్య కాలంలో దర్శించాలి!

Rohtang పాస్: హిమాలయాలకు ద్వారంలా నిలిచే సహసయాత్రికుల స్వర్గధామం – రోహతాంగ్ పాస్
The Gateway to the Himalayas – A Paradise for Adventure Seekers: రోహతాంగ్ Pass:

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమోత్తర హిమాలయాల్లోని ఈ Rohtang కనుమ చాలా ప్రసిద్ధి చెందిన ఓ విహారయాత్రా కేంద్రం! Manali నుంచి వేయబడిన రోడ్డుమార్గం ఈ ఎత్తైన చోట ఆగిపోతుంది. సముద్ర ఉపరితలానికి 4115 మీటర్ల ఎత్తులో వున్న ఈ రోహతాంగ్ శిఖరశ్రేణుల్లో నుంచే సాగుచేయబడుతోన్న పంటపొలాలు కొండలకి వేళ్ళాడతీసిన పచ్చతోరణాలుగా కనిపిస్తాయి.
Rohtang ‘ బీస్ కుండ్ ‘ ఓ దర్శనీయస్థలం ! బీస్ నది యిక్కడే ఉద్భవిస్తుంది. ఇక్కడికి దగ్గరలోనే పర్యాటకులని ఆకర్షించే దాసౌర్ సరస్సువుంది.

ఈ సరస్సులోనూ, బీస్ నదీ జలాల్లోనూ మత్స్యసంపద అధికంగా వుంటుంది. చేపలు పట్టటం యిక్కడి జనం ఓ హాబీగా భావిస్తారు. Rohtang సైయింగ్ క్రీడలు ప్రతి ఏటా మే మాసంలో జరుగుతాయి. అది కాకుండా ప్రతి ఫిబ్రవరిలోనూ వింటర్ స్పోర్ట్స్ యిక్కడి జరుగుతాయి. ఆ సందర్భంగా యిక్కడి యాత్రా గృహాలన్నీ కూడా రద్దీగా వుంటాయి.

రోహతాంగ్ పాస్ ఉత్తర హిమాలయాల్లోకి వెళ్ళేందుకు సౌకర్యాన్ని కల్పించే కనుమ ప్రాంతంగా భావించాలి. యిక్కడ అనేక హిమశకలాలు బ్రహ్మాండమయిన సైజులలో కొండలోయలోకి జారిపోతూ కనిపిస్తాయి. ఆ హిమశకలాలన్నీ కూడా మంచు మెట్లులా మనకంటికి పసందుగా గోచరిస్తాయి. రోహతాంగ్ కనుమ గుండా దృష్టిని సారిస్తే మనకి హిమాలయాల్లోని సోనేపానీ ‘ శిఖర దర్శనం కలుగుతుంది. అదే చోట మరో దిశలో గేపాంగ్ అనే ఓ హిమాలయపర్వతం జంట శిఖరాలతో కనిపిస్తుంది. ఓ చెప్పాలంటే రోమతాంగ్ దగ్గరగా వున్న హిమాలయాలన్నీ కూడా మంచు పిరమిడ్లలా మనల్ని భ్రమింపచేస్తాయి.

బీస్ నది ప్రవాహ మార్గానికి ఇరువైపులా కూడా మంచు భూములు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో ప్రయాణం కొద్దిగా యిబ్బందికరంగా వుంటుంది. అయినా కూడా జనం ఈ ప్రాంతాన్నే తప్పని సరిగా ఉపయోగిస్తుంటారు. రోహతాంగ్ పాస్ 4315 మీటర్ల ఎత్తులో వున్న’ దాసౌర్ ‘ సరస్సుని ‘ సారాకుండ ‘ అని పిలుస్తారు. అంతటి ఉన్నత స్థానంలో ఈ సరస్సు ఏర్పడటం ప్రకృతి వరప్రసాదంగానే భావించాలి. ఈ సరస్సులో స్నానం చేస్తే అనేక శరీర రుగ్మతలు తొలిగిపోతాయని స్థానికులు నమ్ముతారు.

Rohtang కనుమకి దగ్గర్లోనే ఓ బ్రహ్మాండమయిన మైదాన ప్రాంతం మనకి సాక్షాత్కరిస్తుంది. దీన్ని ‘ మర్షీ ‘ మైదానం అని పిలుస్తారు. ఈ మైదాన ప్రాంతం నానుకుని అనేక ప్రాంతాల్లో యాత్రికులు సౌకర్యార్ధం బస సౌకరాల్ని ఏర్పాటు చేస్తారు. యిక్కడి పర్యాటకులకు కావలసిన వస్తువులూ, పర్వతారోహకబృందాలకి కావలసిన అన్ని రకాల సామగ్రి లభిస్తుంది. అదీ కాకుండా రాత్రి పూట యిక్కడ బసచేసేందుకు ఎన్నో సౌకర్యాలు లభిస్తాయి.

రోహతాంగ్ కనుమకి దగ్గర్లోనే ‘Keylong’ అనే ఓ ప్రదేశం వుంది. ఇది Lahaul మరియు Spiti ప్రాంతానికి జిల్లా కేంద్రం ! యిక్కడ హిమాలయాలన్నీ కూడా ఉదయం పూట కాషాయరంగుతో కన్పిస్తాయి. రోహతాంగ్ నుంచి అనేక హిమాలయ శిఖరాలు మనకళ్ళకి స్పష్టంగా కనిపిస్తాయి. చంద్రానది పేరిట ఓ చిన్ననది. యిక్కడ ప్రవహిస్తోంది. రోహతాంగ్ ని బౌద్ధారామం చాలా ప్రసిద్ధి చెందింది. టిబెట్ దేశ సంప్రదాయాల్ని పుణికి పుచ్చుకుని ఈ ఆలయం నిర్మించబడిందంటారు.

టిబెట్ దేశీయులకు సంబంధించిన ‘కార్డింగ్ మోనస్టిరీ’ అనే బౌద్ధారామం చాలా పెద్దది. అనేక బౌద్ధ బిక్షువులీ మందిరంలో పూజలు జరుపుతూ వుంటారు.’శశూర్’ అనే మరే బౌద్ధారామం బౌద్ధమతస్థులకు చాలా పవిత్రస్థానంగా పరిగణించబడుతోంది. యిక్కడ అనేకమంది బౌద్ధమతాచార్యులు నివసిస్తూ వుంటారు. ఈ ఆరామంలో బౌద్ధమత బిక్షువులకు శిక్షణ లభిస్తుంది.
Rohtang లోని త్రిలోక్నాథ్ దేవాలయం యాత్రీకుల్ని బాగా ఆకర్షిస్తుంది. ‘బీస్’ని నదిని దాటి వెడితే అవతలిగట్టుపైన ప్రాచీనమైన ‘బోధిసత్వ’ దేవాలయం కనిపిస్తుంది. అక్కడ కూడా యాత్రీకుల రద్దీ అధికంగానే వుంటుంది.

Rohtang pass

ఢిల్లీ నుంచి, చండీఘర్ నుంచి Manali కి అనేక బస్సులు వస్తాయి. మనాలీ నుంచి రోహతాంగ్ కి అనేక రకాల వాహనాలు లభిస్తాయి. చక్కని వసతి సౌకర్యం అంతటా లభిస్తుంది. ఈ ప్రాంతంలో చలి అధికం కాబట్టి తగు మోతాదులో ఉన్ని దుస్తుల్ని ముందుగానే సమకూర్చుకోవాలి !

స్పితి:ఆధ్యాత్మికత, ప్రకృతి, ప్రశాంతత మేళవించిన Spiti లోయ
Spiti – The Mysterious Middle Land of Monasteries, Mountains, and Timeless Silence

ప్రకృతి దర్పణంలో ప్రతిబింబంచే అతి సుందర ప్రదేశం Spiti ! ఉత్తర హిమాచల్ ప్రదేశ్లోని అతి నిర్మానుష్య వాతావరణంలో నెలకొని వున్న ఈ భూతల స్వర్గాన్ని దర్శించగలిగిన మానవ జన్మ ఎంతో ధన్యం! మంచు ఎడారిలా పరిగణించబడిన ఈ ప్రాంతంలో కన్నులకు పండగ చేసే సౌందర్యం వెల్లివిరుస్తోంది. స్పితి యాత్ర అతిశ్రమతో కూడుకుని వుంది. స్పితీనది హిమాలయాల్లో పుట్టి దక్షిణదిశలోకి ప్రవహించి సట్లేజ్ నదిలో కలుస్తుంది.

Spiti ని చేరుకునేందుకు మానవుడు ఉపయోగించే ఆఖరి యంత్రసహాయక యాత్ర ‘కల్పా’ ఆగిపోతుంది. ”కిన్నెర కైలాశ్’ మార్గాన్ని ఉపయోగించటం ద్వారా లేదా ‘కులూ, Manali’ నుంచీ కూడా యిక్కడికి చేరుకోవచ్చును ! స్పితి ని చేరుకునేందుకు ఈ రెండు మార్గాలూ ఉపయోగంలో వున్నాయి. ముందుగా మనకిన్నోరీ దశని తీసుకుందాం! కిన్నోరీ నుంచి ‘కాజాని’ ట్రెక్కింగ్ చేస్తూ చేరుకోవాలి ! ‘కాజా’ ఆ నదిలోయలోని ఓ సుపరిచిత పట్టణం ! కాజాలో హిమాలయాలు అంచెలంచెలుగా బెలూన్లలా …. ఆకాశంలోకి తేలిపోతున్నట్లుగా కనిపిస్తాయి.

ఇక్కడి పర్వతాలు చలికి ప్రాణాన్ని పోస్తాయి. Spiti హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శిరః ప్రాంతంగా శోభిల్లుతోంది. సట్లేజ్ నదికి ఎదురీది మనం సృపతీనదిలో తేలుతాం ! మార్గమధ్యంలో మనకి ‘పిన్నది’ కూడా తగులుతుంది. స్పితీనది ‘కుడ్’ వద్ద సట్లేజ్ నదిలో సమాగమవుతుంది. పిన్నదీ లోయని ప్రభుత్వం ఓ ‘నేచురల్ సాంక్చేరీ’ గా తీర్చిదిద్దింది. ఈ ప్రాంతంలోని హిమశిఖరాలు 5400 మొదలుకుని 7000 మీటర్ల ఎత్తులో మనకు దర్శనమిస్తాయి.

spiti valley

ఈ హిమగిరి ప్రాంతంలో ‘Spiti ‘ ఓ ఒంటరి ఒయాసిస్సులా కనిపిస్తుంది. ఇక్కడ వేసవి కూడా విజృంభిస్తుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రత 40° సెంటీగ్రేడుని దాటిన సందర్భాలు కూడా వున్నాయి. అయితే ఉదయం నుంచీ సాయంత్రం దాకా నిప్పులు చెరిగిన వాతావరణం కాస్తా రాత్రయేసరికల్లా అతిశీతల పవనాల్ని సృష్టిస్తూ ఉంటుంది. ‘స్పితీ’ నదీతీరంలో నివసించే ప్రజలు బౌద్ధమతాన్ని గౌరవిస్తారు. అందుకే కాబోలు యిక్కడ ఎన్నో బౌద్ధారామాలు వున్నాయి. టిబెట్ సంప్రదాయాల్ని కూడా యిక్కడి జనం గౌరవిస్తారు.


ఇక్కడి ఉత్తుంగ పర్వత సానువుల్లోని ప్రతి శిలపైనా కూడా టిబెట్ దేశీయ నాగరికతా చిహ్నాలు కనిపిస్తాయి. జనవాస ప్రాంతాల్లో పారవేసిన ప్రతి శిలపైనా టిబెట్ దేశస్థులు చెక్కిన శాసనాలూ, శిల్పాలూ కనిపిస్తాయి. ఇక్కడి ప్రశాంత జీవన వాతావరణంలో జనచైతన్య పతాకాలు ఎగురుతూ కనిపిస్తాయి. ఆ పతాకాలపై ‘ఓం మణి పద్యేహం ! అను సూక్తి టిబెట్ లిపిలో కనిపిస్తుంది. యిక్కడ మనకి కనిపించే శిలాశాసనాల్ని తాకితే అవి జనానికి హాని చేస్తాయన్న ఓ వదంతి చాలా ప్రచారంలో వుండటం వల్ల ఆ శాసనాలూ, శిలా చిత్రాలు ఎక్కడ చూసినా మనకి కనిపిస్తూ వుంటాయి.

స్పితి లో అనేక బౌద్ధారామాలు వున్నాయి. ఇక్కడ బౌద్ధమత పునరుద్ధీకరణకు సంబంధించిన అనేక గ్రంథాలు లభిస్తాయి. కాజా నుంచి యిక్కడకి రోడ్డు మార్గంలో కూడా చేరుకోగలం ! ‘జై’ అనే ఓ గ్రామంలో బౌద్ధారామాలు అధికంగా వుండటం గమనార్హం! ‘జై’ ని చేరుకునేందుకు మనం నేషనల్ హైవే 22 ను వుపయోగించవలసి ఈ మధ్యనే ఈ మార్గాన్ని పునరుద్ధరించారు. ‘జై’ లో వుంటుంది. సంవత్సరానికోసారి బౌద్ధమతోత్సవాలు జరుగుతాయి. అపుడు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోని బౌద్ధ బిక్షువులూ యిక్కడికి తరలి రావటం జరుగుతుంది. యిక్కడి బౌద్ధదేవాలయాల్లో అనేక మంది లామాల శిల్పాకృతులు మనకి కనిపిస్తాయి. Spiti సౌందర్య దర్శనానికి ప్రతీక ! బౌద్ధమతారాధకులకు ఓ ప్రముఖ ఆరాధనా వేదిక !

స్పితి ని చేరుకోవటం కష్టతరమైనా అక్కడి జనవాసంతో కలిసిపోయాక ప్రయాణంలోని బడలిక కాస్తా మటుమాయమయిపోతుంది. ! దాపులోని హిమాలయాలన్ని వృక్షహీనాలుగా కనిపిస్తాయి. కరుగుతూన్న మంచు సెలయేర్లుగా ప్రవహించటం సాక్షాత్కరిస్తుంది. ‘స్పితి ‘ గ్రామంలో మాత్రం ‘నాకో’ సరస్సు కనిపిస్తుంది. అక్కడే ఓ ఊరు వెలిసింది. అంచెలంచెలుగా ఎదిగిన ఆ గ్రామీణ వాతావరణం వెనుకాల కనిపించే హిమశిఖర పర్యవేక్షణ ఒక్కటే పర్యాటకులకు ముఖ్యాకర్షణగా భావించ రూపుదిద్దుకుంది. స్పితి ని ఏప్రిల్, మే మాసాలలో దర్శించడం శ్రేయస్కరం.

లాహుల్: లాహుల్ – సహజసిద్ధత, శాంతి, సాహసానికి నిలయమైన లోయ
Lahaul – Where Silence Meets the Snowy Himalayas


లాహుల్ లోయ Spiti వ్యాలీ నానుకుని వుంటుంది. ఈ ప్రాంతంలోని పర్వతాలన్నీ కూడా సంపూర్ణ హిమాచ్ఛాదితాలు ! ఈ లోయంతా కూడా 3000 నుంచి 5000 మీటర్ల ఎత్తులో వున్న హిమశిఖర భరితంగా వుంటుంది. యిక్కడి కొండలపై అనేక బౌద్ధారామాలు కనిపిస్తాయి.

Lahaul ని చేరేందుకు మార్గం Rohtang పాస్ ద్వారా సాగుతుంది. 1977 వ సంవత్సరం దాకా ఎవరినీ రోహతాంగ్ కనుమని దాటి పైకి వెళ్ళనిచ్చేవారు కాదు. కాని ఈ మధ్యకాలంలో వాహన సౌకర్యాలూ, పర్వతారోహణ పరికరాలూ, శరీరారోగ్య పద్ధతులూ మెరుగవటం చూసి Manali కి 117 కిలోమీటర్ల దూరంలో వున్న లాహూల్ Keylong ని దర్శిచటానికి అనుమతి లభిస్తూండటంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల సందడి బాగా పెరిగింది.

Lahaul లోమ టిబెట్ సంస్కృతికి సంపూర్ణ ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఉత్తర దిశలో లఢాక్, దక్షిణ దిశలో కుటూ, తూర్పున టిబెట్ దేశం ఎల్లలుగా గల ఈ ప్రాంతం నిశ్శబ్ద సుందర ప్రకృతికి నిలయం ! లాహుల్ లోని చాలాభాగం దర్శించేందుకు అనువుగా లేదు. అయినా కూలూ సాహసయాత్రలు చేయదలుచుకున్నవాళ్ళు ముందుగానే ప్రభుత్వ అనుమతిని పొందాల్సి వుంటుంది. 1989 వ సంవత్సరం వరకూ ఈ ప్రాంతం అంతా కూడా జీపు ప్రయాణానికి అనుకూలంగా వుండేది.

కాని విరిగిపడిన ఎత్తైన హిమశకలాల వల్ల ఈ మార్గం కొంతకాలంగామూతపడిపోయింది. అయితే Keylong నుంచి ‘లే’ కి వెళ్ళే మార్గం ద్వారా మాత్రం Lahaul లోని అధిక ప్రాంతాల్ని దర్శించగలిగే అవకాశం వుంది. జంక్సర్ లోయలోని ‘పాడమ్’ నుంచి లఢక్ మార్గం ద్వారా కూడా మనం ఈ ప్రాంతాన్ని దర్శించగలం ! లఢక్ మరియు జంక్సర్ ప్రాంతాలు ట్రెక్కింగ్కి ఎంతో అనుకూల వాతావరణాన్ని కలిపిస్తాయి.

లాహుల్ లో చలి అత్యధికంగా వుంటుంది. అందుకే ఈ ప్రాంతంలో వృక్షసంతతి చాలా తక్కువగా వుంటుంది. కనుచూపు మేరంతా కూడా ఖాళీ మైదానాలు సాక్షాత్కరిస్తాయి. కొండలూ, కొండ చెరియలూ బోసిగా కనిపిస్తాయి. మండు వేసవిలో చూడా యిక్కడి చలి అధికంగా వుంటుంది. కాని అంతటి శీతల వాతావరణంలోనూ మనకి ఎండ తీవ్రత సులభంగానే తెలిసివస్తుంది. శీతాకాలంలో హిమపాతం ఎప్పుడూ రికార్డు స్థాయిని దాటుతూ వుంటుంది. కనుమలన్నీ కూడా మూతపడిపోతాయి. ఆ సమయంలో యిక్కడ Lahaul లో బౌద్ధమత ప్రభావం అధికంగా కనిపిస్తుంది.

Lahaul  holiday tour

యిక్కడ మనకు టిబెట్ దేశీయులే కాకుండా తాంత్రిక బౌద్ధ సిద్ధాంతులు కూడా తటస్థపడుతారు. ఇక్కడి ప్రజలు అనేక రకాల దేవతలని పూజిస్తారు. ఇక్కడి బౌద్ధారామాల్ని ‘గోంపాస్’ (గుంపాలు) అంటారు. లాహుల్ లో బౌద్ధ బిక్షువులూ, టిబెటన్ లామాలూ, కఠినమైన తమ తమ సాంప్రదాయల్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఇక్కడి జనజీవన సరళి, లడాకీ జనజీవన సరళీ దాదాపు ఒకే
రంగా వుంటాయి.

ఇక్కడి ప్రాచీన ఖార్డింగ్, ‘తాయాల్’ మరియు ‘గురుఘంటాల్’ బౌద్ధారామాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ‘గోండ్లా’ అనే ఓ ఎనిమిది అంతస్థుల మేడ నేటికీ చెక్కుచెదరకుండా నుంచుని వుంది. చారిత్రకంగా ఈ భవనం ఎంతో ప్రాచార్యాన్ని సంతరించుకుంది.
‘గోందా’ నుంచి ‘Keylong‘ వెళ్ళే మార్గం ‘చంద్రాబాఘా’ నదీ తీరం వెంటే సాగుతుంది. ‘చినాబ్’ లోయకి పశ్చిమోత్తరదిశలో ‘కిలార్’ అనే ఓ ప్రదేశం వుంది. అక్కడ మనం ఆరుచేతులు గల త్రిలోకనాథుని ‘అవలోకితేశ్వర రూపంలో దర్శిస్తాం ! ఈ ప్రతిమని చలువరాతి నుపయోగించి తయారుచేశారు. ఇక్కడికి దగ్గరలోనే ‘ఉదయపూర్’ ! అనే గ్రామంలో ‘మృకులాదేవి’ మందిరం కనిపిస్తుంది. ఈ దేవాలయం 10-11 వ శతాబ్దకాలం నాటిదిగా చెప్పబడుతోంది.

‘నాచర్’ అనే మరో దర్శనీయస్థలం టిబెట్కి వెళ్ళే రాజమార్గంలో వుంది. ఈ ‘నాచర్ ‘ని దాటి యింకా ముందు కెళ్ళేందుకు మనం ప్రభుత్వ అనుమతిని పొంది వుండాలి !
మే – సెప్టెంబర్ మాసాల మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని దర్శించవచ్చు.

మణికర్ణ – వేడినీటి పొంగిపొర్లే స్నానఘాటల మధ్య ఆధ్యాత్మికతకు నిలయం
Manikaran – A Sacred Himalayan Haven of Hot Springs and Spiritual Legends

పశ్చిమ హిమాలయాల్లోని కులూ లోయ ప్రాచీన హిందూ దేశ సంస్కృతికి పీఠంగా కొనియాడబడింది. అనేక హిందూ దేవాలయాలు, యిక్కడి సుందరమైన ప్రకృతి కౌగిలిలో నిలిచి వున్నాయి. ఈ హియాలయాల పర్వత సానువుల్లో నెలకొనివున్న అనేక పుణ్యక్షేత్రాల్ని దర్శించేందుకు నిరంతరం యాత్రికులు రాకపోకల్ని సాగిస్తూనే వుంటారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులూ లోయలో నెలకొని వున్న ‘మణికర్ణ’ ఓ పవిత్ర యాత్రా స్థలంగా చెప్పుకోబడుతోంది. కులూ పట్టణం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ పవిత్ర భూమిలో వేడి నీటి బుగ్గ బావులున్నాయి. పార్వతీ నదీతీరంలోని ఈ శీతల యాత్రాకేంద్రం సంవత్సరం పొడవునా యాత్రికులతో కిటకిటలాడుతూనే వుంటుంది.

ఢిల్లీ నుంచి కులూకు చేరుకునేందుకు వాయుదూత్ సౌకర్యం వుంది. సిమ్లా నుంచి యిక్కడికి రోడ్డు మార్గంలో కూడా చేరుకోగలం. స్థలపురాణం ప్రకారం ఆకాశంలో విహరిస్తోన్న పార్వతీ పరమేశ్వరులు కులూలోయ సౌందర్యాన్ని వీక్షిస్తున్న సమయంలో ఆ పార్వతీ దేవి చెవి నుంచి ఆభరణం ఒకటి ఈ ప్రాంతంలో నేలపైకి రాలిందట.. పార్వతీ మాత మణికర్ణిక రాలిన చోట కాబట్టి ఈ ప్రాంతం ‘మణికర్ణ’ అనే పేరుతో ఓ యాత్రా స్థలంగా మారిపోయింది. ఇక్కడి శివాలయం అతి ప్రాచీనమయినది.

delhi to kullu valley vaction plan

ఇక్కడి ఉష్ణజల గుండాల్లోని నీరు మరుగుతూ కనిపిస్తుంది. యాత్రికులు తమ వెంట తెచ్చుకున్న బియ్యాన్ని, పప్పు దినుసుల్ని, బంగాళాదుంపల్ని గుడ్డ సంచుల్లో కట్టి వేళ్ళాడదీసి ఆ నీటిలో ముంచి ఉడికిస్తారు. ఆ వేడి నీటి బుగ్గ బావుల్లో స్నానం చేస్తే చర్మ రుగ్మతలు తొలగిపోతాయంటారు.
మణికర్ణలోని సిక్కులకు సంబంధించిన గురుద్వారా కూడా ఓ పవిత్ర యాత్రాస్థలంగా చెప్పుకోబడుతోంది.

యిక్కడి నుంచే పుల్లా, పిన్న పార్వతీ కనుమల మార్గం ఆరంభమవుతుంది. ఈ పార్వతీ నది ఒడ్డునే కాసోల్ వేసవి విడిది కేంద్రం వుంది. ఆ పల్లపు పార్వతీ లోయలోని ‘కాసోల్’ అనే ప్రాంతంలోని మైదానం అతి విశాలంగా వుంటుంది. ప్రాంతాన్నానుకుని వున్న అనేక పర్వత పానువుల్లోని పుష్ప సౌందర్యం వర్ణించనలవికానిది. పార్వతీ నదిలోని నీరు నిర్మలంగా వుంటుంది. నదీ తీరంలో మట్టికి బదులుగా తెల్లని ఇసుక కనిపిస్తుంది. నదిలోని మత్స్యసంపదని అంచనా వేయలేము. చేపల వేటతో చాలా మంది ఇక్కడ కాలక్షేపం చేస్తుంటారు.

కులూకి దక్షిణ దిశలో ‘సైంజ్’ మరియు ‘తీర్థాన్’ అను రెండు చిన్న నదుల కలయిక ప్రాంతాన్ని ‘లార్జీ అంటారు. లార్జీ ఓ చిన్న గ్రామం ! ఇక్కడ కలిసిన ఈ రెండు నదుల జలాలు అక్కడికి కొద్ది దూరంలోనే వున్న బీస్ నదిలో కలుస్తాయి. ఈ ఉపనదుల సంగమ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం తప్పక దర్శించతగ్గది.! ఈ నదుల సమాగమాన్ని తీరిగ్గా దర్శించే విధంగా ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం ఓ విడిది గృహాన్ని నిర్మించింది. అప్పటి నుంచీ యిక్కడి పర్యాటకుల సంఖ్య అధికమై పోయింది. నదుల్లో ‘ఫిషింగ్’ జోరుగా సాగుతుంది. యిక్కడ లభ్యమయ్యే ‘ట్రౌట్’ చేపకు బాగా గిరాకీ వుంటుంది.

‘తీర్థాన్’ నదికి కొద్దిగా ఎగువ ప్రాంతంలో 1535 మీటర్ల ఎత్తులో ‘బంజార్’ అనే గ్రామం వుంది. యిది ఓ పవిత్ర యాత్రాస్థలం ! ఇక్కడ ఋషి ఋష్యశృంగ గుడి మందిరం వుంది. ప్రతి ఏటా యిక్కడ ఓ ఉత్సవం జరుగుతుంది.

‘కట్రాయిన్’ లోని పళ్ళ ఉత్పత్తి అధ్యయనం కేంద్రం చాలా ప్రఖ్యాతిగాంచింది. ఉంటుంది. Manali లోయకు ‘కట్రాయిన్’ ముఖద్వారంగా పరిగణించవచ్చును. కూడా యిక్కడ పనిచేస్తుంది. యిక్కడి లోయ అతి విశాలంగా ట్రౌట్ చేపల అభివృద్ధి కేంద్రం మణికర్ణ యాత్రకు పై ప్రదేశాలన్నింటనీ అనుబంధ యాత్రలుగా చేసుకోవాలి. అలా చేయటం వల్ల ఖర్చూ, సమయం రెండూ కూడా ఆదా అవుతాయి. ఏప్రిల్ – నవంబరు మధ్యకాలం ఈ యాత్రకు అనుకూలంగా వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *